29, డిసెంబర్ 2023, శుక్రవారం

శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతం

🌺🪷🌺🪷🌺🪷🌺🪷🌺🪷

*🪷శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతం🪷*

.                  *భాగం - 4*

🌺🪷🌺🪷🌺🪷🌺🪷🌺🪷

*ఓం సర్వ జగద్రక్షాయ గురు దత్తాత్రేయ*

.  *శ్రీ పాద శ్రీ వల్లభ పరబ్రహ్మాణేినమః*

                      --/--


వ్యాఘ్రేశ్వరశర్మ భక్తికి సంతసించి ఆ తపస్వి 

ఓంకారము నేర్పి",శ్రీపాదరాజం శరణం ప్రపద్యే"అని వల్లెవేయమనిరి.అలా వల్లేవేయుచూ వ్యాఘ్ర రూపంలోనే‌ కురుపురం సమీపమునకు చేరుకొనెను.

కురుపురం చేరుకోవలనంటే జలమార్గములో పోవలెను. అప్పుడు శ్రీపాదుల వారు తన భక్తజన సందోహం లోవున్నారు. 

వ్రాఘ్రేశ్వరశర్మ పిలుపు విని ఆనీటిమీద నడుచుకుంటూ ఆవలి ఒడ్డున వున్న తన పరమ‌ భక్తుడైన వ్యాఘ్రేశ్వరశర్మ‌ వద్దకు వెళ్ళి ఆయన పూజలు అందుకొని ఆ పులిని అధిరోహించి ఆ నీటిపై వచ్చినదారంటే తేలియాడుతూ  కురుపురం చేరారు.అటు ఒడ్డుకు  చేరి ఆపులి ని స్వామివారు కృపా దృష్టి తో చూడగా ఆ పులి అసువులు బాసి మహా పురుషునిగా బాసిల్లగా అచ్చటి స్వామి వారి భక్తులు ఆశ్చర్యానాందాలకు అంతులేకుండెను.

వ్యాఘ్రేశ్వరశర్మ  పలువిధాల స్వామివారిని ప్రార్ధించగా స్వామివారు కరుణించి వ్యాఘ్రేశ్వరశర్మ ఎప్పుడుకావాలంటే అప్పుడు పులి రూపంలో సంచరించగలడని,తాను ఎల్లప్పుడూ ఆ భక్తుని గుర్తుగా పులిచర్మం ధరించి బాసిల్లుతానని వరమిచ్చి యోగమార్గములో ప్రకాశించమని అన్నారు. అప్పటినుండి వ్యాఘ్రేశ్వరశర్మ  తపస్వు చేసుకుంటున్న మహాయోగులకు సామాన్య జనులవలన ఆటంకం‌ కలగకుండా శ్రీపాదుల వారి నామస్మరణ చేసుకుంటూ ఆమహాత్ముల గృహాలకు కాపలా వుంటున్నాడని ఆ వృద్ద తపస్వి శంకరభట్టుకు తెలియజేసెను. ఈవిధంగా తన ప్రయాణంలో జరిగిన విషయాలు,తాను తెలుసుకున్న అనుభవాలు మననంచేసుకుంటూ శ్రీపాదుల వారి నామస్మరణం చేసుకుంటూ ప్రయాణం సాగిస్తూ మార్గమధ్యంలో పుణ్య తీర్ధములు దర్శించుకుంటూ యాచించకుండా దొరికిన భోజనము స్వీకరిస్తూ  పాండ్యదేశంలో కదంబవనం అనే 2వ మజిలీకి చేరుకున్నాడు.

రేపు శంకరభట్టు రెండవ మజిలీలో కలిగిన అనుభవాలు చెప్పుకుందాం.


*🙏దిగంబరా దిగంబరా శ్రీ పాద వల్లభ దిగంబరా.🙏*


*సర్వం శ్రీ పాద వల్లభ చరణారవిందమస్తు🙏*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🪷🌺🪷🌺🪷🌺🪷🌺🪷

కామెంట్‌లు లేవు: