11, ఆగస్టు 2023, శుక్రవారం

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -15🌹*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -15🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


*శ్రీమన్నారాయణుyడు వరాహస్వామిని దర్శించుట:* 


శ్రీమన్నారాయణుని తలకు గాయము తగిలినది కదా! అందువలన ఔషధమునకై అతడు శోధించుచుండెను. బృహస్పతికి ఆ విషయము తెలిసి శేషాచలానికి వెళ్ళి ‘మేడి చెట్టు పాలల్లో జిల్లేడు పత్తిని తడిపి, నీవు ఈ గాయము పై పట్టు వెయ్యాలి’ అని నారాయణునితో చెప్పి వెళ్ళిపోయాడు. 


మందు తయారు చేసికొనుటకై అతడు వస్తువుల గురించి కొండ పై నున్న అరణ్యము అంతా వెదకుచుండగా వరాహస్వామి ఆశ్రమముకనిపించినది. ఆశ్రమములోనికి ప్రవేశించాడు. వరాహస్వామి నారాయణుని గుర్తించి సకల మర్యాదలు చేశాడు.


వరాహస్వామి నారాయణుని ‘‘తాము సర్వ సంపదలు వీడి భూలోకమునకు యేల వచ్చితిరి. అని ప్రశ్నించాడు. 


నారాయణుడు భృగువు వైకుంఠానికి రావడము నుండి భూలోకములో తాను పుట్టలోనుండగా పశువుల కాపరి తనను గండ్రగొడ్డలితో తల పై కొట్టడము వరకూ పూసగ్రుచ్చినట్లు చెప్పాడు.


 నారాయణుడు తాను శేషాచలము పై నివసించ యిష్టపడుతున్నానని, కనుక ఆ పర్వతము పై తనకు కొంత స్థలము ఈయవలసిందని అడిగాడు.


 వరాహస్వామి క్రయధనము యిస్తే స్థలము ఇస్తానన్నాడు. శ్రీమన్నారయణుడు ప్రస్తుతం మీరు (పర్వతము) కలవారు, 


నేను సిరిలేని వాడను, నాకు మీరు స్థలము కనుక యిస్తే నాకు అనేకమంది భక్తులు వచ్చి కానుకలూ అవీ అర్పిస్తుంటారు. 


అలా వారు నాకొరకై వచ్చినప్పుడు మొట్టమొదట మిమ్ములనే దర్శించి మీకు కానుకలు యిచ్చి నా వద్దకు వచ్చే ఏర్పాటు చేసెదను అనగా, 


వరాహస్వామి అంగీకరించి నూరు అడుగుల స్థలాన్ని కొండ పై శ్రీమన్నారాయణునకిచ్చాడు. ఇచ్చి ‘‘నా వద్ద వకుళాదేవి అనే మహాభక్తురాలున్నది. ఆమెను నీ వెంట పెట్టుకొనుము. 

ఆమె నీకు అన్ని విధాల సేవలు చేయుచుండును’’ అని వకుళాదేవిని శ్రీహరికి వప్పజెప్పెను.


వకుళాదేవి శ్రీహరి చరిత్రను వినుట

శ్రీహరి ఒక పర్ణశాలను నిర్మించుకొన్నాడు. దానిలో తానున్నూ వకుళాదేవియు నివసింపసాగిరి. ఒకనాడు వకుళ, ‘నాయనా! అసలు నీ వృత్తాంతమేమిటి?’ అని ప్రశ్నించగా, నారాయణుడు తనకు – నా – అనువారెవరూ లేరు అనియునూ, తల పై గాయము విషయమున్నూ చెప్పినాడు. వకుళ తన విషయమూ చెప్పినది.


శ్రీహరి శ్రీనివాసుడగుట

వకుళ వనమూలికలూ అవీ తెచ్చి నారాయణుని తల పై గల గాయము పై మందువేసినది. పళ్ళూ అవీ తెచ్చి ఆహారము యిచ్చినది. వకుళ నారాయణుని శ్రీనివాసాయని పిలచి పరమానంద మొందేది. 


నారాయణుడు అంతటి నుండి శ్రీనివాసుడుగ వ్యవహరింపబడేవాడు.


*సాలగ్రామ గోవిందా, సహస్రనామా గోవిందా, లక్ష్మీవల్లభ గోవిందా, లక్ష్మణాగ్రజ గోవిందా; |*


*గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా.||15||*


శ్రీ వేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: