16, అక్టోబర్ 2023, సోమవారం

వేదమంత్రములురమణీ

 -- పృథివీ శాంతా - సా గ్ని. నా శాంతాః -- 

వేదమంత్రములురమణీ యార్థ  ప్రతిపాదకములు 

వేదకావ్యశరీరములు వేదమంత్రములు బహువిధ కవితారచనలకు మూలరూపములు. వృత్తులకు రీతులకు శయ్యలకు అలంకారములకు ప్రథమోదాహరణ భూతములు. మంత్రములు ప్రభుసమ్మితములుగా శాసించాఫ్ గలవు. సుహృత్సంమితముగా ఉపదేశించగలవు. కాంత వలె పరోక్షముగ రమణీయ ముగ కర్తవ్యము నుపదేశింప గలవు. 

          "పృథివీ శాంతా సా గ్నినా శాంతా " అను శాంతి మంత్రము అగ్నితో పృథివీ శాంతరూపిణి యగుఁనని వర్ణించుచున్నది. అగ్ని దహించును గాని శాంతి నిచ్చునా అని సందేహము కలుగుట సహజము. ఇచ్చట అగ్ని పదముచే యజ్ఞపురుష రూపము సాక్షాత్కరించు అగ్ని ఉపదేశించుచున్నాడు " అగ్ని మీళే పురోహితం "" అను మంత్రముచే ఉపదేశింపబడు సర్వారాధ్యుడైన అగ్నియే యిచట గ్రహింపబడుచున్నాడు. యజ్ఞపురుషుడు సకలలోక కళ్యాణ కారకుడు. 

         "యజ్ఞా: కళ్యాణ హేతవః " మానవుడు ఎంత ప్రయత్నించినను పృథివిని అనగా నిఖిల ప్రపంచమును శాంతింప జేయలేడు. సర్వలోక కళ్యాణ కారకము నిఖిల ప్రాణి కోటికి క్షేమంకరము శాంతిప్రదము యఙన్సము మాత్రమే. యజ్ఞముమంత్ర మూర్తి. ఋగ్యజు స్సామాత్మక మంత్రమయము. శ్రీరూప సర్వసంపదతో యజ్ఞమునిండియుండును. యజ్ఞగృహము నుండి వెలువడిన సర్వసంపత్తి నిఖిల ప్రాణికోటికి హృదయ ప్రసాదజనకము. గ్రహ నక్షత్ర తారాదులతో వెలయు నిఖిల భూగోళమును సంస్కరించు దివ్యశక్తి అట్టి స్వర సంపత్తితోగూడి యజ్ఞగుండమునుండి వెలయు దివ్యాహుతులు , ధూమములు. ధూమములు లోకవిశుద్ది హేతువులు. అతివృష్టి అనావృష్టి పెను తుఫానులు మొదలగు లోకోపద్రవములను నివారించునట్టివి. ఈ విధముగా అగ్ని పృథివిని అనగా భూగోళమును శాంత మూర్తిని గావించుచున్నది. Paవిత్రీకరించుచున్నది. 

              లోకకళ్యాణ హేతువైన యింతటి పరమార్థమును వేదమాత " పృథివీ శాంతా సాగ్ని నా శాంతా " అనుచిన్న చిన్న పదములతో ఉపదేశించుచున్నది. ఇట్లు  లోకమున ఏ ఇతర వాజ్ఞ్మయముపదేశించును ? అసలు అగ్ని స్వరూపము - యజ్ఞ పురుష మాహాత్మ్యముతద్రహస్యము

ముందు తెలియవలెను. ఒక వేళ తెలిసినను ఆ మహత్తర గంభీరార్థమును లలిత ముగ్దమనోహరముగా మధుమయ ఫణుతులతో చెప్పగలిగి యుండవలెను. అట్లు చెప్పగలిగినవి సర్వజ్ఞములు సుమధురవచోగుంఫితములు స్వరసంస్కార సంపన్నములు విద్యా శస్త్రాస్త్ర రూపములు మననత్రాణాత్మకములు శ్రుతి సౌందర్య దాయకములు వేదరూపమున ఆవిర్భవించిన దివ్యశక్తులగు 

మంత్రములే వేదములే 

" ఏకో మంత్ర స్తథాధ్యాత్మ మధిదైవ మధిక్రతు , 

అసంకరేణ సర్వార్వ : భిన్న శక్తిరవ్యవస్థితః ( వాక్యపదీయం 2-256)

అని వాక్యపదీయకారుడగు శ్రీ భర్త్రుహరి పండితునిచే కీర్తింపబడిన మంత్రములు మహార్థసుందరములు. సదారాద్యములు. 

( దేవీదాస్ )

కామెంట్‌లు లేవు: