26, అక్టోబర్ 2025, ఆదివారం

శివస్తుతి

 *శివస్తుతి - కార్తికమాసం-విశ్వావసు*


సీ॥

తలపైన గంగమ్మ తాండవంబాడగా 

ఉలుకకుందువు నీకు నోర్పు మెండు 

నాగులెన్నియొ మీద నర్తించి తిరుగాడ 

భూషలందువు గొప్ప పోడిమౌర! 

వ్రేలు పుఱ్ఱెలదండ ప్రీతిగా తలుతువు 

వైరాగ్య మెంతగా ప్రబలెనయ్య! 

వటవృక్షమూలాన వరలు ధ్యానముతోడ 

నిత్యతపము సల్పు నియతి నీది 

తే.గీ.

జాయ పార్వతి తగ్గదై సహకరించ

లోటు లేదయ్య విశ్వేశ లోకములను 

ప్రోచి పాలించు నిన్నేను మ్రొక్కి గొలుతు 

మోక్ష మీయవె దయతోడ వ్యోమకేశ! -6

===========

పోడిమి=ప్రవర్తన

*~శ్రీశర్మద*

కామెంట్‌లు లేవు: