16, నవంబర్ 2020, సోమవారం

చరకమహర్షి

 చరకమహర్షి గర్భము మరియు గర్భలక్షణాల గురించి ఇచ్చిన వివరణ - 


     ఆయుర్వేద వైద్యులలో అగ్రగణ్యుడు చరకుడు . ఈయన మానవాళికి అందించిన అత్యద్భుత గ్రంథం " చరకసంహిత " 


        ఈ గ్రంథం 7 స్థానములతో అత్యద్భుతంగా లిఖించబడినది.  అవి 


  *  నిదానస్థానం .


  *  విమానస్థానం .


  *  శారీరస్థానం 


  *  ఇంద్రియస్థానం .


  *  కల్పస్థానం .


  *  సిద్ధిస్థానం . 


  *  చికిత్సాస్థానం .


           సూత్రస్థానం అనునది కూడా వీటిలో కలిసే ఉంటుంది. ఇందులో మీకు ఈ రోజు శారీరస్థానం గురించి వివరిస్తాను . ఈ శారీరస్థానంలో గర్భం అది ఏర్పడేవిధానం గురించి చాలా అత్యద్బుతంగా చరకుడు వివరించాడు . 


 గర్బం ఏర్పడేవిధానం - 


     పరిశుభ్రమైన శుక్రం కలిగిన పురుషునకు  పరిశుద్ధముగా ఉన్నటువంటి స్త్రీ యొక్క ఆర్తవం ప్రశస్తమైన ఋతుకాలం నందు సంయోగం చెంది ఎప్పుడు జీవుడు మనోగమనం పొందునో అప్పుడు గర్బం ఏర్పడును . 


  పిండమునకు ఎవరివలన యే విధమైన అవయవములు సంప్రాప్తినించును - 


    గర్బము తల్లివలన ఏర్పడును . గర్భస్థశిశువుకు తల్లి వలన చర్మము , రక్తము , మాంసము , మేధస్సు , నాభి , హృదయము , క్లోమము , కాలేయము , ప్లీహము , మూత్రపిండాలు , వస్తి , పురీషాశయం , ఆమాశయం , పక్వాశయం , గుద ప్రదేశం యొక్క ఊర్ధ్వ, అదో భాగములు చిన్నప్రేగులు , పెద్దప్రేగులు .


       ఇవన్ని తల్లివలన గర్భస్థ పిండముకు సంక్రమించును. 


      గర్బము తండ్రివలన కలుగును. కేశములు , మీసములు , గోళ్లు , రోమములు  దంతములు , ఎముకలు , సిరలు , స్నాయువులు , ధమనులు , శుక్రము అనునవి తండ్రి వలన కలుగును.


 పిండము ఆడ, మగ అనేవి నిర్ణయం జరుగు విధము - 


     మగవాడి యొక్క శుక్రం , స్త్రీ యొక్క ఆర్తవం కలిసినప్పుడు స్త్రీ యొక్క ఆర్తవం అధికంగా ఉండి మగవాని యొక్క శుక్రం తక్కువుగా ఉన్నచో వారికి తప్పకుండా ఆడ సంతానమే జనియించును.. అదేవిధంగా మగవాని శుక్రం ఎక్కువుగా ఉండి స్త్రీ యొక్క ఆర్తవం తక్కువుగా ఉన్నచో వారికి జనియించు సంతానం మగబిడ్డ అగును. శుక్రశోణిత సంయోగం నందు ఒక భాగం నందు ఆర్తవం ఒక భాగం నందు శుక్రం అధికం ఉండునట్లు శుక్రశోణితం రెండు భాగాలుగా విభజింపబడినచో ఒక ఆడ ,ఒక మగ సంతానం కలుగును. శుక్రం ఎక్కువుగా గల శుక్రశోణితం రెండు భాగాలుగా విభజన చెందినచో ఆ స్త్రీకి ఇద్దరు పుత్రులు జనియించెదరు . కొంతమందికి ఈ శుక్రశోణితం అనేక భాగాలుగా విభజన చెందును. దీనివలన ఒకేసారి అనేక మంది సంతానం జనియించును . ఇది కర్మవశమున జరుగును. 


 లక్షణాలని బట్టి పిండము ఆడ లేదా మగ అని తెలుసుకొనుట  - 


 * నోట నీరుకారుట.


 * శరీరం బరువుగా ఉండటం.


 *  శరీరం కృశించుట .


 *  బడలిక.


 * ఉత్సాహం లేకుండా ఉండటం.


 * హృదయము నందు భాధ .


 * తృప్తిగా ఉండటం.


      పైన చెప్పినవన్నీ మంచి గర్భమును సూచించు లక్షణాలు. 


  * ఎడమవైపు గల అవయవాలతో పనులు ఎక్కువ చేయుట .


 * గర్బము పొడుగు పెరుగుట.


 * ఎడమస్థనము నందు పాలు ఎక్కువుగా ఉత్పత్తి అగుట. 


   ఈ పై లక్షణములు కలిగిన స్త్రీ తప్పక ఆడ శిశువుని ప్రసవించును. ఈ లక్షణములు కు వ్యతిరేక లక్షణములు కలిగియున్నచో  

మగశిశువు జనియించును . ఈ రెండు లక్షణములు కలిగియున్నచో నపుంసకుడు జనియించును . 


         గర్భము కలుగు సమయమున స్త్రీ తన మనస్సు నందు ఎట్టి రూపమును తలచునో అట్టి రూపము గల సంతానం జనియించును . పూర్వజన్మ కర్మ వలన కూడా రూపం సంప్రాప్తించును. 


    గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100  రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

కామెంట్‌లు లేవు: