9, ఆగస్టు 2023, బుధవారం

తాపత్రయం(తపన)*

 *తాపత్రయం(తపన)*


 *ఒక కోటిశ్వరునికి పెద్ద కారు  ప్రమాదం జరిగింది.పదిహేను రోజుల తర్వాత కోమాలో నుండి స్పృహలోకి వచ్చాడు. చుట్టు ఉన్న కుటుంబ సభ్యులందరు ఆనందంతో చూసారు.*


*తాపత్రయం మొదటి మెట్టు:*

*“అందరు ఇక్కడే వున్నారా?” అని అడిగాడు.*

*అవుననే కొడుకు చెప్పాడు.*

*“అందరు ఇక్కడే ఉంటే అక్కడ షాపులో ఎవరున్నారు?” అని అడిగాడు.*


*తాపత్రయం రెండో మెట్టు:*

*“నేను అదృష్టవంతురాలిని.  నా మాంగల్యం గట్టిది. మీకు పెద్దకారు ప్రమాదం జరిగింది. కారు నుజ్జునుజ్జు అయ్యింది. అయినా మీరు ప్రాణాలతో బయటపడ్డారు,” అంది భార్య.*

*వెంటనే… “కారు ఇన్సూరెన్స్ చేయించారా?” అని అడిగాడు.*


*తాపత్రయం మూడోమెట్టు:*

*“నాన్నా మీకింకొక విషయం చెప్పాలి.  కారు ప్రమాదంలో మీచెయ్యి కారు డోరులో ఇరుక్కుపోయింది. మీచెయ్యి తీసేసారు.” అన్నాడు.* 

*చెయ్యి చూసుకున్నాడు, లేదు. “చేతికి పాతిక లక్షల రోలెక్స్ వాచీ వుండాలిరా!” అన్నాడు.*


*తాపత్రయం నాలుగో మెట్టు:*

*“వాచీ తీసుకున్నారా?” అని లేవబోయాడు.* 

*“నాన్న కంగారు పడకండి, మీకు ఇంకొక విషయం చెప్పాలి, ప్రమాదంలో మీ వెన్నెముక విరిగిపోయింది.  మీరు నడవలేరు. మీపనులన్నీ చేసుకొనేందుకు అనువుగా మీకు కోటిరూపాయలతో ఎలక్ట్రానిక్ రోబో వీల్ చెయిర్ తీసుకొన్నాం.  అందులో కూర్చుంటే పళ్ళు బ్రష్ చేసుకోవటం, స్నానం చేయటం, భోజనం చేయటం వంటి అన్ని మీపనులు మీరే చేసుకోవచ్చు!” అన్నాడు కొడుకు.*

*“కోటిరూపాయలతో కొన్నారా, కొంటానికి  కొటేషన్ తీసుకున్నారా, ఇంకా తక్కువకి వచ్చేదేమో?” అన్నాడు.*


*తాపత్రయానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ ఇంకేమి కావాలి?*

 

*నీతి : తాపత్రయం తగ్గించుకోండి. ఎంత తగ్గించుకుంటే అంత మంచిది, అంత ఆనందంగా ఉంటాము. చిన్న జీవితం మనది.*

కామెంట్‌లు లేవు: