3, నవంబర్ 2023, శుక్రవారం

 ;;;;; ఆలోచనాలోచనాలు ;;;;;          ----౦ అనుబంధం- ఆత్మీయత ౦----                     ***** మీరు సాహసించినప్పుడు, మీ ధైర్యం రెట్టింపు అవుతుంది.                           ఎవరినైనా అభినందించినప్పుడు , ఐక్యత వృద్ధి పొందుతుంది.   పంచుకొన్నప్పుడు, అభిమానం పెరుగుతుంది.       దేన్నైనా పట్టించుకొన్నప్పుడు, ఆ అనుబంధం బలపడుతుంది.                   ***** ఒక గొప్ప బంధానికి రెండు విషయాలు అవసరం. అవి" పోలికల్ని" గుర్తించడం; అదే సమయంలో " తేడాల్ని" గౌరవించడం.                        ***** బాంధవ్యాన్ని బలపరచే రెండు అంశాలు.... మనది తప్పయిన ప్రతిసారి "తప్పు" ను మనస్ఫూర్తిగా అంగీకరించాలి. మనది "ఒప్పు" అయిన ప్రతిసారీ మౌనంగా నోరు మూసుకొని కూర్చోవాలి.                         ***** విజయవంతమైన సంబంధానికి గల సూత్రం చాలా తేలిక. అది ...... పెద్ద, పెద్ద సమస్యలను కూడా అల్పమైనవాటిగానే పరిగణించాలి. కానీ ఎన్నడైనా సరే, చిన్న, చిన్న విషయాలను కొంపమునిగిపోయేలాగా పరిగణించకూడదు.                ***** అతి ముఖ్యమైన అంశం. మనుష్యుల్ని ప్రేమించాలి; వస్తువులను వాడుకోవాలి. మనం ఏంచేస్తున్నామంటే మనుష్యుల్ని వాడుకొని వదిలేస్తున్నాం. వస్తువుల్నేమో ప్రాణం కంటే అధికంగా ప్రేమిస్తున్నాం. ఇదీ మనం చేస్తున్న అవకతవకల పని. ఏంచేద్దాం. ఫలితాన్ని అనుభవిస్తున్నాం.                  ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~Answers to Sharpen your mind!        1* Bearing 2* A monkey and a donkey 3* In the theatre 4* A promise.                             ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~                              తెలుగు నుడికారం ( సామెతలు మరియు జాతీయాలు )                       1* పేదవాని కోపం, పెదవికి చేటు.                                  2* పేదవాని పెళ్ళాం, వాడకెల్ల వదిన.కలిగినోడి పెళ్ళాం ఊరంతటికీ అక్క.     3* పెనం మీది నుండి పొయ్యిలో పడ్డట్లు!               4* పెద్దలు లేని ఇల్లు; సిద్ధులు లేని మఠం.              5* ఊరిమీద పెత్తనానికి పోతే; దుత్త చేతికి వస్తుంది.                              6* పెట్టీ, పొయ్యనమ్మ మీదపడి కొట్టడానికి వచ్చిందట.                        7* ఎర్ర చీర కట్టిందల్లి నా పెండ్లామే అన్నాట్ట వెర్రినాకొడుకు.                         8* పూల వాసన నారకు పట్టినట్లు.                            9* పూజ కొద్దీ మొగుడు; పుణ్యం కొద్దీ బిడ్డలు.             10* పులి బక్కపడినంత మాత్రాన చారలు బక్కపడతాయా?                 తేది 3--11-2023, శుక్రవారం. శుభోదయం.

కామెంట్‌లు లేవు: