22, నవంబర్ 2023, బుధవారం

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం

.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||


మొత్తానికి ఆ యుద్ధంలో కకుత్థ్సుడు దైత్యులనూ వారి పట్టణాన్ని జయించి ఇంద్రుడికి

విజయలక్ష్మిని అందించాడు. ఇంద్రుడు తనకి వాహనమయ్యాడు కనక ఇంద్రవాహుడనీ, దైత్యపురాన్ని

జయించాడు కనక పురంజయుడనీ కకుత్థ్సుడికి నామభేదాలు అప్పటినుంచీ ఏర్పడ్డాయి.

ఈ మహారాజుకు పృథుచక్రవర్తి జన్మించాడు. అతడు సాక్షాత్తు విష్ణుమూర్తి అంశ. పరాశక్తికి

పరమభక్తుడు. ఇతడి కుమారుడు విశ్వరంధి. ఈ విశ్వరంధి సుతుడు చంద్రుడు. ఇతడూ వంశకరుడే.

చంద్రమహారాజుగారి కొడుకు

పేరు యువనాశ్వుడు. మహాతేజస్వి. మహాబలశాలి. ఇతని సుతుడు

శ్రావంతుడు. శావంతి అని అమరావతితో సాటివచ్చే మహానగరాన్ని నిర్మింపజేశాడు. ఈయనకు తనయుడు

బృహదశ్వుడు. ఇతని ఆత్మజుడు కువలయాశ్వుడు. దుంధుడు అనే మహాదైత్యుణ్ణి సంహరించిన

వీరాగ్రణి ఇతడు. అప్పటినుంచీ దుంధుమారుడనే పౌరుషనామంతో విఖ్యాతి గడించాడు. ఇతని

జౌరసుడు దృఢాశ్వుడు. సామ్రాజ్యాన్ని దిగంతాలకు విస్తరింపజేసిన మహావీరుడు. హర్యశ్వుడు ఇతని

పట్టి. వికుంభుడు హర్యశ్వసంజాతుడు. నికుంభుడికి బర్హణాశ్వుడూ, అతనికి కుశాశ్వుడూ సంతానం.

ప్రసేనజిత్తు కుశాశ్వుడికి ఆత్మజుడు. ప్రసేనజిత్తుకి యౌవనాశ్వుడు జన్మించాడు. ఇతడి సంతానమే

మాంధాత. ఇతడు అష్టోత్తర సహస్రంగా మహాప్రాసాదాలు (ఆలయాలు నిర్మింపజేసి పరాశక్తి అనుగ్రహానికి

విశేషంగా పాత్రుడయ్యాడు. ఇతడు మాతృగర్భంనుంచి ఆవిర్భవించలేదు. తండ్రి గర్భంనుంచి జన్మించాడు.

పొట్ట చీల్చుకుని పుట్టాడు. ఇది చాలా ఆశ్చర్యకరంగా అసంభవంగా ప్రకృతివిరుద్ధంగా కనిపిస్తుంది. కానీ

నిజం. అది వివరిస్తాను ఆలకించు

కామెంట్‌లు లేవు: