17, జులై 2025, గురువారం

తు.చ. తప్పకుండా

 తు.చ. తప్పకుండా అనే పదం ఎలా వచ్చింది?

*********


తు.చ. తప్పకుండా అనే పదం సంస్కృతం నుండి వచ్చిందిట. 

ఈ సంస్కృత #శ్లోకాలు రాసేటప్పుడు పాటించవలసిన #నియమాలలో 

పంక్తికి ఎనిమిది అక్షరాలు ఉండాలనే ఒక నియమం ఉండేదిట. 


ఒక్కోసారి ఎనిమిది అక్షరాలు రాయటం కుదరనప్పుడు ... 

తు, చ, స్వ, హి, వై వంటి కొన్ని అక్షరాలను వాడటం ఉంచవచ్చు. 


ఉదాహరణకు : రామాయ లక్ష్మనశ్చతు


తు.చ. అంటే ...

!!రామస్తు సీతాన్ దృష్ట్వా.... రామశ్చ చకార!! 

తు ,చ అనేవి సంస్కృత భాషలో విశేషాలక్రింద లెక్క. ఇది పాద పూరణ కోసం వాడతారు. ఇవి సంస్కృత వాజ్మయంలోనివి.


తు.చ. తప్పకుండా తెలుగులోకి ఎలా వచ్చింది?

*********


మన కవులు కొంతమంది సంస్కృత శ్లోకాలను తెలుగులోకి #అనువాదం చేసేటప్పుడు సంస్కృత శ్లోకాలు వ్రాసిన వారు ఉపయోగించిన తు, చ, స్వ, హి, వై వంటి వాటికి సైతం కాని, మరియు అనే పదాలను ఉపయోగించి అనువాదం చేశారు.


సంస్కృతం/దేవభాష మీది #గౌరవంతో తెలుగు కవులు తు, చ వంటి అక్షరాలను సైతం వదలి పెట్టకుండా కచ్చితంగా, ఉన్నది ఉన్నట్లుగా అనువాదం చేయడం వలన ఈనాడు కచ్చితంగా, #ఉన్నది_ఉన్నట్లుగా అనే పదాలు వాడవలసిన చోట తు.చ. తప్పకుండా అనే పదాం #ఉపయోగంలోకి వచ్చింది.


నిజానికి సంసృత శ్లోకాల్లో అర్ధముతో నిమిత్తము లేకుండా #గణముతో సరిపెట్టడానికి " తు.చ." అని పూరణార్ధము వేసుకుంటారు . అలా వేసినవాటిని విడిచిపెట్ట కుండా ప్రమాణం గా స్వీకరించడమే దానర్ధము .


సంస్కృతం లో తు, చ అనే అక్షరాలని conjunction కోసమూ, ఛందస్సు లో గణాలు సరిపెట్టడం కోసం ఒక అక్షరం అవసరమైన సందర్భాల్లోనూ వాడతారు. పద్యం కోసం వాడినప్పుడు 

ఈ అక్షరాలు పద్యం యొక్క అర్ధానికి కొత్తగా ఎమీ తోడ్పడవు, ఇవి తీసెయ్యడం వల్ల పద్యం అర్ధం చెడదు. కేవలం fillers లాగ పని చేస్తాయి.

ఎవరైనా ఏదైనా Copy చేసే సందర్భాల్లో, అర్ధానికి contribute చెయ్యవని చెప్పి ఈ అక్షరాలని వదిలెయ్యకుండా వీటిని కూడా Copy చేస్తే, దీన్ని తు చ తప్పకుండా Copy చెయ్యడం అంటారు. #ఉన్నదున్నట్టు చెప్పడాన్ని తు చ తప్పకుండా చెప్పడం అన్న వాడుక ఈ విధంగా వచ్చింది.


తు.చ. ని విడమర్చితే... 

****

'తు' అంటే #తుమ్మినా....'చ' అంటే #చచ్చినా అని.ఇది పూర్తిగా తెలుగు వ్యావహారిక జానపదము. 


మన సంప్రదాయం ప్రకారం ఎవరైనా తుమ్మితే అది అశుభం లేదా అపశకునంగా భావించి సదరు చెయ్యబోయే పనిని ఆపివేస్తారు. ఇక ఎవరైనా ఒక వ్యక్తి చచ్చిపోయిన తరువాత కొన్ని పనులు అర్థంతరంగా ఆగిపోతాయి. ఇక్కడ మొదటిది (తుమ్ము) మన జీవితములో చాలా సాధారణంగా జరిగే విషయం, అతి స్వల్పమైనది. ఇక రెండవది (మరణం) జీవమే లేనిది, అంటే అతి గరిష్ఠమైనది. ఈ రెండిటిలో ఏది జరిగినా తప్పకుండా ఆ యొక్క పనిని ముగించుతాను అని అర్థము అనగా ఎన్ని అవాంతరాలు వచ్చినా అనుకున్న పని అయిపోవాలి అనే దృఢ సంకల్ప బలమే 'తప్పకుండా' అనే పదానికి 'తు.చ.' బలము.


తు.చ. తప్పకుండా అనే పదాన్ని కచ్చితంగా లేక ఉన్నది ఉన్నట్లుగా అనే అర్ధం వచ్చేలా లేక ఈ పదాలకు మరింత బలాన్ని చేకూర్చేదిగా చెబుతారు..

కామెంట్‌లు లేవు: