15, అక్టోబర్ 2023, ఆదివారం

శరన్నావరాత్రులు

 

🎻🌹🙏 శరన్నావరాత్రులు - మొదటిరోజు - విజయవాడ దుర్గమ్మ ఈరోజు అలంకారం..


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

నేడు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా దర్శనం...🙏

🌿దసరా ఉత్సవాల్లో భాగంగా - మొదటి రోజున ఇంద్రకీలాద్రి పై దుర్గాదేవి - స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి గా దర్శనమిస్తుంది.

🌸ఈ రూపంలో సింహవాహనాన్ని అధిరోహించి, ఎనిమిది చేతులతో, అద్భుతమైన కాంతి కలిగిన ముక్కుపుడకతో, బంగారు ఛాయ ఉన్న దేహంతో అమ్మను చూడొచ్చు.  శంఖం, చక్రం, గద, శూలం, పాశం, మహాఖడ్గం, పరిఘ అనే ఆయుధాలు ధరించి ఉంటుంది. 

🌿ఆకర్షణ శక్తి ఈ తల్లికి అధికంగా ఉంటుంది. ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మ స్వర్ణకవచంతో అవతరించటం వల్ల దుర్గాదేవిని నవరాత్రుల్లో తొలిరోజున స్వర్ణకవచంతో అలంకరించటం ఆచారంగా వచ్చింది. 

🌸లోహాలన్నింటిలో స్వర్ణం అత్యుత్తమమైంది. బంగారాన్ని ధరించటం ఉత్తమ లక్షణాలు, ఉన్నత భావాలు కలిగి ఉండటానికి ప్రతీకగా నిలుస్తుంది. బంగారంతో చేసిన ఏ ఆభరణమైనా నడుము నుంచి పైభాగంలో మాత్రమే ధరిస్తాం. ఇది నిరంతరం గౌరవాన్ని అందుకునే లక్షణానికి ప్రతీక. 

🌿స్వకర్ణకవచం ధరించిన దుర్గాదేవి నిరంతర గౌరవాన్ని కలిగి ఉండేలా తమ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవాలని మహిళలకు సందేశాన్ని అందిస్తుంది.

🌸మంచిమనసున్న మహిళను 'బంగారుతల్లి'* అని సంబోధించటంలో ఉన్న ఆంతర్యం ఇదే . ఉత్తమ భావాలు, ఉత్తమ శీల సంస్కారాలు కలిగి ఉండటం మహిళలకు అలంకరించని ఆభరణాలుగా ప్రకాశిస్తాయి. 

🌿ప్రతి భావనలో, ప్రతి వ్యక్తీకరణలో ఉన్నతంగా, సంస్కారవంతంగా, స్వచ్ఛంగా ఉండాలన్న సందేశాన్ని "స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి" నుండి స్ఫూర్తిగా అందుకోవాలి...స్వస్తీ...🚩🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

కామెంట్‌లు లేవు: