6, జనవరి 2021, బుధవారం

ప్రాణ “ 5వ భాగము

 *🧘‍♂️“ ప్రాణ “ 5వ భాగము🧘‍♀️*

🕉️🌞🌏🌙🌟🚩


*1) ప్రతి జీవి యొక్క ఆయుర్దాయము శ్వాసలపై ఆధారపడి ఉంటుంది – ఏ జీవికి శ్వాసలు తక్కువగా ఉంటాయో ఆ జీవికి ఆయుష్షు ఎక్కువగాను , ఏ జీవికి శ్వాసలు ఎక్కువగా ఉంటాయో – ఆ జీవికి ఆయుష్షు తక్కువగాను ఉంటుంది – ప్రతి జీవికి జీవిత కాలములో ఇన్ని శ్వాసలు తీసుకోవాలని – ఆ శ్వాసల సంఖ్యను ఆ సృష్టి కర్త ముందే నిర్ణయిస్తాడని మన పెద్దలు అంటూ ఉంటారు – ఆ ఇచ్చిన శ్వాసలను ( కోటా లేదా రేషన్ ) త్వరగా తీసేసు కున్నట్లయితే మనము త్వరగా పైకి వెళ్లి పోతాము – అదే శ్వాసలను పొదుపు చేసుకుంటూ , దీర్ఘముగా గతులు నడిపినచో తక్కువ శ్వాసలను రోజుకి తీసుకుంటూ ఉంటే ఎక్కువ కాలం జీవించవచ్చు – > మనిషికి నిమిషానికి 16 నుండి 18 శ్వాసలు ఉంటాయని ఆధునిక వైద్య శాస్త్రములో వ్రాసి ఉంటుంది – మనిషి నిమిషానికి 18 శ్వాసలు తీసుకుంటే ఎంత ఆయుష్షు ఉంటుందో ఆలోచిద్దాము.*



*నిమిషానికి 18 శ్వాసలు అయితే ఒక గంటకు 1080 శ్వాసలు అవుతున్నాయి – ఈ లెక్కన రోజుకి 25,920 శ్వాసలు అవుతున్నాయి – ఇన్ని శ్వాసలు రోజుకి తీసుకుంటే మనిషి ఆయుషు 80 స౦వత్సరాలు అని చెబుతారు – మనకు తెలిసి మనిషి పూర్తి ఆయుషు 100 సంవత్సరాలు – అలా అంతకాలము మనము జీవించాలంటే నిమిషానికి 15 శ్వాసలు కంటే తక్కువగా తీసుకోగలిగితే రోజుకి 21,600 శ్వాసలు అవుతున్నాయి – > నిమిషానికి 15 శ్వాసలతో మనిషి 100 సంవత్సరాలు పూర్తిగా జీవించవచ్చని శాస్త్రం చెబుతుంది.*



*ప్రస్తుతము భారతీయుడి సగటు ఆయుర్దాయం 55 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలుగా నిర్ణయించడమైనది –అంటే ప్రస్తుతము మన శ్వాసలు 21 నుండి 22 వరకు నిమిషానికి నడుస్తున్నాయి- దీన్ని బట్టి నిమిషానికి 21 శ్వాసలు చొప్పున రోజు మొత్తములో 30 , 240 శ్వాసలు తీసుకుంటున్నాడు – అంటే రోజుకి 8,640 శ్వాసలు ఎక్కవ సార్లు తీసుకోవడము వలన ఆయుర్దాయం 100 సంవత్సరాల నుండి 55 ,60 సంవత్సరాలకు వచ్చేసింది – మరికొంతమంది నిమిషానికి 25, 28 శ్వాసలు తీసుకునే వారు కూడా ఉంటారు- అలాంటి వారు ఇంకా ముందే కాలం చేస్తారు.*



 *– శ్వాసలను బట్టి జీవుల ఆయుషు ఏ విధంగా ఉంటుందో చూడండి -*


*1) కుక్క – నిమిషానికి 28-30 శ్వాసలు తీసుకుంటే – దాని ఆయుష్షు 14 సంవత్సరాలు.*


 *2) గుఱ్ఱం –నిమిషానికి 20-22 శ్వాసలు తీసుకుంటే – దాని ఆయుషు 40 సంవత్సరాలు.*


 *3) మనిషి – నిమిషానికి 15-16 శ్వాసలు తీసుకుంటే – అతని ఆయుషు 100 సంవత్సరాలు.*


*4) పాము –నిమిషానికి 7-8 శ్వాసలు తీసుకుంటే – దాని ఆయుషు 150 సంవత్సరాలు.*


 *5) తాబేలు – నిమిషానికి 4-5 శ్వాసలు తీసుకుంటే – దాని ఆయుషు 200-300 సంవత్సరాలు.*



 *మన బుషులు ప్రాణాయామము ద్వారా దీర్ఘ శ్వాసలు అలవాటు చేసుకొని దీర్ఘ కాలం జీవించడం తెలుసుకున్నారు – 200 ,300 సంవత్సరాలు తేలికగా జీవించ గలిగారు – వారు నిమిషానికి 5,6 శ్వాసలు తీసుకునేవారని చరిత్రలో చాల గ్రంథాలలో వుంటుంది – నిమిషానికి 4 శ్వాసలతో గడిపేవారు కూడా వుంటారు.*



*శ్వాసలకు , గుండెకు అవినాభావ సంబంధము వుంది – ఒక శ్వాసకు 4 సార్లు గుండె కొట్టుకుంటుంది – అంటే 1:4 అని అర్ధం – శ్వాసలను తగ్గిస్తే గుండె కొట్టు కోవడము కూడా తగ్గుతుంది – మన లెక్క ప్రకారము నిమిషానికి 22 శ్వాసలు అంటే 88 సార్లు గుండె కొట్టు కొంటుంది అని అర్ధం – ఎక్కువ సార్లు గుండె కొట్టుకుంటే ఆయుషు తక్కువై పోతుంది – > మన ఆయుష్షు అనేది శ్వాసలను బట్టి ఆధార పడివుంది.*



*కాబట్టి తక్కువ శ్వాసలను తీసుకుంటే మంచిది – తక్కువ శ్వాసలలో ఎక్కువ గాలిని పీల్చుకో గలిగితే మనకు ఆయుర్దాయము పెరగడమే కాకుండా , ఆరోగ్యము , ఆనందము ,నిర్మలత్వము మొదలగునవి కూడా లభిస్తాయి – జీవితము ఎంతో సుఖమయంగా సాగుతుంది – ఇలాంటి ఆనందమయ దీర్ఘ కాలపు జీవనానికి దీర్ఘ ప్రాణాయామము ఎంతో సహాయము చేయగలదు.*



*బ్రహ్మంగారి కాలా జ్ఞానములో మనిషికి పూర్తి ఆయుష్షు ఇంకా రాను రాను దిగజారి ప్రస్తుతం ఉన్న 55 సంవత్సరాల నుండి 16 స౦వత్సరాల దిగజారుతుంది అని చెప్పబడింది – అలాంటి పరిస్థితి ఏర్పడకుండా దీర్ఘ ప్రాణాయామాన్ని తోడు చేసుకొని , ఆహార నియమాలను పాటిస్తే మనిషి ఈ వాతావరణ పరిస్థితులలో కూడా 100 సంవత్సరాల పైబడి ఆరోగ్యంగా జీవించ వచ్చు – అలాంటి చక్కని జీవనాన్ని అలవాటు చేసుకునే ప్రయత్నం చేద్దాము.*




*2) శ్వాసలకి, మనస్సుకి ఉన్న సంబంధం :- శ్వాసలకి, మనస్సుకి చాల దగ్గర సంబంధం ఉంది – ఈ రెండింటిని సంబ౦ధం ఎలాంటి దంటే గాలికి, అగ్నికి ఉన్న సంబంధం లాంటిది – గాలి పెరిగితే అగ్ని పెరుగుతుంది – అదేవిధముగా శ్వాసలు పెరిగితే మనస్సు చంచలంగా ఉంటుంది – గాలి నిలకడగా ఉంటె అగ్ని నిలకడగా ఉంటుంది – అలానే శ్వాసలు స్థిరంగా ఉంటె మనస్సు స్థిరంగా ఉంటుంది.*



*నిమిషానికి 15 శ్వాసల కంటే తక్కువ తీసుకో గలిగినప్పుడు మనస్సు నిర్మలంగా ఉంటుంది – నిమిషానికి 18 అంతకంటే ఎక్కువ అయినప్పుడు అలజడిగా – ఆలోచనలు ఎక్కువగా వస్తూ – ప్రశాంతత లోపిస్తుంది – శ్వాసలు తగ్గితే మనస్సు బాగుంటుంది – మనస్సు బాగుంటే శ్వాసలు తగ్గుతాయి – అలాగే శ్వాసలు పెరిగితే మనస్సు బాగోదు – మనస్సు బాగోపోతే శ్వాసలు మరల పెరుగుతాయి – మనస్సుకి – శ్వాసలకు ఉన్న అవినాభావా సంబంధం అటువంటిదన్న మాట – > ఈ సత్యాన్ని గ్రహించిన మన యోగులు మనస్సును అరికట్టాలంటే శ్వాసలను అరికడితే సరిపోతుందని చెప్పారు.*



*గౌతమ బుద్దుడు కుడా ఈ విషయాన్ని తెలుసుకొని శ్వాస ద్వారా మనస్సును – ఆలోచనలను స్వాధీనము చేసుకోవచ్చనే ధ్యాన ప్రక్రియను అమలు చేశాడు – గాలి పీల్చేటప్పుడు – వదిలేటప్పుడు మనకు తెలుస్తున్నది అంటే ఆ సమయములో మనస్సుకు నిలకడ తక్కువగా ఉంటుంది – > ఉచ్వాస, నిశ్వాసాలు వల్ల మనకు తెలియనంతా నెమ్మదిగా – దీర్ఘంగా గతా గతులు జరిగేటప్పుడు మనస్సు అతర్ముఖం అవుతుంది – ఆ స్థితిలో మన మనస్సు ఎలా చెబితే అలా వింటుంది – మన మనస్సుకు ఇలాంటి స్థితి రావాలంటే – శ్వాస క్రియలో మార్పు రావాలి – ధ్యానము చేయడం ప్రారంభించిన 5, 10 నిమిషాలలో కొంతమంది భాహ్య ప్రపంచాన్ని వదిలి వేస్తారు – ఆ స్థితిలో వారి శ్వాసలు అంత నెమ్మదిగా తెలియకుండా జరుగుతాయి – ఆ సమయములో శ్వాసల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంటుంది.*



*ఆహార నియమాలు బాగా పాటిస్తూ ధ్యానం చేసేవారికి ధ్యానములో 8 నుండి 10 శ్వాసలు మాత్రమే  నడుస్తాయి – ఇంత తక్కువ సంఖ్యలో శ్వాసలు నడిస్తే ఆ ధ్యానం నుండి లేవబుద్ధి కాదు – > ఒక ఆవును ఎటూ పరుగులు తీయకుండా కట్టి వేయాలంటే గట్టి తాడు ఒకటి ఉంటే  సరిపోతుంది – అలాగే పరిగెత్తే కోతిలాంటి మనస్సును కట్టి వేయాలంటే తక్కువ శ్వాసలతోనే అది సాధ్యం – ఏపూట మీలో బాగా తక్కువ శ్వాసలు నడుస్తూ ఉంటాయో ఆ పూట మీకు తెలియకుండా మనస్సు స్థిరంగా ఉంటుంది – ఎప్పుడూ శ్వాసలు పెరుగుతాయో అప్పుడే బద్ధకం, నీరసం, మత్తు మొదలగునవి మీకు తెలియకుండా వచ్చేస్తాయి.*




*3) ఈ రహస్యాన్ని గ్రహించిన మన పూర్వికులు మనస్సును చెప్పు చేతుల్లో ఉంచుకొని మానసిక – శారీరక సౌఖ్యాలను పొందడం కోరకు ఆహారాన్ని యుక్తమైనది తినేవారు – అనుకూలమైన ఆహారాన్ని తీసుకొని ఆనందాన్ని పొందగలిగే వారు – దీని ద్వారా శ్వాస క్రియ మనకు తెలియకుండా 24 గంటలు ప్రశాoతంగా సాగుతుంది.*



*మనము ఇప్పటి వరకు శ్వాస క్రియ తగ్గితే మనస్సు ఎలా అణిగి ఉంటుందో తెలుసుకున్నాము – అలాగే ఇప్పుడు మనస్సు అదుపు తప్పితే శ్వాస క్రియ ఎలా తప్పుతుందో తెలుసుకుందాం – > మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు శ్వాస క్రియ కూడా బాగా నెమ్మదిగా నడుస్తుంది – ఎప్పుడైతే మనస్సులో అలజడులు ప్రారంభం అవుతాయో అక్కడ నుండి శ్వాస క్రియ ఎక్కువ సార్లు తీసుకోవడం మొదలవుతుంది – కోపాలు వచ్చినప్పుడు, పోట్లాడుకున్నప్పుడు, భయం వేసినప్పుడు వెంటనే శ్వాసలో మార్పు వచ్చి ఎగ శ్వాస నడుస్తుంది – అంటే శ్వాస తీసుకొనేటప్పుడు గుండె, ఛాతీ పైకి బాగా లేస్తూ దిగుతూ ఉంటుంది – అప్పుడు శ్వాసలు సుమారుగా నిమిషానికి 25 నుండి 30 వరకు ఉంటాయి – ఛాతీ అలా ఎగరడాన్ని ఎవరిలో మనం చూసిన మనస్సు అలజడిలో ఉన్నాడని తేలిపోతుంది – మనస్సులో ఇలాంటి ఆందోళనలు చేలరేగిన వెంటనే రక్తంలోనికి “ ఎడ్రినలిన్ ” అనే హార్మోను విడుదల అవుతుంది – ఆ హార్మోను ప్రభావం వలన గుండె కండరాలు సంకోచిoచుకుంటాయి – గుండె వెంటనే దడదడా కొట్టుకుంటూ ఉంటాయి – ఎప్పుడైతే గుండె ఎక్కువగా కొట్టుకుంటుందో దానికనుగుణంగా శ్వాస క్రియ పెరుగుతుంది – నిమిషానికి 100 సార్లు గుండె కొట్టుకుంటే 25 సార్లు శ్వాసలు ఆడతాయి – ఇంకా భయం, గొడవ ఎక్కువవగా ఉంటె 150 నుండి 200 సార్లైనా గుండె కొట్టుకుoటుంది – అప్పుడు పై శ్వాసలు నడుస్తూ, నిమిషానికి 40, 50 సార్లు ఊపిరి తిత్తులు కొట్టుకుంటూ ఉంటాయి – ఇలా శ్వాసలు పైపైన ఉన్నప్పుడు సరిపడినంత ప్రాణవాయువు రక్తానికి చేరదు – అందుకే కోపాలు, చిరాకులు వచ్చినప్పుడు మనకు తెలియకుండా నీరస పడిపోతాము – ఇలాంటి పోట్లాటలు, కోపాలు, చిరాకులు, భయాలు మొదలగునవి రోజాలో ఒక్కసారి వస్తే ఆ హార్మోను ప్రభావం రక్తంలో ఎన్నో గంటలు ఉండి – శ్వాస క్రియను, గుండె పని తీరును పూర్తిగా మార్పు చేస్తాయి – అందు చేతనే మన పెద్దలు తన కోపమే తన శత్రువు అంటారు – కోపమనేది శ్వాస క్రియకు ముఖ్యముగా ఎంతో హాని కల్గిస్తుంది – శ్వాసలు తగ్గితే మనిషికి కోపము తగ్గిపోతుంది – కోపములో ఉన్న మనిషి ఇలా అంటూ ఉంటాడు – నాకు కనుక కోపము వచ్చిందటే నేను మనిషిని గాదు – నేను ఏమి చేస్తానో నాకే తెలియదు – మనిషిని పశువును చేసేది కోపమే – మనమేమిటో కూడా మనకు తెలియ కుండా చేస్తుంది – ఎవరు మనల్ని ఎలాంటి మాటలన్న పట్టించుకోక పొతే మనము బాగుపడుతాము.*



*ఒక తడవ బుద్దుడిపై చాలామంది వెళ్లి చాలాసేపు తిడుతుంటారు – బుద్దుడు ఏమి జవాబు చెప్పడు – అప్పుడు వారంటారు ఇంత సేపటి నుండి తిడుతున్నా నీకు అవి ఎక్కడము లేదా ? నీవు అసలు మనిషివా కాదా ? అని గట్టిగా అరుస్తారు – అప్పుడు బుద్దుడు ఇలా చెపుతాడు – “ మన ఇంటికి అతిధి వచ్చినప్పుడు మనము ఆహ్వానిస్తే లోపలకు వస్తాడు లేదా ఆహ్వానించక పొతే తిరిగి వెనక్కి వెళ్లి పోతాడు గదా ! – అలాగే మీరన్న మాటలను నేను స్వీకరిస్తే అవి నన్ను చేరి బాధిస్తాయి – లేదా నాలో కోపాన్ని పెంచుతాయి – నేను మీరన్న మాటలను స్వీకరించడము లేదు – అప్పుడు అతిథి తిరిగి వెనక్కి వెళ్ళినట్లుగానే ఆ మాటలు మిమ్మల్ని చేరతాయి తప్ప నన్ను ఏమి చేయలేవు – నాకు వాటికి ఏమి సంబంధము లేదు ” అని బుద్దుడు వారికి సమాధానం ఇస్తాడు – మనస్సును స్వాధీనము చేసుకోవాలంటే ముందు శ్వాసలను స్వాధీనము చేసుకోవడం అనేది సులువైన మార్గము – ఫలితానిచ్చే మార్గం – సరియైన మార్గము అని మరవకూడదు.*


🕉️🌞🌏🌙🌟🚩

కామెంట్‌లు లేవు: