16, జులై 2023, ఆదివారం

దక్షిణాయణ పుణ్యకాలం.

 మనకి శాస్త్ర ప్రకారంగా దక్షిణాయణం అంతా ఉపాసనా కాలం. సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించినది మొదలు మళ్ళీ మకర రాశిలోకి ప్రవేశించే పర్యంతం మధ్యలో ఉండే కాలం అంతా కూడా చాలా చాలా గొప్ప గొప్ప నైమిత్తిక తిథులతో కూడుకున్నదై ఉంటుంది. నైమిత్తిక తిథుల యందు చేసినటువంటి కర్మాచరణం వలన కలిగిన ఫలం చిత్తశుద్ధిని కల్పించడానికి సాధనంగా మారుతుంది. ఎప్పుడైతే చిత్తశుద్ధి కలిగిందో పాత్రత కలుగుతుంది. పాత్రత కలిగితే ఈశ్వరుడు జ్ఞానాన్ని కటాక్షిస్తాడు. ఆ జ్ఞానమే ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిగా చెప్పబడే కైవల్యము/మోక్షమునకు కారణం అవుతుంది. విహిత కర్మాచరణం చేయడానికి కావలసినటువంటి నైమిత్తిక తిథులన్నీ విశేషమైన సమాహార స్వరూపంతో ఉండేది దక్షిణాయణ పుణ్యకాలం.

కామెంట్‌లు లేవు: