16, జులై 2023, ఆదివారం

ముందు జాగ్రత్త


ముందు జాగ్రత్త

సమజంలో మనం రోజు ముందు జాగ్రత్త పరులను అనేకులను చూస్తూ ఉంటాంనిజానికి నీవు నేను కూడా ముందు జాగ్రత్త పరులమే అవునా కాదాఒక విద్యార్థి సెలవుల తర్వాత పాఠశాల/కళాశాల తెరవగానే పరీక్షలకు చదవడం మొదలు పెడతారు ఎందుకు అంటే ఇప్పటినుంచి చదివితే కానీ నేను పూర్తి సిలబస్ సంపూర్ణంగా చదివి అర్ధం చేసుకోగలను. మొత్తం పాఠాలు నాకు క్షుణ్ణంగా వచ్చి ఉంటే ప్రశ్న పరీక్ష లో అడిగిన నేను సమాధానం చేయగలను అంటారు

ఒక గృహస్తు పంట రాగానే కొత్త బియ్యాన్ని ఒక యేటికి సరిపడా ఎక్కువ మొత్తంలో అంటే రెండు లేక మూడు క్వింటాళ్ల బియ్యం, ఒక 50 కిలోల కందిపప్పు  కొనుక్కొని ఉంటారు ఎందుకయ్యా ఇలా కొన్నావు అంటే ఏం చేద్దాం సమయం ఎలావుంటుందో ఇంట్లో బియ్యం పప్పు ఉంటే చాలు ఏమున్నా లేకున్నా రోజులు గడిపేయవచ్చు అంటాడునీకు తెలుసా మొన్న కరోనా సమయంలో నా అలవాటే నన్ను కాపాడింది ఇంట్లో నుంచి కాలు బైట పెట్టకుండా మొత్తం కరోనా కష్టకాలాన్ని అవలీలగా ఎదుర్కున్నాను అని అంటాడు మాట అన్నప్పుడు అతని ముఖంలో ఆత్మవిస్వాసం స్పష్టంగా గోచరిస్తుంది

ఒక వ్యవసాయదారుడు ఇంకా వర్షాకాలం రాకముందే భూమి దున్నుకొని పంట గింజలు నాటడానికి సిద్ధం చేసుకుంటారుఎందుకయ్యా ఇలా చేసావు అంటే వర్షం పడినప్పుడు దున్నడం అంటే కుదరని పని అదే ముందు భూమి దున్నుకొని ఉంచుకుంటే వర్షం పడగానే గింజలు చల్లవచ్చు అని అంటారు.

వేసవిలో కరెంట్ కోత ప్రతి వారు అనుభవించేదే అదే ముందు జాగ్రత్త పరుడు ఒక ఇన్వర్టర్ కొనుక్కొని వుంచుకుంటారు ఎందుకు అయ్యా ఇప్పుడు కరెంటు పోవడం లేదు అని అంటే ఎవరికి తెలుసు రేపు వేసవిలో కరెంట్ పోదని ముందుగా  ఇన్వర్టర్ కొనుక్కొని ఉంటే రేపు కరెంటు పోతే అప్పుడు బాధపడే బదులు ఇప్పుడు తెచ్చుకుంటే మంచిది కదా అని అంటారు

తన కూతురు ఎదుగుతుంటే ఒక తల్లిదండ్రులు ముందు పెండ్లికి కావలసిన ద్రవ్యన్ని   సమకూర్చుకునే ప్రయత్నం చేస్తారు. ఒక మంచి వరుడి కోసం అందరికీ చెప్పి ప్రయత్నం మొదలుపెడతారు. ఎందుకు అంటే ముందు ఒక మంచి సంబంధం చూసుకొని ఉంటే తమ కుమార్తె జీవితం సుఖమయంగా సాగుతుందని చెపుతారు

 

రేపు ఏదైనా ఉరుకు ప్రయాణం అయి పోవాలంటే ముందుగా రైలు లేక బస్సు టికెట్ రిజర్వ్ చేసుకొని ఒక రోజు ముందు తను తీసుకుని పోవలసిన సామాన్లన్నీ ఒక బ్యాగ్ లో, సూట్కేసులో సర్దుకొని సిద్ధంగా ఉంటారు. రైలు తెల్లవారుజామున 6 గంటలకు అయితే 4 గంటలకు అలారం పెట్టుకొని లేచి కాలకృత్యాలు తీర్చుకుని ఒక అరగంట ముందు రైల్వే స్టేషన్ కి వెళ్లి ఉంటారు. ఇదంతా ముందు జాగ్రత్త కదా.  

 ఇలా  వ్రాసుకుంటూ పోతే అనేకానేక విషయాలు మనకు నిత్యజీవితంలో బోధపడుతూవుంటాయి. నిజానికి ముందు జాగ్రత్త అనేది ఒక సమర్థవంతమైన మనిషి చేయాల్సిన పనే అదే ముందు జాగ్రత్త లేకపోతే జీవితంలో అనేక ఇబ్బందులు ఎదురు అవుతాయి. ఒక విజయవంతమైన జీవితం గడుపుతున్న వాడు తన జీవితాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా నడుపుతూ ముందు జాగ్రత్తలతో వుండి అనేక విజయాలను పొందగలుగుతారు. దీనిని బట్టి మనకు తెలిసేది ఏమిటంటే ప్రతి మనిషి ముందు జాగ్రత్త కలిగి ఉండాలి అని. పరిస్థితి రకంగా వస్తుందో ముందుగా ఊహించి తదనుగుణంగా ముందు జాగ్రత్త పడటం అవసరం.

అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునే మానవుడు ఒక్క విషయం తెలిసి కూడా జాగ్రత్త పడడు ఎందుకోగానీ విషయం మీద ఎంతో అజాగ్రత్తగా ఉంటారు అంటే అతిశయోక్తి కాదు. ఇంతకీ ఏమిటి విషయం, ఏమిటి అజాగ్రత్త అంటే ఇంకా ఏమిటండి ప్రతి మనిషి ఆఖరు గమ్యం అంటే అర్థం కాలేదా అదే మరణంప్రతి మనిషి తన జీవిత అంతిమ ప్రయాణం మరణం అని తెలుసు అయినా దానికి సంబంధించిన ముందు జాగ్రత్త మాత్రం పడడు .  తాత్కాలికంగా ఒకరోజు లేక్ ఒక వారమో వెళ్లే ప్రయాణికులు వారం రోజులనుండి సన్నాహాలు చేసుకుంటూ ఉంటారు కానీ శాశ్వితమైన  ప్రయాణానికి మాత్రం ఏమాత్రం ముందు జాగ్రత్త పడకుండా పూర్తిగా నిర్లక్ష్యం గా వ్యవహరిస్తూ వుంటారు.

 

సాధక మిత్రమా భగవంతుడు మనకు ఇచ్చిన అపూర్వ అవకాశమే రోజు మనం పొందిన ఈ మానవ జన్మ జన్మను మనం సార్ధకం చేసుకొని జన్మరాహిత్యాన్ని పొందడానికి ప్రయత్నం చేయకపోతే మరల మనకు మానవ జన్మ వస్తుందనే గ్యారెంటీ లేదు. ఎనుబది నాలుగు లక్షల జీవరాశులలో ఏదైనా ఒక జీవిగా మళ్ళీ పుట్ట వచ్చు  జన్మలన్ని అజ్ఞాన జీవనాన్ని గడిపేవి మాత్రమే. బుద్ధి జీవి గా వున్న మానవ జన్మ ఒక్కటే నీకు మోక్షసాధనకు పనికి వచ్చే జన్మ జన్మను మనం వృధా చేసుకుంటే మోక్ష సిద్ది పొందటం దుర్లభం.

తెలివయిన వారు ఎప్పుడు దీపం ఉండగానే ఇల్లు సర్దుకుంటాడునీవు కూడా తెలివైన వాడిగా ప్రవర్తించు మానవ జన్మ ఉండగా జన్మ లక్ష్యం అయిన మోక్షాన్ని పొందుఇప్పటినుండి ప్రారంభిస్తే తప్పకుండా మనకు మోక్ష సిద్ధి కలుగుతుందిఅధవా కలగక పోయిన దైవానుగ్రహం వలన మరల మానవుడిగా నయినా జన్మించవచ్చు. కృష్ణ భగవానులు గీతలో స్పష్టంగా చెప్పారు యోగ భ్రష్టుడు తిరిగి తర్వాత జన్మలో తానూ జన్మలో ఎక్కడ సాధన నిలిపివేసారో అక్కడినుంచి మొదలుపెట్టి తన గమ్యాన్ని చేరుకుంటారని. కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా ఇప్పుడే నీ సాధనను ప్రారంభించుమోక్షాన్ని సిద్దించుకో.

ఓం తత్ సత్

ఓం శాంతి శాంతి శాంతిః

ఇల్టు

మీ భార్గవ శర్మ

 

 

కామెంట్‌లు లేవు: