28, సెప్టెంబర్ 2023, గురువారం

రామాయణమ్ 338

 రామాయణమ్ 338

...

శాంతించండి,మీరంతా కాస్త ప్రశాంతముగా ఆలోచించండి !

.

నాయనలారా ! ఏదేని ఒక కార్యమును సామ,దాన,భేదములను మూడు ఉపాయముల ద్వారా సాధించలేనప్పుడు మాత్రమే దండోపాయముమునకు పూనుకొనవలెను.

.

ఏమరపాటుగా ఉన్నవారు 

ఇంకొక శత్రువుచేత ఆక్రమింపబడినవారు

దైవము ప్రతికూలముగా ఉన్నవారు

ఇలాంటి వారివిషయములో బాగా పరీక్షించి  పరాక్రమము ప్రదర్శించినచో అది సఫలమగును.

.

ఆ రాముడు బలవంతుడు ,ఏమరుపాటులేనివాడు,జయించవలెనన్న పట్టుదలతోఉన్నవాడు,ఆయన కోపమును జయించినవాడు ,ఎదిరింపశక్యము కాని వాడు మహాబలవంతుడు !! ఆయనను ఏవిధముగా ఎదిరింపగలమని అనుకొను చున్నారు ?

.

అసలు అంతకుమునుపు ఎవడైనా సముద్రమును దాటివచ్చి లంక చేరగలిగినాడా ?..హనుమంతుడు వచ్చి సీతాదేవిని చూసి మాటలాడి ,లంకను తగులపెట్టి తిరిగి వెళ్ళిపోయినాడు . అసలు ఇటువంటి సంఘటన జరుగ గలదు అని మనము ఎప్పుడైనా కలలోనైనా ఊహించినామా?

.

రాక్షసరాజు జనస్థానమునుండి రాముని భార్యను అపహరించినాడు రాముడు ఏ అపరాధము చేసినాడని సీత అపహరణకు గురి అయినది ? మనకు రాముడి వలనజరిగిన అపకారమేదైనా ఉన్నదా?

.

మన ఖరుడిని చంపినాడు అని అందురేమో !! స్వీయరక్షణ ఏ ప్రాణి చేయకుండును ? మితిమీరి ప్రవర్తించిన ఖరుని రాముడు చంపినాడు అందులో దోషమేమున్నది ?

.

సీత మన లంకకు వినాశ హేతువు ! తీసుకొని వచ్చిన ఆమెను మరల వెనుకకు పంపివేయవలెను ! అనవసర కలహముల వలన ఏమి ప్రయోజనము ?

...అనుచూ విభీషణుడు ప్రసంగింస్తూనే ఉన్నాడు.

.

NB 

.

కామందక నీతి అని ఒక నీతి ఉన్నది !ఎప్పుడు శత్రువుపై దండెత్తవచ్చును ..దీనిని

Political Strategies, Corporate wars కు కూడా అన్వయించుకొనవచ్చును.

.

శత్రవు బాలుడైనప్పుడు

శత్రువు వృద్ధుడైనప్పుడు

దీర్ఘరోగి

జ్ఞాతులచే వెలివేయబడ్డవాడు

పిరికివాడు

పిరికి పరిజనము ఉన్నప్పుడు

లోభము కలవాడైనప్పుడు

ప్రజలయొక్క ప్రేమ కోల్పోయినప్పుడు

....ఇంకా వున్నాయి..అవి రేపు

.

వూటుకూరు జానకిరామారావు 


.


.

కామెంట్‌లు లేవు: