20, జూన్ 2023, మంగళవారం

శంకరుని దర్శనం..

 అంత్య ఘడియలలో అపర శంకరుని దర్శనం...

పరమశివ భక్తుడైన అరుణగిరినాధర్ రచించిన తిరుప్పుగళ్ పాటలకు అత్యంత ప్రచుర్యాన్ని కల్పించిన ముఖ్యలలో కృష్ణ స్వామి ఒకరు. అందుకే ఆయనను "తిరుప్పుగళ్ మణి "అంటారు. ఆయన భార్య పరమాచార్య వారి భక్తురాలు. ఆమెకు ఉబ్బస వ్యాధి తీవ్రంగా రావటం తో మదనపల్లి టి. బి ఆసుపత్రి లో చేర్చారు. అదే సమయంలో స్వామి వారు కాశీ యాత్రకు పోతూ మధ్యలో మదనపల్లి వచ్చారు. స్వామి వారు అక్కడికి వచ్చారని తెలిసి తాను వారి దర్శనానికి వెళ్లలేక పోయినానని ఆమె ఎంతో బాధ పడింది. ఆసుపత్రి మంచం పై నుంచే స్వామి వారిని ప్రార్ధించేది."పెరియవ కాలుణ్ణి చూచే ముందే మహా కాలుని (శంకరుడు ) అవతారమైన మీ దర్శన భాగ్యం పొందలేని దురదృష్ట

వంతురాలిని "అని దుఖించేది.

మదనపల్లిలో మకాం చేసి ఉన్న స్వామి, శిష్యుణ్ణి పిలిచి టి. బి ఆసుపత్రి అధికారులనుంచి ఒక రోగిని చూడడానికి అనుమతి పత్రం తెమ్మని ఆదేశించారు. అధికారులు అనుమతించాక స్వామి పల్లకిలో కూర్చొని ఆమె ఉన్న పడకకు దగ్గరగా పొమ్మని ఆదేశించారు. ఆమె అదృష్టం ఏమని చెప్పాలి.  చివరి ఘడియలలో ఉన్న తనకు స్వామి వారు ఆమె పడకకు దగ్గర గా వెళ్లి దర్శనం అనుగ్రహించారు. ఆమె ఎంతో శాంతి తో కన్ను మూసింది.

***స్వామి వారి మొత్తం చరిత్రలో అంత్య దశలో ఉన్న రోగి వద్దకు తామే వెళ్లడం అనేది ఈ సందర్భంలో తప్ప మరి జరగలేదు.

కామెంట్‌లు లేవు: