27, సెప్టెంబర్ 2023, బుధవారం

*🚩శ్రీ వివేకానందస్వామి🚩* *🚩జీవిత గాథ🚩* *భాగం 49*

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


     *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 49*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


శ్రీరామకృష్ణులు నరేంద్రునితో తమ దివ్యదర్శనాలను గురించి ముచ్చటించారు. నరేంద్రుడు వాటిని నమ్మలేదు. అంతా విన్న అతడు చివరకు. "ఈ దృశ్యాలు నిజం కావు. అవి మీ మనోభ్రాంతి జనితాలు" అని తేల్చివేశాడు. శ్రీరామకృష్ణులు చలించిపోయారు. “ఏయ్, ఏమంటున్నావు నువ్వు? ఆ దేవతలు

నాతో మాట్లాడుతున్నారు" అన్నారు శ్రీరామకృష్ణులు. "అలాగే అనిపిస్తుంది" అని నరేంద్రుడు తేలిగ్గా కొట్టిపారేశాడు. శ్రీరామకృష్ణులు దిగ్రృమ చెందారు. 


నరేంద్రుడు సత్యనిష్టాపరుడు. కనుక అతడు చెబుతున్న దాన్లో పొర పాటు ఉండదని శ్రీరామకృష్ణులకు అచంచలమైన విశ్వాసం. తాను దర్శించిన దేవతా రూపాలన్నీ మనోకల్పిత జనితాలని అతడు చెప్పినప్పుడు శ్రీరామకృష్ణులు గందరగోళ స్థితిలో పడిపోయారు. ఆయన ఉన్నత చైతన్య స్థితిలో ఉన్నప్పుడు ఇలాంటివి విన్నప్పటికీ నవ్వేసేవారు. ఇతర సమయాలలో ఇలాంటి భావనలు ఆయనను గందరగోళానికి లోనుచేస్తాయి. అది చెబుతున్నది నరేంద్రుడనే ఏకైక కారణం వలననే ఆ గందరగోళం.


ఇప్పుడు కూడా గందరగోళానికి లోనైన శ్రీరామకృష్ణులు తిన్నగా కాళికాలయం వాకి వెళ్లి తమ సమస్యను ఆమెకు విన్నవించారు. కరుణాస్వరూపిణియైన ఆమె ఆయనతో, “నువ్వెందుకు అతడి మాటలు అంతగా పట్టించుకొంటావు? అతడు కాలుడు. ఇప్పుడు ఇలాగే మాట్లాడతాడు. కాలక్రమాన నువ్వు చెప్పే ప్రతి మాటనూ నిజమని నమ్ముతాడు" అని చెప్పింది. కాళీమాత చెప్పిన మాటలు నరేంద్రునికి చెబుతూ, "ధూర్తుడా! నాలో అపనమ్మకం కలిగించావే! ఇకపై ఇక్కడకు రావద్దు" అన్నారు శ్రీరామకృష్ణులు. నరేంద్రుడు మౌనంగా ఉండిపోయాడు.🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: