4, జులై 2023, మంగళవారం

నిత్యాన్వేషణ

 నిత్యాన్వేషణ:


*కుబేరునికి రావణుడు తమ్ముడు కదా! వీరి ఇద్దరి మధ్య యుద్ధం ఎందుకు వచ్చింది.?*


కుబేరుడు ధనాధిపతి. యక్షులకు రాజు. మనిషిని వాహనంగా గలవాడంటారు. ఇతని రూపం కొంత వికృతంగానే వుంటుందని పేర్కొన్నా, ఈయన కుమారుడయిన నలకూబరుడు పురాణాలలో అందగాళ్ళలో ఒకడిగా పేరు చెందినవాడు.

కుబేరుడిని అసలు పేరు వైశ్రవణుడు. తండ్రి విశ్రవసు వయినా తల్లి ఎవరనే దానిగురించి వేరు వేరు పురాణాలలో భిన్న కథనాలు వున్నాయి. కుబేరుడనే పేరు శాపం వలనే వచ్చింది. ఒకసారి పార్వతీదేవి శివుని ఎడమ తొడపై కూర్చొని ఉండగా కుబేరుడు అసూయతో చూడడం పార్వతి గమనించి కు(చెడు) దృష్టితో చూచినాడు కనుక కన్ను పచ్చగా మారుతుందని శాపం ఇచ్చింది. అందుకే కుబేరుని ఏక పింగ లేక పంగళాక్షుడని కూడా అంటారు. కుబేరుడికి స్నేహితుడు అయిన శివుడు పార్వతిని శాంతింపచేసి మాములు చూపు కలిగించాడు.

రావణ, కుంభకర్ణ, విభీషణుడు, శూర్పణఖ మొదలయినవారు విశ్రవసుడికి మరో భార్య అయిన కైకసి వలన కలిగారు. దీనికీ భిన్న కథనాలు వున్నాయి.

కుబేరుడు శివుని గురించి తపస్సు చేసి దిక్పాలకత్వం (ఉత్తర దిక్కుకు అధిపతి), అంతులేని సంపదలు, వరంగా పొందాడు. బ్రహ్మ నుండి పుష్పక విమానం పొందగా, తండ్రి దక్షిణ సముద్రంలో లంకానగరాన్ని కుబేరుడికి నివాసంగా ఇస్తాడు.

రావణుడు. బ్రహ్మనుండి వరాలు పొంది దేవతల్ని బ్రాహ్మణుల్ని హింసిస్తున్నాడని తెలిసి, కుబేరుడు తన తమ్ముడైన రావణుడిని నీతిగా జీవించమని దూతతో వర్తమానం పంపగా, కోపించిన రావణుడు వచ్చిన దూతని చంపి, కుబేరునిపై దండెత్తి యుద్దంలో అతనిని ఓడించి లంకా నగరాన్ని, పుష్పక విమానాన్ని గెలుచు కొంటాడు. తదుపరి కుబేరుడు గంధమాదన పర్వతం పైన అలకాపురిని నిర్మించుకుని నివసించాడు.

కామెంట్‌లు లేవు: