20, జూన్ 2023, మంగళవారం

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 96*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 96*


♦️ ప్రభుత్వోద్యోగులు నలభై విధాలుగా అవినీతికి పాల్పడి, అక్రమ సంపాదన ఆర్జిస్తారు. అవి... 


🔸పూర్వకాలపు దస్తావేజులను నేటి కాలమువిగా వ్రాయడం.


🔸నేటి కాలానికి పూర్వకాలం నాటివిగా వ్రాసి చూపడం. 


🔸ఆక్షేపణలు లేని పనిని పూర్తి చేయకుండుట. 


🔸 ఆక్షేపణులన్న దానిని పూర్తి చేయడం. 


🔸స్వల్ప మొత్తాన్ని లెక్కల్లో పెద్ద మొత్తంగా చూపడం. 


🔸పెద్ద మొత్తాన్ని స్వల్ప మొత్తంగా మార్చి వేయడం. 


🔸ఒకరి పేరున ఉన్న దానిని మరొకరి పేరున ఉన్నట్లు రాయడం. 


🔸పరిహారము చెల్లించకుండానే చెల్లించినట్లు వ్రాయడం. 


🔸తక్కువ పరిహారమిచ్చి ఎక్కువ ఇచ్చినట్లు రాయడం. 


🔸మొత్తము ఆదాయాన్ని చిల్లర పద్ధతులుగా వ్రాయడం. 


🔸 చిల్లర పద్దును మొత్తము ఆదాయముగా చూపడం వంటివి వీటిలో కొన్ని.... 


ఇట్టి అవినీతి పనులకు రాజసేవకులు పాల్పడకుండా ప్రభుత్వం వారికి తగిన విధంగా జీతభత్యములనిస్తూ వృత్తి యందు వారి నిజాయితీనీ ప్రత్యేక బహుమతుల ద్వారా ప్రోత్సహించవలెను.


♦️ పది గ్రామములకు ఒక గ్రామపరిషత్తు, పది గ్రామ పరిషత్తులకు ఒక మండల పరిషత్తు, వంద మండల పరిషత్తులకు ఒక ఖర్వాటకము (జిల్లాపరిషత్తు) ఎనిమిది వందల జిల్లా పరిషత్తులకు ఒక స్థానీయము (రాష్ట్రము) ఏర్పాటు చేయవలెను. ప్రతి గ్రామము నందు పురోహితుడు, వైద్యుడు, కరణము, మునసబు, వెట్టి అను వారలను ప్రభుత్వ ఖర్చుతో నియమించవలెను. 


♦️గ్రామస్తులు తామే సహకార పద్ధతిన నీటి వనరులు ఏర్పాటులకు ఆనకట్టలు నిర్మించుకోవలెను. ప్రభుత్వం కూడా లాభాపేక్ష లేకుండా ప్రజాహితంకోరి ఇట్టి నిర్మాణములకు తగిన ధన సహాయము, నిపుణుల సహాయము అందించవలెను. 


♦️రహదారులు, అతిథిగృహాలు, ధర్మసత్రాలు, ప్రయాణ సౌకర్యాలు, రవాణా, వార్త, భూ జల మార్గ రవాణా సౌకర్యములు, తపాలా, విద్యాలయాలు, వైద్యశాలలు, చెరువులు, బావులు తదితర త్రాగునీటి సౌకర్యాల వంటివన్నీ ప్రభుత్వం లాభనష్టాలు భేరీజు వేసుకోకుండా ప్రజలకు కల్పించాలి. అయితే వీటిని ఏర్పాటు చెయ్యడానికయ్యే ఖర్చు నిమిత్తం ధనిక వర్గాలు, వాణిజ్య వ్యాపార వర్గాల వారి నుండి వృత్తిపన్ను, వ్యాపార పన్ను, ఆదాయపు పన్ను వసూలుచేసి వచ్చిన ధనాన్ని ప్రజాసంక్షేమ కార్యక్రమాలకి ఉపయోగించాలి. 


♦️దిక్కులేని అనాధలను, వృద్ధులను, గర్భిణీలను, దీర్ఘరోగులను ప్రభుత్వమే పోషించవలెను. వీరి కోసం విడివిడిగా ఆశ్రయాలు నిర్మించవలెను. 


♦️ప్రభుత్వ ఆదాయ వ్యయములను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి నివేదికలు అందించడానికి కేంద్ర స్థాయిలో కేంద్ర గణాంగికుడు (ఆడిటర్ జనరల్) మొదలుకొని క్రింది స్థాయిలో రాష్ట్ర గణాంగికుడు (ఆడిటర్ జనరల్ ఇన్చార్జి ఫర్ స్టేట్) వరకూ వివిధ స్థాయిలలో గణాంకులని నియమించి వారిని విత్త మంత్రి (ఫైనాన్స్ మినిస్టర్) పర్యవేక్షించవలెను. ఆదాయ వ్యయములు సక్రమముగా లేకున్న ప్రభుత్వము పనిచేయుట కష్టం. 


♦️ 'అష్టవర్షాత్ భవేత్కన్యా...' అను పురాతన సాంప్రదాయము మారవలెను. పన్నెండు సంవత్సరములు నిండిన తర్వాత స్త్రీకి, పదహారు సంవత్సరములు నిండిన తర్వాత పురుషునికి వివాహయోగ్యత సిద్ధించును. కాలమార్పును అనుసరించి దీనిని సవరించుకొనవలెను. 


♦️స్త్రీకి పునర్వివాహము - నీచుడు, దేశాంతర గతుడు, రాజద్రోహి, వ్యసనపరుడు, నపుంసకుడు, ఘాతకుడు అయిన భర్తను వదిలిపెట్టి స్త్రీ మరియొకరిని వివాహం చేసుకొనవచ్చును. ఇట్లే పరస్త్రీ పొందుకోరు భర్త లేదా పరపురుషుని పొందుకోరిన భార్య నేరంలో రుజువైన వారిని కఠినముగా శిక్షించవలెను. వీరిని బహిరంగంగా దండించి మరెవ్వరూ అటువంటి నేరాలకు పాల్పడకుండా హెచ్చరించవలెను. 


♦️కులములను బట్టి కాక గుణమునుబట్టి తమ ప్రభువును ప్రజలు ఎన్నుకొనవచ్చును. అయితే వంశాచారముననుసరించి గుణవంతుడైన రాజు లభించినచో అతనిని రాజుగా అంగీకరించవలెను. 


♦️ జ్యేష్టుడికే అధికారము అనునది ఒకప్పటి సాంప్రదాయము. జ్యేష్టుడు దుర్భిద్ది గలవాడైనప్పుడు, సత్పురుషుడైన కనిష్టుడికి రాజ్యాధికారము కట్టబెట్టవలెను. అట్టి సత్పుత్రులు లేకున్న ప్రజాభీష్టంమున గ్రహించి ప్రజలలో ఒకనిని రాజుగా అభిషేకించవలెను. అంతేకానీ దుర్జనుడైన కుమారునికి అధికారమప్పగించి కులముతోపాటు రాజ్యము చెడును. 

(ఇంకా ఉంది)..🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: