28, సెప్టెంబర్ 2023, గురువారం

గణేశ పంచరత్నమ్*

 🕉️  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️

                _*భక్తిసుధ*_

         *గణేశ పంచరత్నమ్*

              (ఫలశ్రుతితో...)


𝕝𝕝శ్లోకం𝕝𝕝-1

*ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం*

*కళాధరావతంసకం విలాసిలోక రక్షకం*

*అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకం*

*నతాశుభాశు నాశకం నమామి తం వినాయకం*

𝕝𝕝తా𝕝𝕝 

మోదకములు చేతిలో ఆనందంగా ఉంచుకుని, ఎల్లప్పుడూ మోక్షాన్ని ప్రసాదించే, శిరస్సున చంద్రుని ధరించిన, లోకాన్ని కాపాడే, నాయకులకే నాయకుడైన, అసురులను, అన్ని ఆశుభాలను నశింప జేసే ఆ విఘ్నేశునికి నా నమస్కారములు.


𝕝𝕝శ్లోకం𝕝𝕝-2

*నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరం*

*నమస్సురారి నిర్జనం నతాధికాపదుద్ధరం*

*సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం*

*మహేశ్వరం సమాశ్రయే పరాత్పరం నిరంతరం*

𝕝𝕝తా𝕝𝕝

భక్తుల శత్రువులకు భయం కలిగించే వానికి, అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని వలె ప్రకాశిస్తున్న వానికి, దేవతలు, అసురులచే నుతింపబడేవాడికి , భక్తుల విఘ్నాలను తొలగించే వానికి, దేవతలకే దేవునికి, సర్వ సంపదలకు అధిపతి అయిన వానికి, గజరాజుకు, దేవతల గణాలకు అధిపతి అయిన వానికి ఎల్లప్పుడూ నా నమస్కారములు.


𝕝𝕝శ్లోకం𝕝𝕝-3

*సమస్త లోక శంకరం నిరస్త దైత్య కుంజరం*

*దరేదరోదరం వరం వరే భవక్త్ర మక్షరం*

*కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం*

*మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం*

𝕝𝕝తా𝕝𝕝

సమస్త లోకాలకు శుభం కలిగించే వానికి, లోకాన్ని గజాసురుని బారినుండి కాపాడిన వానికి, పెద్ద ఉదరముతో, గజముఖముతో జనులను ఆశీర్వదించే వానికి, కరుణను కురిపించే వానికి, తప్పులను క్షమించి, శుభము, యశస్సు కలిగించే వానికి, తనకు నమస్కరించే వానికి సర్వ శుభాలు కలుగ జేసే విఘ్నరాజునికి నా నమస్కారములు.


𝕝𝕝శ్లోకం𝕝𝕝-4

*అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనం*

*పురారి పూర్వ నందనం సురారి గర్వ చర్వణం*

*ప్రపంచ నాశ భీషణం ధనంజయాది భూషణం*

*కపోల దాన వారణం భజే పురాణ వారణం*

𝕝𝕝తా𝕝𝕝

కోరికలను తీర్చి, బాధలను నశింప  జేసే వానికి, అనాదిగా పూజింపబడిన వానికి, ప్రళయ కారకుడైన శివుని పెద్ద కుమారునికి, అసురుల గర్వాన్ని అణచే వానికి, ప్రళయ కాలంలో భీషణంగా ఉండే వానికి, సర్పము ఆభరణంగా ఉన్నవానికి, మద గజము వలె ఉత్సాహముగా ఉన్నవానికి, పురాతనమైన వానికి నా నమస్సులు.


𝕝𝕝శ్లోకం𝕝𝕝-5

*నితాంతికాంత దంతకాంతి మంతకాంతకాత్మజం*

*అచింత్య రూప మంతహీనమంతరాయకృంతనం*

*హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం*

*తమేకదంతమేవతం విచింతయామి సంతతం*

𝕝𝕝తా𝕝𝕝

ఎంతో శోభతో ఉన్న దంతము కలవాడు, మృత్యుంజయ కారకుడైన శివుని కుమారుడు, వర్ణనకు, ఊహకు అందని ఆకారము కలవాడు, అంతము లేని వానికి, విఘ్నాలు, ఆపదలు తొలగించే వానిడు, వసంత ఋతువులాగా యోగుల మనస్సులో నిలిచే వాడు అయిన ఏకదంతుని ఎల్లప్పుడూ నా స్మరించెదను.


𝕝𝕝శ్లోకం𝕝𝕝  *ఫలశ్రుతి*

*మహాగణేశ పంచరత్నమాదరేణ యోన్వహం*

*ప్రజల్పతి ప్రభాతకే హృదిస్మరన్ గణేశ్వరమ్*

*అరోగతా మదోషతాం సుసాహితీం సుపుత్రతాం*

*సమాహితాయురష్టభూతిమభ్యుపైతి సోచిరాత్॥*

𝕝𝕝తా𝕝𝕝

మహాగణేశ పంచరత్నమను ఈ స్తోత్రమును ప్రతి దినము ప్రాతః కాలమున శ్రీ వినాయకుని మనస్సుయందు ధ్యానించుచు ప్రకటముగా ఎవరెవరు పఠిస్తారో, అట్టి వారికి వెంటనే ఆరోగ్యము,దోషములేని జీవనమును, మంచి విద్యను, జ్ఞానమును, చక్కని సంతానము కలవారై, దీర్ఘాయుష్కులై అష్టైశ్వర్యములను అనుభవించి సమస్త మంగళములనూ పొందెదరు.

               --------------------

కామెంట్‌లు లేవు: