14, జనవరి 2024, ఆదివారం

*శ్రీ రామరక్షా స్తోత్రం - 29* -

 🪷🕉️  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🕉️🪷

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 🪔


𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝 

*శ్రీ రామచంద్ర చరణౌ మనసా స్మరామి।*

*శ్రీరామచంద్ర చరణౌ వచసా గృణామి॥*

*శ్రీ రామచంద్ర చరణౌ శిరసా నమామి।*

*శ్రీరామ చంద్ర చరణౌ శరణం ప్రపద్యే॥*


- *శ్రీ రామరక్షా స్తోత్రం - 29* -


*తా* 𝕝𝕝  శ్రీరామచంద్రుని పాద పద్మాలను మనసారా స్మరించుచున్నాను. శ్రీరామ చంద్రుని చరణ కమలములను నోరార కీర్తించు చున్నాను. శ్రీరామచంద్రుని అంఘ్రయుగళికి తలవంచి నమస్కరించు చున్నాను. శ్రీ రామచంద్రస్వామీ నేను నీ పాదములను వేడుకొనుచున్నాను. శ్రీరామచంద్రుని పాదాలను మనసులో నిరంతరం స్మరిస్తున్నాను. రామచంద్రుని పాదాలనే భజిస్తున్నాను. రామచంద్రుని చరణాలకు శిరస్సు వంచి అభివాదం చేస్తున్నాను. శ్రీ రామచంద్రుని పాదాలు నాకు శరణు నొసంగుగాక. శ్రీరామచంద్రుని చరణములను మనసారా స్మరించెదను. *శ్రీరామచంద్రుని పాదములను వాక్కుచే కీర్తించెదను. శ్రీరామచంద్రుని చరణసరోజములకు శిరస్సు వంచి నమస్కరించెదను. శ్రీరామచంద్రుని పాదపద్మములనే శరణువేడెదను.*

కామెంట్‌లు లేవు: