9, ఆగస్టు 2023, బుధవారం

శరవణ భవ

 శరవణ భవ


#శరవణ_భవ


కృత్తికా నక్షత్రాన జన్మించిన వాడు సుబ్రహ్మణ్యుడు. అందుకే సుబ్రహ్మణ్యుని ఆరాధనలో కృత్తికా నక్షత్రం ప్రత్యేకమైంది. సూర్యుడు కర్కాటక రాశిలో ఉండగా వచ్చే కృత్తికా నక్షత్రం రోజున తమిళనాట ఆడికృత్తికను నిర్వహిస్తారు. సుబ్రహ్మణ్యస్వామికి అత్యంత ప్రీతికరమైన రోజది. ఆడికృత్తికనాడు సుబ్రహ్మణ్య భక్తులు తమిళనాడులో 'ఆరు పడైవీడు'గా ప్రసిద్ది చెందిన ఆరు ప్రధాన క్షేత్రాలను దర్శించి విశేష పూజలు చేస్తారు. వీటిని ఒకేరోజులో దర్శించలేం. ఆడికృత్తిక నాడు శరవణ భవ నామంతో కలిపి ఈ క్షేత్రాల పేర్లను తలుచుకుంటే దర్శించిన ఫలం లభిస్తుంది.


🌺 దేవసేనా సమేతుడు - తిరుప్పరకుండ్రం 🌺


సుబ్రహ్మణ్యస్వామికి వల్లి, దేవసేన అని ఇద్దరు భార్యలున్నారు. వారిద్దరూ పూర్వజన్మలో విష్ణుమూర్తి కుమార్తెలే. అప్పుడు వారిపేర్లు అమృతవల్లి, సుందరవల్లి. వారిలో అమృతవల్లిని దేవేంద్రుడు పెంచుకున్నాడు. ఆమెయే దేవసేన. తారకాసురుడిని సంహరించి తనను రక్షించిన సుబ్రహ్మణ్యస్వామికి దేవసేననిచ్చి దేవేంద్రుడు తిరుప్పరకుండ్రంలో వివాహం జరిపించాడు.


తిరుప్పరకుండ్రం లో ఆలయం శివమలై అనే కొండ పై వుంది. వివిధ మండపాలు కలిగిన ఆలయ ప్రధాన గర్భాలయం లో స్వామి వారు పెండ్లికుమారుడిగా చతుర్భుజాలతో దర్శనం ఇస్తాడు. ఈ క్షేత్రంలో అభిషేకం మూలవిరాట్టుకు కాకుండా స్వామి వారి ఆయుధం అయిన దండానికి చేయడం విశేషం. స్వామి వారితో పాటు గర్భాలయంలో దేవసేన, విష్ణువు దుర్గాదేవి, లక్ష్మి వంటి దేవతాముర్తులు కొలువుదీరి వున్నారు. కాగా, మదురై లోని మీనాక్షి సుందరేశ్వరులు తమ కుమారుడి వివాహం జరిగిన ఈ క్షేత్రాన్ని ఎప్పుడు చూస్తూ ఉంటారని కథనం.


🚩 #డైలీ_విష్ 🚩

కామెంట్‌లు లేవు: