18, అక్టోబర్ 2020, ఆదివారం

 *సంస్కృత సూక్తి*


*ఆచార్యోప్యనాచార్యో భవతి శ్రుతాత్పరిహరమాణః*


తండ్రి వందమంది ఆచార్యులతో సమానం.

 *

ఆచార్య సద్భోదన*

మనకు కావలసింది తదేకదీక్ష. క్రమం తప్పకుండా, అచంచలంగా సాధన చేయాలి. మనశ్శరీరాలను పవిత్రంగా ఉంచుకోవడానికి చేసే పోరాటంలో ప్రాణాలు పోయినా లెక్కచేయని స్థితికి చేరాలి.


చనిపోతే నష్టం ఏముంది? సత్యసాక్షాత్కారాన్ని సాధించి, మన స్వస్వరూపాన్ని అనుభూతి చెందడం ఘనకార్యం కాదా? మన ప్రయత్నలోపం లేకుండా, సాధనలు ఆచరించి ఫలితాన్ని దైవానికే వదిలేయాలి. ఇదే నిజమైన శరణాగతి అనబడుతుంది.


మనస్సు అనే రథాన్ని నడుపగలిగిన వివేకం కలవాడు, పగ్గాలు కట్టిన గుర్రాలను నియంత్రించగల సత్త కలవాడు మాత్రమే పరమగమ్యాన్ని చేరగలడని కఠోపనిషత్తు బోధిస్తోంది.


*మనం బాగానే కష్టపడుతున్నాం గదా* అని ప్రస్తుతం ఉన్న పురోగతితో సంతృప్తి పడకూడదు. ఉన్న పరిస్థితులలో మన ప్రయత్నం సమంజసం కావచ్చునేమో కానీ సాధన కోసం మరింత ఎక్కువ శక్తిని ప్రసాదించమని భగవంతుణ్ణి ప్రార్థించాలి.


ఈ రోజు నాకు పది కిలోల బరువు ఎత్తే సామర్ధ్యం ఉండి ఉండవచ్చు. వంద కిలోల బరువు ఎత్తే బలాన్ని ప్రసాదించమని వేడుకోవాలి. మన సామర్థ్యాన్ని పెంచుకోవాలి. 


మనం చేసిన, చేస్తూన్న సాధన సర్వోత్కృష్టమైనదైనా సరే, ఇంకా ఎక్కువ చేయవచ్చును. సర్వోత్కృష్టతకు అవధులు లేవు కదా.


*శుభంభూయాత్*

కామెంట్‌లు లేవు: