మదురై మీనాక్షిదేవి కోవెల..!!
మీనాక్షి- మీనముల వంటి
కనులు కలిగినది మీనాలు నిద్ర పోవు.
శక్తి రూపమైన మీనాక్షి దేవి తన కంటి రెప్పలు మూసుకున్న మరుక్షమణమే యీ అండ పిండ బ్రహ్మాండములోని చరా చరములు నశిస్తాయి. అటువంటి దుస్థితి యీ లోకానికి ఏర్పడకుండా వుండడం కోసమే మీనాక్షి దేవి కంటి రెప్ప మూయకుండా
సకల ప్రపంచాన్ని కాపాడుతున్నది.
మదురై నగర అధిదేవత
మీనాక్షి దేవి . ఆదేవత రెప్ప వేయకుండా కాపాడుతుండడం వలనే,
మదురై ప్రజలు రాత్రనక ,
పగలనక కష్టపడి పనిచేస్తారు.
మదురైని నిద్రపోని నగరంగా పిలుస్తారు. అత్యంత ఆశ్చర్య కరమైన
అధ్యాత్మికాద్భుతాలతో నిండి వున్న ఆలయంగా మదురై మీనాక్షి దేవి ఆలయం ప్రఖ్యాతి గాంచింది.
పది హేడు ఎకరాల స్ధలంలో ఈ బ్రహ్మాండమైన ఆలయం నిర్మించబడినది. ఈ ఆలయం ఆది కాలంలోనే ఇంద్రునిచే నిర్మించబడినది.
వృత్తాసురుని వధించిన
ఇంద్రునికి బ్రహ్మ హత్యా
పాతకం చుట్టుకున్నది. ఆ దోషంనుండి విముక్తి పొందడానికి ఇంద్రుడు కదంబవనంగా వున్న యీ దివ్య స్ధలంలో వెలసిన స్వయంభూ సుందరేశ్వరుని పూజించి తరించాడు.
ఇంద్రుడే యీ దేవాలయాన్ని నిర్మించినట్లుగా
తిరువిళయాడల్ పురాణం తెలియ పరుస్తోంది. మలయధ్వజుడనే మహారాజు సంతానం కోసం
పుత్రకామేష్టి యాగం చేశాడు. మలయధ్వజుడి భార్య అయిన కాంచనమాల అంబిక కి పరమ భక్తురాలు , పూర్వ జన్మలో అంబికనే తన పుత్రికగా కావాలని కోరుకుంది. ఆవిడ కోరికను తీర్చడానికి అంబిక ఆ యాగ గుండము
నుండి మూడుసంవత్సరాల బాలికగా ఆవిర్భవించింది.
అప్పుడు కాంచనమాలకి
పోయిన జన్మలో శ్యామలాంబిక తనకు యిచ్చిన మాట గుర్తుకు వచ్చింది. వరప్రసాదంగా లభించిన ఆ పుత్రికకు శ్యామల అనే పేరుతో అపురూపంగా పెంచారు.
కొడుకేలేని కారణంగా ఆ పుత్రికనే పుత్రుడుగా భావించి, సకల శాస్త్రములు , విద్యలు
నేర్పించారు. ఆ బాలిక యవ్వనవతి అయినది.
తమ పుత్రిక అతిశయంగా మూడు వక్షోజాలుకలిగి వుండడం చూసిన కాంచనమాల దిగ్భ్రాంతి చెందినది.
భగవంతుడు ఇచ్చిన సంతానసంపద , అంబికే పుత్రికగా జన్మించినదని సంతోషిస్తున్త తరుణంలో యీ విపరీతం ఏమిటని భార్యా భర్తలుచింతిస్తూండగా
ఒక అశరీరవాణి
వినిపించింది. " రాజా ! విచారించకండి, ఎప్పుడైతే మీ పుత్రిక తన కాబోయే భర్తని చూస్తుందో, అప్పుడు మూడవ స్ధనం మాయమై పోతుంది " అని పలికింది.
తమ చింత తీరినందుకుభార్యా భర్తలు ఇద్దరూసంతోషించారు.
మలయధ్వజుడు తన తదనంతరం మీనాక్షిని పాండ్య రాజ్యానికి
రాణిని చేశాడు. శ్యామల
ఎంతో భాధ్యత గా కంటికి రెప్ప వేయకుండా తన ప్రజలను ,మదురై ని
కాపాడుతూ రాజ్యం చేసినందున , ఆమెను "మీనాక్షి" అనే పేరుతో ప్రజలంతా పిల్చుకోవడం మొదలుపెట్టారు.
ఆ తరువాత శ్యామల అని పెట్టిన పేరు మీనాక్షి దేవిగా మారింది. మీనాక్షి స్త్రీయేయైనా ఎంతో దక్షతతో సమర్ధవంతంగా పురుషులకు సమానంగా , ప్రజా రంజకంగా రాజ్యపాలన చేసింది.
ఈ నాటికీ, తమిళనాడులో గృహిణి ఆధిక్యత వున్న ఇంటిని'మదురై' అని కీర్తించి చెప్తున్నారంటే, మీనాక్షి దేవి పరిపాలన ఎంత విశిష్టంగా వుండేదో అర్ధమవుతుంది.
తల్లి తండ్రుల మరణానికి
ముందే, చాలా చిన్న వయసులోనే పాండ్యరాజ్యాన్నేలింది.
భూలోకంలోని రాజులెందరితోనో పోరాడి విజయం పొందింది.
దేవతలు కూడా మీనాక్షి శక్తిసామర్ధ్యాలకు తలవంచారు.
చివరికి దేవతల తరఫున
వచ్చిన ఈశ్వరుని కూడా మీనాక్షి ఎదిరించింది. శివుని చూడగానే ఆమె యొక్క మూడవ
స్ధనము మాయమైపోయింది.
మీనాక్షి సుందరేశ్వర రూపంలో వున్న పరమేశ్వరుడిని వరించింది.
తరువాత, మీనాక్షి సుందరేశ్వరుల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
మహారాజుగా సుందరేశ్వరుడు, మహారాణిగా మీనాక్షి అనుగ్రహించిన స్ధలమే మదురై.
ఈ సంఘటనలన్నీ దృశ్యాలు గాను అష్టశక్తి మండపంలో వర్ణచిత్రాలుగానూ చిత్రీకరించబడి వున్నాయి.
మదురై మీనాక్షి దేవాలయంలో
ఆగమశాస్త్రముల ప్రకారం
అష్టకాలపూజలు జరుగుతాయి.
ప్రతి నెలా ఎన్నో రకాల ఉత్సవాలు
జరగడమే ఈ ఆలయ
ప్రత్యేకత. అందులో ముఖ్యంగా చెప్పబడేది చిత్తిర తిరువిళా.
ఈ ఉత్సవం చైత్రమాసం శుక్లపక్షములోతొమ్మిది రోజులపాటు ఎంతో ఘనంగా జరుగుతుంది.
మొదటి రోజు ధ్వజారోహణ.
తరువాత ప్రతి రోజూ
మీనాక్షి, సుందరేశ్వరులను పలు వాహనాల మీద ఊరేగిస్తారు.
ఎనిమిదవ రోజు మీనాక్షీదేవి కి పట్టాభిషేకం. ఆ రోజు సాయంకాలం , అమ్మవారి సన్నిధిలోని ఉత్సవ విగ్రహానికి, పట్టు వస్త్రాలు ఆభరణాలు ధరింపచేస్తారు.
మహారాణులు ధరించే కిరీటాన్ని అలంకరిస్తారు. నివేదన చేసి పూజలు చేస్తారు. తరువాత , ఆలయ ధర్మ కర్తలు, అర్చకులు శివాచార్యులవారు
సుందరేశ్వరుల సన్నిధికి
వెళతారు.
స్వామి సన్నిధిలో ని నవరత్న ఖచితమైన రాజ దండాన్నిమేళ తాళాలతో , తీసుకుని వచ్చి అమ్మవారి ఉత్సవ విగ్రహం ముందు పెడతారు.
ఇదే అమ్మ వారి పట్టాభిషేక మహోత్సవం. (ఆ రోజు నుండి, నాలుగు మాసాలు చైత్రం, వైశాఖం,
జ్యేష్టం, ఆషాఢం మాసాలు మీనాక్షి దేవి పరిపాలనగా చెప్తారు.)
శ్రావణమాసం మూలా నక్షత్రం నాడు సుందరేశ్వరస్వామి పట్టాభిషేకం జరుపుతారు.
అదే నెలలో తొమ్మిదవ రోజున మీనాక్షిసుందరేశ్వరుల
వివాహమహోత్సవాన్ని కన్నులపండువగా మహావైభవంగా జరుపుతారు.,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి