16, ఏప్రిల్ 2024, మంగళవారం

ఊపిరి" ఉన్నంత వరకే.

 భగవద్గీత లో భగవానుడు చెప్పిన మాటలు

నా డబ్బు, నా పొలం, నా ఇల్లు, నా భార్య, నా కొడుకు, నా కూతురు, నా మనవడు, నా మనవరాలు ఇలా, నా, నా, నా, నా అనుకునేవి అన్నీ ఈ శరీరంలో "ఊపిరి" ఉన్నంత వరకే. ఒక్కసారి ఊపిరి ఆగి పోయిందో, ఈ శరీరాన్ని తీసుకుని వెళ్లి బొందల దొడ్డిలో పడేస్తారు. నా అనుకున్నవి ఏవీ "మన వెంట" రావు. వచ్చేది ఒక్కటే మనం మన జీవితంలో ఈ సమాజానికి చేసిన "మంచీ, చెడూ".

అవి ఈ "ఆత్మ" అనే శరీరాన్ని అంటి పెట్టుకొని ఉంటాయి. తెలిసి చేసినా, తెలియక చేసినా, అవి మనల్ని అంటిపెట్టుకుని నడుస్తూ మరో జన్మకు కారక మౌతాయి. అది మనిషి జన్మ కావచ్చు, జంతు జన్మ కావచ్చు, పురుగు జన్మ కావచ్చు ఇలా ఏదైనా కావచ్చు. అయితే ఈ ఆత్మకు శరీరం మీద మమకారం చావక, ఊపిరి పోయిన తరువాత కూడా ఈ శరీరం వెంట పరుగులు పెడుతూ ఉంటుంది. ఈ శరీరాన్ని పాతి పెడితే అక్కడే తిరుగుతూ , మరో జన్మ పొందే వరకు ఆ శరీరం పరిసరాల్లో ఉంటుంది. బలహీనతను ఆసరాగా చేసుకుని మానవ శరీరాల్లో కి ప్రవేశించి ఇబ్బందులకు గురిచేస్తోంది. దానినే "గాలి సోకడం" అని మన పెద్దలు తెలిపారు. అందుకే హిందూ ధర్మం లో ఈ శరీరాన్ని "దహనం చేస్తారు". 13 రోజుల పాటు నిత్య కర్మలు ఆచరిస్తారు . ఆత్మకు స్వర్గ ప్రాప్తి కలగాలని, అస్థికలను తీసుకుని వెళ్లి నదిలో కలుపుతారు. అయినప్పటికీ భూమి మీద మమకారం చావక ఇక్కడే పరిభ్రమణం చెందుతూ ఉంటే, మన జన్మకు కారకమైన పెద్దలకు పరలోకం (ఆత్మ తిరుగాడే లోకం) లోనూ మంచి జరగాలని కోరుకుంటూ శ్రాధ్ధ కర్మలు ఆచరిస్తూ ఉంటారు. సైన్స్ కు సైతం అందని చాలా విషయాలు మన వేదాలలో ఎప్పుడో చెప్పటం జరిగింది. వీటిని అర్థం చేసుకోలేని వారు వీటిని అవహేళన చేస్తూ అభాసుపాలు అవుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం అమెరికాలోని "నాసా" కేంద్రం లోని శాస్త్రవేత్తలు"సంస్కృతం నేర్చుకుని" మన పురాణాలలోని అంశాలను చదువుతూ వాటిపై పరిశోధనలు చేస్తున్నారు. ప్రపంచంలో సైన్స్ అనే అభివృద్ధి జరగక ముందే మన దేశంలో అభివృద్ధి జరిగింది. విదేశీ దాడుల కారణంగా వీటిని బయటకు రాకుండా చేసి, కొత్త గా సైన్స్ అంటూ పరిచయం చేసి మన దేశం సంస్కృతి సంప్రదాయాలను అణచి వేయడానికి ప్రయత్నించారు. కానీ, నిజం నిప్పులాంటిది. కావున, భారతదేశం ఔన్నత్యం, సంస్కృతి, సంప్రదాయాల వెనుక గల సైన్స్ విషయాలు ఒక్కటొక్కటిగా ప్రపంచానికి తెలుస్తున్నాయి. మన భగవద్గీత, మన రామాయణం, మన భాగవతం లను ఎవరైనా పుక్కిటి పురాణాలు అనే హేళన చేస్తే వారికి తగిన సమాధానం చెప్పాలి. అందుకు మీలాంటి పెద్దలు నడుం బిగించాలని కోరుకుంటున్నాను. అందుకే ఇంత పెద్ద వ్యాసం మీకోసం.

💐💐💐💐

భవదీయుడు

సీతారాం, సీనియర్ జర్నలిస్టు. 💐💐💐💐🙏🙏🙏🙏

కామెంట్‌లు లేవు: