15, అక్టోబర్ 2023, ఆదివారం

*🪷 శ్రీ మద్భగవద్గీత🪷* *🌸 అథ ద్వితీయోధ్యాయః 🌸*

 *🕉️🪷 ఓం శ్రీ కృష్ణపరబ్రహ్మణే నమః 🪷🕉️*

*🪷 శ్రీ మద్భగవద్గీత🪷*

*🌸 అథ ద్వితీయోధ్యాయః 🌸*

*🌸 సాంఖ్య యోగః 🌸*


*2-అధ్యాయం,59వ శ్లోకం*



 *విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః ।* 

 *రసవర్జం రసోఽప్యస్య పరం దృష్ట్వా నివర్తతే ।। 59* 


 *ప్రతిపదార్థము* 


విషయాః — (ఇంద్రియ) విషయములు; వినివర్తంతే — నిగ్రహించు; నిరాహారస్య — స్వీయ సంయమం పాటించి ; దేహినః — జీవునికి ; రస-వర్జం — రుచి తరిగిపోవుట; రసః — రుచి; అపి — కూడా; అస్య — అతనికి; పరం — పరమాత్మ; దృష్ట్వా — తెలుసుకున్న పిదప ; నివర్తతే — తరిగి పోవును.


 *తాత్పర్యము* 


 ఇంద్రియముల ద్వారా  విషయములను గ్రహింపని వాని నుండి ఇంద్రియార్థములు మాత్రము వైదొలుగును. కానీ వాటిపై ఆసక్తి మిగిలి ఉండును. స్థితప్రజ్ఞనకు పరమాత్మ సాక్షాత్కారమైనందువలన వాని నుండి ఆసక్తిగూడా తొలగిపోవును.


 *సర్వేజనాః సుఖినోభవంతు* 

 *హరిః ఓం  🙏🙏*

కామెంట్‌లు లేవు: