*చిరు ప్రశంసే ముందుకు నడిపించే..!!*
ఎండిన నేలలో కురిసిన చిరు జల్లులా
మనసును తేలికపరిచే పన్నీరులా
లక్ష్య సాధనలో చిరునవ్వుల్లా
*చిరు ప్రశంసే* ముందుకు నడిపిస్తుంది...
ఆడి పాడే బాలలకు కొత్త ఉత్సాహం
మట్టిలో మొక్కకు నీరులా ప్రోత్సాహం
అనారోగ్యం మనిషికి ఔషధంలా
*చిరు ప్రశంసే* సంజీవనిగా నిలుస్తుంది...
క్రీడాకారులకు స్ఫూర్తి మాత్రం
కళాకారులకు చప్పట్లే ముచ్చట్లుగా
ఉల్లాసం కలిగించే జీవామృతం
*చిరు ప్రశంసే* ప్రతిభకు నిదర్శనం..
ఆవిష్కరణలకు చిరునామాగా
పరిశోధకులకు పట్టుదలగా
అనాథలకు ఆపద్బంధువులా
*చిరు ప్రశంసే* ముందు నడిపించే..
అమ్మ పాటలా ముందుకు నడిపిస్తూ
నాన్న మాటలా ధైర్యాన్ని కలిగిస్తూ
మిత్రునిలా వెన్నంటే నీడలా ఉంటుంది
*చిరు ప్రశంసే* నిండైన ఆకారం ఇస్తుంది..
జీవితాన్ని సవ్యంగా సాగించేందుకు
భుజము తట్టి నడిపించేందుకు
మెచ్చుకోగలిగిన మాటలే ఉంటే
నిరాశ జీవితానికి *చిరు ప్రశంసే జీవం*..!!
కొప్పుల ప్రసాద్
నంద్యాల
9885066235
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి