16, నవంబర్ 2020, సోమవారం

శ్రీ సత్యనారాయణ వ్రత మహాత్మ్యము

 శ్రీ సత్యనారాయణ వ్రత మహాత్మ్యము


క. నారద సంయమి యంతట 

    నారాయణు నెదుట నిలిచి నతమస్తకుడై 

    ధారాళ మైన నుడులతొ 

    యీ రీతిగ ప్రస్తుతించె యీప్సిత మదితోన్ 8


ద్వి. "శ్రీకరా !శుభకరా !శ్రీచిద్విలాస!

        శ్రీ లక్ష్మి సంసీవ్య ! శ్రీ వత్స చిహ్న ! 

        కామితార్థ ప్రదాత ! కౌస్తుభ భూష !

        వాసుదేవా ! హరీ ! వైకుంఠ వాస !

        శంఖ గదా చక్ర శార్ఙ్గ సంకాశ !

        యభయ వరద హస్త యాస్రితపోష !

        దేవదేవ ! వరద ! దివ్య ! జీవాత్మ !

        దేవవంద్య ! వినుత ! తేజితదేహ !

        పరమపురుష ! విష్ణు ! పావననామ !

        జయము నారాయణా ! జగదీశ ! విష్ణు !

        మాధవా ! కేశవా ! మధుకైటబారి !

        శ్రీధరా !గోవింద! శ్రీహృషీకేశ !

        వాసుదేవా ! హరే ! వామన ! విష్ణు ! 

        యనిరుద్ధ ! ప్రద్యుమ్న ! యచ్యుతా ! దేవ !

        నారాయణా ! విష్ణు ! నళినాయ తాక్ష !

        పురుషోత్తమా ! దివ్య ! పుండరీకాక్ష !

        పాహిమాం పాహిమాం పరమాత్మ! దేవ !

        గో విప్ర రక్షకా ! గురుమీన రూప !

        కౌస్తుభ మణిహార ! కచ్ఛప రూప !

        గోపాల పాలకా ! క్రోడంబ రూప !

        నారాయణా ! హరీ ! నరహరి రూప !

        వందిత విక్రమా ! వామన రూప !

        పృధివీశబలహరా ! భృగురామ రూప !

        రాజీవలోచనా ! రఘురామ రూప !

        పాలితయాదవా !బలరామ రూప !

        శ్రీచిద్విలాస యో శ్రీకృష్ణ రూప !

        వినుతింతు మనసార విష్ణు స్వరూప !

        కామితార్థప్రదాత !కరుణించు మమ్ము 

        జయమునారాయణా ! జయము యో దేవ !" 9


క. సురముని నారదు స్తుతులను 

    సిరినాథుడు విష్ణు వినియు స్థిఱ నగవులతోన్ 

    పరికించుచు యాతని గని 

    కరుణతొ యిట్లనియెనపుడు కడుశాంతమునన్ 10


✍️ గోపాలుని మధుసూదన రావు 🙏

కామెంట్‌లు లేవు: