*సత్యానికి ధైర్యం ఎక్కువే..!!*
వాస్తవాలు నిజంగా ఔషధ గుళికలే
చెవులకు కఠోరంగా ఉన్నప్పటికీ
తనువులో అలజడి సృష్టించింది
మనసును ఆలోచన వైపు మళ్ళిస్తాయి...
సత్యానికి ధైర్యం ఎక్కువే
అసత్యాలు ఎన్ని ప్రచారం చేసినా
నిండుకుండలా తొణకకుండా
మనసును నిర్మలంగా ఉంచుతుంది...
అబద్దాన్ని కప్పిపుచ్చేందుకు
వందల అబద్ధాలు తోడు చేయాలి
నిక్కమైన మాట ఒక్కటే చాలు
నిన్ను అందలమెక్కించి ఆదరించును..
అపద్దమనే వ్యసనానికి లోనైతే
మనల్ని నమ్మే వారిని కోల్పోతాం
సత్యం వైపు మొగ్గ గలిగితే
శాశ్వత కీర్తితో నిలబడగలుగుతాం...
సత్కీర్తి కోసం పుణ్యపురుషులు
మాటకు కట్టుబడి తనువును త్యజించారు
వారి బాటలే మనకు ఆదర్శం
వాళ్ల చరిత్రలే జగతికి నిదర్శనం..
ఈర్యా ద్వేషాలను వదిలితే
నిర్మలమైన మనసులో సుఖం
పగను పెంచుకుంటే ఇంట్లో పాములా
సుఖనిద్రను వదిలి వెయ్యాల్సిందే...
కొప్పుల ప్రసాద్
నంద్యాల
9885066235
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి