6, జనవరి 2021, బుధవారం

అనఘాష్టమి

 అనఘాష్టమి

అనేక రూపాలు ధరించే గురుదత్తాత్రేయునకి ఒక గృహస్త రూపం కూడా ఉంది . అటువంటి గృహస్త రూప దత్తునకే "అనఘస్వామి" అని పేరు . ఆ స్వామి అర్ధాంగికి "అనఘాదేవి" అని పేరు.ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారము. అనఘాదేవిలో శ్రీ రాజరాజేశ్వరి, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి లక్షణాలు నిండుగా ఉన్నాయి. అనఘస్వామిలో  బ్రహ్మ, రుద్ర, విష్ణు లక్షణాలు ఉన్నాయి. అనఘుడు విష్ణు స్వరూపుడు, అనఘాదేవి లక్ష్మి స్వరూపము. ఈ దంపతులిద్దరూ నిత్యమూ తపోమయమైన జీవనం గడుపుతూ భక్తులకు తత్వజ్ఞానాన్ని అనుగ్రహించే అతి ప్రాచీన ఆది దంపతులు. వారికే అష్టసిద్ధులు (అణిమా, లఘిమా, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశిత్వం, వశిత్వం, కామావసాయితా, మహిమా) పుత్రులై అవతరించారు.అనఘాదేవి యోగేశ్వరి, జగన్మాత, యోగంలో ప్రీతి గలది. గృహం, పతి, పత్ని, పుత్రులను అనుగ్రహిస్తుంది. వంశవృద్ధిని కలిగిస్తుంది. సమస్త కోరికలను సిద్ధింపజేస్తుంది. కవితా శక్తిని, కళలను ఇస్తుంది. ఈమెకే "మధుమతి" అనే పేరు కూడా ఉంది. ఈమె అనఘస్వామి భ్రూమద్య నుండి ఉద్భవించినది. దత్తాత్రేయుడు అనఘను వామభాగంలో ధరించి ఉన్న శాక్త రూపము . "అఘము" అంటే పాపము, ఇది మూడు రకాలు. అనఘము అంటే ఆ మూడు రకాల పాపాలను నశింపజేయడం. అనఘాస్టమీ వ్రతానికి ముఖ్యమైన రోజు మార్గశీర్షమాస కృష్ణపక్ష అష్టమి. ఈ రోజున ప్రతీ సంవత్సరం ఈ వ్రతం చేయడం చాల మంచిది.....మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్:- 9866193557

కామెంట్‌లు లేవు: