28, సెప్టెంబర్ 2023, గురువారం

🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -59 &60🌹*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -59 &60🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


తిరుమల మహాద్వారానికి ఎదురుగా నాలుగు పొడవైన స్తంభాలతో వున్న చిన్న మండపాన్ని కట్టించిన గొల్లపడుచు. తిరుమల దేవాలయం నిర్మించే సమయంలో ఆమె అత్తగారు కొండకు పోయి అమ్ముకొని రమ్మని పాలూ, పెరుగూ ఇచ్చి పంపేది. ఆమె ఆ శిల్పులను అన్నలని పిలుస్తూ చనువుగా వుండేది.


 ఒక రోజు ఆమె శిల్పులతో అన్నలారా నా పేరున కూడా ఒక మండపం కట్టండి అని వేడుకోగా, ఆ శిల్పులు చెల్లెలా ముందే చెప్పలేకపోయావా పై నుండి వచ్చిన (బెజవాడ దుర్గమ్మ పంపిన) సొమ్మంతా అయ్యిపోయింది అన్నారట. 


అప్పుడు ఆ గొల్ల పడుచు అన్నలారా ఆ డబ్బుతో కడితే నా పేరేమి నిలుస్తుంది నా డబ్బుతో కడితే నిలుస్తుంది కానీ, మా అత్తగారు చెప్పిన దాని కంటే మీకు అణా ఎక్కువకి పాలూ, పెరుగూ అమ్మాను ఆ డబ్బును మూడు కొండ రాళ్ళను ఒక దగ్గరకు చేర్చి ఆమధ్యలో దాసుకొన్నాను ఆ డబ్బుతో కట్టండని కట్టించిందట అదే నేటి గొల్ల మండపం.......... (కోర్ల సంబరం లోని కథ ఇది.)


*✓తీర్థములు:*


*తుంబుర తీర్థము:*

తిరుమలలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఉత్తరదిశలో, సుమారు 16 కిలోమీటర్ల దూరంలో ఉంది తుంబురతీర్థం. తుంబురుడి పేరుమీద వెలసిన ఈ తీర్థంలోనే స్వామి భక్తురాలైన తరిగొండ వెంగమాంబ తన అవసానదశను స్వామి ధ్యానంలో గడిపిందన్న నిదర్శనాలు నేటికీ అక్కడ ఉన్నాయి.


 కొన్ని వేల సంవత్సరాల క్రితం తిరుమల కొండల్లో ఒక ప్రళయం వచ్చింది. అప్పుడు ఒక కొండ రెండుగా చీలిపోవడం వల్ల తుంబురతీర్థం ఏర్పడింధి. ఫాల్గుణ పౌర్ణమి నాడు మాత్రమే ఈ ప్రాంతానికి వెళ్ళడానికి అనుమతిస్తారు.


*పాండవ తీర్థం:*


పాండవ తీర్థం తిరుమలలో ఉంది. దీనికే గోగర్భ తీర్థమనీ పేరుంది. వేంకటేశ్వరాలయానికి ఈశాన్య దిశలో మైలు దూరంలో ఉన్న పాండవతీర్థంలోనే పాండవ సహోదరులు ఏడాదికాలం నివసించారని ఐతిహ్యం. వైశాఖమాసంలోశుక్లపక్ష ద్వాదశిరోజు, అదీ ఆదివారం అయితే, పాండవతీర్థంలో స్నానం చేయటంకానీ లేదా కృష్ణపక్ష ద్వాదశీ మంగళవారం నాడు స్నానం చేయటంకానీ మంచిదని భక్తులు భావిస్తారు. 


ఆ రెండు రోజులూ స్నానం చేయటం సకల శ్రేష్ఠం.

• తిరుమల శ్రీవారి ఆలయానికి సుమారు 2 కి.మీ దూరంలో పాండవ తీర్ధంఉంది. పాండవులు ఈ తీర్ధంలో స్నానం చేయడం వల్ల పాండవ తీర్ధం.ఈ స్నాన ఫలం వల్ల పాండవులకు సమర విజయం., రాజ్య ప్రాప్తి కలిగిందని వరహః పురాణం చెబుతుంది.

• 

జ్ఞాతులయిన కౌరావులను చంపడం వల్ల కలిగిన పాపాన్ని పాండవులు ఈ తీర్ధస్నానంవల్ల పోగొట్టుకోన్నారని పద్మ పురాణం విశాదికరిస్తుంది 20 వ శతాబ్దంలో ఆంధ్రప్రదేశ్లో సంఘ సంస్కర్తగా ఆధ్యాత్మ విద్యావ్యాపకుడుగా ప్రసిద్ధి వహించిన శ్రీ మలయాళ స్వాములవారు ఏర్పేడు ఆశ్రమం స్థాపించడానికి ముందు ఈ ప్రాంతంలోనే కఠనమయిన తపస్సు చేశారు.


తిరుమల తిరుపతి దేవస్తానం వారు అనుమతించగా ఏర్పేడు వ్యాసాశ్రమంవారు అందమయిన భవన నిర్మాణం ఇక్కడ చేపట్టారు వృషభరాశిలో సూర్యుడు సంచరించే వేళా శుక్ల పక్షంలో గాని కృష్ణపక్షంలోగాని, ద్వాదశి తిదిలో ఆది, మంగళవారాలలో ఈ తీర్ధంలో స్నానం చేయడం పవిత్రమని, ప్రశస్తామని పెద్దలంటారు


*దేవతీర్థం:*


తిరుమలలో శ్రీవారి ఆలయానికి వాయవ్యదిశలో ఉంది ఈ దేవతీర్థం. పుష్యమీ నక్షత్రం కలిసిన గురువారంకానీ శ్రవణానక్షత్రయుక్తమైన సోమవారం నాడుకానీ ఈ తీర్థస్నానం వల్ల పాపాలు నశించి, దీర్ఘాయువు వరమై, ఆ తర్వాత మోక్షసిద్ధి కలుగుతుందని ప్రతీతి.


*కుమారధారాతీర్థం:*


కుమారధారాతీర్థం తిరుమల కొండల్లో శ్రీవారి ఆలయానికి వాయవ్యదిశలో, సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. మాఘపౌర్ణమినాడు ఈ తీర్థంలో పవిత్రస్నానం పరమ పుణ్యప్రథమంటారు. ఆనాడు అక్కడ, స్వామివారి ఆలయం నుంచి ప్రసాదాన్ని తెచ్చి భక్తులకు పంచటం మరో విశేషం.


కుమారస్వామి ఇక్కడే శ్రీవారి అష్టాక్షర మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేసిన కారణంగానే ఈ తీర్థానికి కుమారధారాతీర్థమన్న పేరు వచ్చింది.


*జాబాలి తీర్థము:*


జాపాలి. ఈ ఆలయం తిరుమలలో ఉన్నది. ఇది పాప వినాశం నకు పోవు మార్గం లో ఒక మలుపు వద్ద ఆంజనేయుని ముఖ మార్గం కనిపిస్తుంది.


ఇక్కడ భగవాన్ హనుమంతుడు వెలిశి ఉన్నారు. ఈ ఆలయం సమీపమునక వెళ్లే కొద్ది ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది.ఎందుకంటే ఇక్కడ ఆ ఆంజనేయడు కొలువై ఉన్నారు. చుట్టూ అడవి, ఆలయం ముందు కొలను ఎంతో మనోహరంగా ఉంటాయి. 


*శేష తీర్థము:*


తిరుమల లోని ఒక పుణ్య తీర్థం .ఇది పపవినాసనం నుండి కొన్ని మైళ్ళు అడవిలో నడచి చేరుకోవాలి. ఈ తీర్థంలో స్నానం చేసినట్లయితే వారికి మరుజన్మ ఉండదు. 


ఈ తీర్థానికి వెళ్ళటం చాలా కష్టం. పర్వతాలను ఎక్కడం కష్టపడటమే కాక చిన్న ప్రవాహాలను దాటాలి. ఇక్కడ పాచి పట్టి ఉంటుంది. జాగ్రత్తగా దాటాలి. ఈ తీర్థం యొక్క విశేషం ఏమిటంటే ఆదిశేషుడు శిలారూపంలో ఉంటాడు. ఇదే కాక ప్రత్యేకంగా కొన్ని నాగుపాములు ఈ తీర్థంలో తిరుగుతూనే ఉంటాయి. దేవాలయానికి పదికిలోమీటర్ల దూరంలో ఉంది.


*కపిలతీర్థం:*


 శేషాద్రికొండ దిగువన, ఏడుకొండలకు వెళ్ళే దారిలో ఉంది. కపిల తీర్ధమునకు చక్రతీర్థం లేదా ఆళ్వార్ తీర్థం అని కూడా పిలుస్తారు. కృతయుగములో పాతాళలోకంలోకపిలమహర్షి పూజించిన కపిలేశ్వరస్వామి, ఏవో కారణాలవల్ల, భూమని చిల్చుకొని, ఇక్కడ వెలిసినట్లుగా చెప్తారు. 


అందులో ఇది 'కపిలలింగం'గా పేరొందింది. త్రేతాయుగములో అగ్ని పూజించిన కారణంగా 'ఆగ్నేయలింగం' అయి, ఇప్పుడు కలియుగంలో కపిల గోవు పూజలందుకుంటోంది. ముల్లోకాలలోని సకల తీర్థాలూ ముక్కోటి పౌర్ణమి నాడు మధ్యాహ్నం వేళ పది ఘటికల (నాలుగు గంటల) పాటు కపిలతీర్థంలో నిలుస్తాయని ప్రతీతి.


 ఆ సమయంలో అక్కడ స్నానం చేసి, నువ్వు గింజంత బంగారాన్ని దానం చేసినా, అది మేరుపర్వత సమాన దానంగా పరిగణింపబడుతుందని భక్తుల విశ్వాసం. కార్తిక మాసం నందు వచ్చు కార్తిక దీప పర్వ దినాన ఇక్కడ కొండ పైన దీపం సాక్షాత్కరిస్తుంది. భక్తులందరు కపిలతీర్థం వైపు దీప నమస్కారం చేస్తారు.


 ఈ ఆలయం తి.తి.దే. వారి ఆద్వర్యంలో పని చేస్తుంది, శివరాత్రి పండుగ మరియు బ్రహ్మొత్సవాలు వైభవంగా జరుగుతాయి.


• తిరుమల అంటే శ్రీవారే. అణువణువూ వేంకటేశ్వరుడే. తమిళంలో తిరు అంటే శ్రీ అనీ, మల అంటే శైలం (కొండ) అనీ కూడా అర్థం. అంటే తిరుమల... శ్రీశైలమన్నమాట. శివకేశవులకు భేదం లేదు కదా... అలాంటప్పుడు తిరుపతిలో శివాలయం ఉండటంలో ఆశ్చర్యమేముంది! అలా తిరుపతిలో వెలసిన పవిత్ర తీర్థరాజమే కపిలతీర్థం.


ప్రపంచ ప్రసిద్దిగాంచిన పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి. ఇక్కడ శ్రీవారి ఆలయంతోపాటు గోవిందరాజస్వామి, కోదండరామస్వామివారి ఆలయాలున్నాయి. గొప్ప వైష్ణవ క్షేత్రమైన తిరుపతిలో ఓ శైవక్షేత్రం కూడా ఉంది.

అదే కపిలతీర్థం. తిరుపతికి ఉత్తరంగా, తిరుపతి కొండలకు ఆనుకుని అలిపిరి దిగువకు వెళ్తే మనోహరమైన ఈ తీర్థం కనిపిస్తుంది. ముఖ్యంగా, వర్షాకాలంలో ఇక్కడకు వస్తే... ప్రకృతి సుందర జలపాత దృశ్యాలు చూపుతిప్పనివ్వవు. ఇక్కడి ప్రశాంత వాతావరణం... అడుగుతీసి అడుగు వేయనివ్వదు. 


ఇంతటి సుమనోహర తీర్థం ఇక్కడ ఎలా ఏర్పడిందంటే...కృతయుగంలో కపిల మహర్షి ఇక్కడ ఈశ్వరుని కోసం ఘోర తపస్సు చేశాడట. ఆ తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు పాతాళంనుంచి భూమిని చీల్చుకుని ఇక్కడ వెలిశాడని స్థలపురాణం. కపిలముని తపస్సు కారణంగా ఇక్కడ కొలువైనది ఈశ్వరుడు కాబట్టి ఈ స్వామికి కపిలేశ్వరుడు అని పేరు వచ్చింది.


 ఇక్కడి లింగాన్ని కూడా కపిల లింగం అంటారు. ఆ తరవాత త్రేతాయుగంలో అగ్నిదేవుడు ఈ క్షేత్రంలో ముక్కంటిని పూజించాడట. అందువల్ల, ఈ లింగాన్ని ఆగ్నేయ లింగమనికూడా పిలుస్తారు. ఇక్కడ కపిలేశ్వరుడు కామాక్షీదేవి సమేతంగా కొలువయ్యాడు. ఈ ఆలయానికి ఉన్నత శిఖరమా అనిపించేలా ఉంటాయి తిరుమల కొండలు. ఆ కొండలమీది నుంచి గలగలా పారుతూ, 20 అడుగుల ఎత్తునుంచి ఆలయ పుష్కరిణిలోకి దూకుతుంది ఆకాశగంగ. 


ఈ పుష్కరిణినే కపిలతీర్థం అంటారు. ఈ తీర్థాన్ని శైవులు కపిల తీర్థమనీ, వైష్ణవులు ఆళ్వార్ తీర్థమనీ పిలుస్తారు. వైష్ణవులు కోనేటి చుట్టూ నాలుగు మూలల్లోనూ నాలుగు సుదర్శన రాతిశిలలను స్థాపించారట. రాతిమెట్లు, సంధ్యావందన దీపాలనూ ఏర్పాటుచేశారు. అందుకే, అప్పట్నుంచీ దీన్ని చక్రతీర్థమని పిలిచేవారు వైష్ణవులు


*పాప వినాశనము:*


పాప వినాశనము లేదా పాప నాశనము తిరుమలలో ఉంది. ఇది శ్రీవారి ఆలయానికి ఉత్తరదిశలో 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆశ్వీయుజమాసంలో శుక్లసప్తమి రోజున ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న ఆదివారం నాడు ఇక్కడ నీట మునిగి, పవిత్రస్నానం చేయటం పరమపావనమని బ్రహ్మపురాణం, నాలుగో అధ్యాయం పేర్కొంటోంది.


*ఆకాశ గంగ:*


ఆకాశ గంగ తిరుమలలో ఉంది. ఇది శ్రీవారి ఆలయానికి ఉత్తరదిశలో సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడే ఒక పుష్కరంపాటు అంజనాదేవి తపస్సుచేసి, ఆంజనేయుని గర్భాన ధరించిందని భావన. ప్రతినిత్యం స్వామివారి అభిషేకానికి మూడు రజత పాత్రలనిండా ఆకాశతీర్థాన్ని తిరుమల నంబి వంశస్తులు తేవడం సంప్రదాయం.


• తిరుమల శ్రీవారి ఆలయానికి సుమారు 3 కే.మీ దూరంలో `ఆకాశ గంగ తీర్ధం ఉంది. హిమచలంలో ప్రవహించిన గంగమూడు పాయలయిoది.ఆకాశభాగాన ప్రవహిస్తూ సాక్షాత్కరించిన గంగ, ఈ ఆకాశగంగ మర్త్యగంగ శ్రీ విశ్వేశ్వరస్వామి అభిషేకాధులకు ఉపయోగపడుతూ ఉంది. ఆకాశగంగ తీర్ధమహత్యాన్ని వరాహ-పద్మ-స్కంద పురాణాలూ విశదం చేస్తున్నాయి. సంతానం లేని వ్యక్తిని భోక్తగా నియమించి శ్రాద్ధం చేయడం వల్ల గార్ధభముఖుడయిన పుణ్యశిలుని కడతేర్చిన తీర్ధం.మేషమాసం చిత్తనక్షత్రంతో కూడిన పూర్ణిమా దినం ఈ తిర్ధనికి పర్వదినం.



*శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -60*


🍁🍁🍁🍁🍁


*-నారాయణవనంలో శ్రీవేంకటేశ్వరస్వామి, పద్మావతిల కళ్యాణం:*


కలియుగ దైవం వేంకటేశ్వరుని పేరు తలిస్తేనే కళ్యాణ వైబోగం. అలాంటి కలియుగ నాధుని శ్రీ కళ్యాణ వేంకటేశ్వర ఆలయం చిత్తూరు జిల్లా నారాయణవనంలో ఉంది. 


తిరుపలికి 40కి.మీ. దూరంలో పుత్తూరుకి 5 కి.మీ. దూరంలో, శ్రీ కళ్యాణ వేంకటేవ్వర ఆలయం కలదు. ఇది అరుణానదీ తీరంలో ఉన్న అతి ప్రాచీన ఆలయము. ఈ ఆలయం క్రీ.శ. 1544లో అచ్యుత దేవరాయల ఆంతరంగికుడైన పెనుగొండ వీరప్పన్నగారిచే నిర్మించబడినదని చర్రిత్ర చెప్పుచున్నది. 


ఈ వీరప్పన్నయే విరూపన్న అని తెలియుచున్నది. కాని స్థలపురాణం మాత్రం నారాయణవరం అధిపతి అయిన ఆకాశరాజుగారు కట్టించారని చెప్పుచున్నది. ఒకప్పుడు ఆ గ్రామాన్ని ఆకాశరాజు పరిపాలించుచున్న కాలంలో వైకుంఠనివాసుడైన శ్రీమహావిష్ణువు, శ్రీ వెంకటేశ్వర రూపంతో వెంకటాద్రి మీద వెలసాడు.


అపుడాయన దేవేరి లక్ష్మీదేవి పద్మావతి రూపంతో ఆకాశరాజు దంపతులకు పుత్రికగా జన్మించింది. యుక్తవయస్సుకు వచ్చిన పద్మావతి దేవి వేంకటేశ్వరుని తప్ప మరొకరిని వివాహమాడనని తనకు ఆ స్వామితోనే వివాహం జరిపించవలసిందిగా తండ్రిని కోరింది. 


కుమార్తె కోరిక మన్నించిన ఆకావరాజు శ్రీవేంకటేవ్వర, పద్మావతిల కళ్యాణం ఈ ప్రదేశంలోనే అతివైభవంగా జరిపించాడని,ఈ కళ్యాణానికి ముక్కోటి దేవతలు, యక్షులు, కిన్నెరులు, గంధర్వులు వచ్చి తిలకించారని ప్రసిద్ధి.

 

ప్రాచీనమైన ఈ ఆలయం విశాలమైన ఆవరణ కలిగి ఉన్నది. ఈ ఆలవరణ చుట్టూ ఉన్నతమైన ప్రాకారము కలదు. ఈ ప్రాకారం తూర్పు దిశలో 96 అడుగుల ఎత్తుగల 7 అంతస్తులు గలిగిన గోపురంతో శిల్పకళా సౌందర్యంతో విరాజిల్లుచున్నది.


 ఈ ఆలయమందు గర్భగుడిలో కళ్యాణ వేంకటేశ్వరుడు ప్రక్కనే మరొక చిన్నగుడిలో పద్మావతీ అమ్మవారు దర్శనమిస్తారు. పద్మావతి అమ్మవారి ముందు పెద్ద తిరుగలి రాయి కలయి. ఆ తిరుగలితో ఆమె పెండ్లి రోజున బియ్యము విసిరినారని చెప్పుచుందురు.


ఈ ఆలయములో పద్మావతి, వేంకటేశ్వరులేకాక ఆళ్యారులు, దశావతారాలు, శ్రీవరదరాజస్వామి ఆండాళ్ళమ్మ, శ్రీకోదండరాముల వారు, శ్రీరంగ నాయకస్తామి, శ్రీరాజమన్నారుస్వామి, శ్రీ ప్రయాగస్వామి మున్నగువారు మనకు దర్శనమిస్తారు.


 ఈ ఆలయానికి కొంత దూరంలో నున్న పుష్కరిణిలో కార్తీక శుద్ధ దశమినుండి అయిదు రోజులు స్వామివారి తెప్పోత్సవము, జ్వేష్ఠ శుద్ధ దశమి నుండి పదిరోజులు బ్రహ్మాత్సవములు అత్యంత వైభవంగా జరుపుకుంటారు


*శ్రీ వేంకటేశ్వరునిదివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: