19, ఆగస్టు 2023, శనివారం

యదార్థ సంఘటన

 



ఆమె ప్రభుత్వ కార్యాలయంలో స్వీపర్.

ఆరోజు ఆమె ఉద్యోగ విరమణ కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఆమె రోజులాగే ఆఫీసులో అన్ని గదులు ఊడ్చి సిబ్బందితో రోజు మాదిరే సంతోషంగా గడుపుతూ ఉంది,సిబ్బంది మాత్రం మమ్మల్ని విడిచి పోతున్నావు అంటూ భావోద్వేగాలతో కళ్ళు చెమర్చుతున్నాయి.

సాయంత్రం 5 గంటలయ్యింది,సిబ్బంది బొకేలతో హడావుడిగా వున్నారు,

అంతలో జిల్లా కలెక్టర్ కారు వచ్చి ఆగింది,కలెక్టర్ కారు దిగి నేరుగా అస్వీపర్ వద్దకు వెళ్లి ఆమె కాళ్లకు దండం పెట్టాడు,మరో పెద్దకారు వచ్చి ఆగింది,ఆకారులో పెద్ద పేరున్న సివిల్ ఇంజనీర్.ఆయన కూడా వచ్చి అస్వీపర్ కాళ్లకు దండం పెట్టాడు.మరో కారు వచ్చింది,ఆకారులో పేరున్న గుండె వైద్య నిపుణులు వచ్చి రాగానే ఆస్వీపర్ కాళ్ల మీద నన్ను క్షమించమ్మా 5నిమిషాలు ఆలస్యంగా వచ్చాను అని ప్రాధేయపడ్డాడు.ఈ ముగ్గురూ(కలెక్టర్,సివిల్ ఇంజనీర్,గుండె వైద్య నిపుణులు)అస్వీపర్ కుమారులట. అక్కడ వాతావరణం అంతా నిశ్శబ్దంగా మారింది.అందరి కళ్ళలో కన్నీళ్లే.స్వీపరుగా పని చేస్తూ కుమారులను చదివించానని,నాకష్టాన్ని పిల్లలు వృధా చేయలేదని,స్వీపరుగా నాఉద్యోగం ఆనందంగా నిర్వహించానని ఇంతకంటే నాకు మాటలు రావటం లేదంటూ, ఇక్కడి ఆఫీసుని, సిబ్బందిని వదిలి వెళ్తున్నందుకు బాధగా ఉందని కన్నీళ్ళు తుడుచుకుంటూ ప్రసంగాన్ని ముగించారు.(బీహార్ లోని ఓప్రభుత్వ కార్యాలయంలో జరిగిన యదార్థ సంఘటన).

కామెంట్‌లు లేవు: