29, డిసెంబర్ 2023, శుక్రవారం

భాగవతము

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

*🌹పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*ప్రథమ స్కంధము*


*అన్నా! ఫల్గున! భక్తవత్సలుడు బ్రహ్మణ్యుండు గోవిందుడా*

*పన్నానీక శరణ్యు డీశుడు జగద్భద్రానుసంధాయి శ్రీ*

*మన్నవ్యాంబుజపత్రనేత్రుడు సుధర్మామధ్య పీఠంబునం*

*దున్నాడా? బలభద్రు గూడి సుఖియై యుత్సాహియై ద్వారకన్.*


నాన్నా! అర్జునా! మన సారథి మన సచివుడు ఇంకా ఎన్నెన్నో అయిన కృష్ణయ్య, భక్తులయందు పరమవాత్సల్యం కలవాడు. బ్రహ్మజ్ఞానమే ఆకారం అయినవాడు, గోవులకు ఆనందం కలిగించేవాడు, ఆపదలలో వేదనలు పొందే భక్తుల సముదాయాలకు సంరక్షణ కూర్చేవాడు, ప్రభువు, జగత్తులకు శుభాలను అమర్చిపెట్టేవాడు, చక్కని కాంతులతో అప్పుడప్పుడే వికసించిన తామరరేకులవంటి కన్నులున్న మహాత్ముడు, దేవలోకంలో సుధర్మ అనే దేవసభలో కొలువుతీరి ఉన్న దేవేంద్రునిలాగా ద్వారకలో తన కొలువులో సింహాసనం మీద అన్న బలరామునితో కూడి సుఖంగా, ఉత్సాహంగా ఉన్నాడా?


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

కామెంట్‌లు లేవు: