22, నవంబర్ 2023, బుధవారం

అమృతవచనం

 *అమృతవచనం* 


 *అష్ఠావక్రముని* ఇలా అన్నారు:

ఓ *జనక* *మహారాజా* మనుజులలో మూడు తరగతుల వారుందురు.

1) *దేహదృష్ఠి* : వీరు ఎవరినైనా చూడగానే వారి రూపురేఖలు, సౌందర్యము,కట్టు, బొట్టు,జాతి, కులము ఇవి మాత్రమే వారి దృష్టికి అగుపడుచుండును.అట్టివారు *అధములు* .

2) *మనోదృష్ఠి* : వీరు ఎవరినైనా చూడగానే అతని విద్వత్తు, పాండితీ ప్రకర్ష,సాహిత్యసంపద గోచరించును.వీరు *మధ్యములు* .

3) *ఆత్మదృష్ఠి* : వీరు ఎవరినైనా చూడగానే అతని హృదయమందు వెలుగొందుచున్న సర్వభూతాంతర్వర్తి యగు పరమాత్మయే గోచరించును.వీరు *ఉత్తమోత్తములు* .

      మీ సభలో అందురూ దేహదృష్ఠి గలవారిగనే ఉన్నారు అందుకనే నా అష్టావక్ర శరీరమును చూసిన వెంటనే పరిహాసము చేసినారు, దానివలన నాకు ఎటువంటి నష్ఠము వాటిల్లలేదు, వారికి ఏ విధమైన లాభము చేకూరలేదు కాని వారి అజ్ఞానం మాత్రం నాకు బాగుగా వ్యక్తమైంది.

       ఈశరీరం పాంచ భౌతిక మైనది, నశ్వరమైనది,నేడో రేపో నశించునది.కేవలము ఆత్మ మాత్రమే శాశ్వతమైనది, మానాభిమానములకు అతీతమైనది.ఎప్పటికైనను,ఎవరైనను దానిని గ్రహించవలసినదే ఎందుకనగా అందరి గమ్యమూ అదేగనుక.

కామెంట్‌లు లేవు: