3, డిసెంబర్ 2023, ఆదివారం

 మల్టీ మిల్లెట్ మొలకల ప్రోటీన్ పౌడర్ మాల్ట్ చేయు విధానము:


పదార్ధాలు--


కొర్రలు, సామలు,అరికలు, ఊదలు,అండు కొరలు,సజ్జలు,రాగులు,వరిగెలు,జొన్నలు,పెసలు,ఉలవలు,కందిపప్పు,అలసంద,పచ్చి బఠాణి,అక్రోట పప్పులు,బాదంపప్పు,నల్లమిరియాలు,యాలుకలు



1.పాలతో చేయు విధానము: ఒక గ్లాసు పాలు గిన్నెలో పోసి స్టౌ పైన పెట్టి మరగనివ్వాలి .పాలు మరిగే లోపు ఒక స్పూను ప్రోటీన్ పౌడర్ చిన్న కప్పులో  వేసి కొద్దిగా నీరు పోసి ఉండలు లేకుండా కలిపాలి.తరువాత ఈ మరిగిన పాలలో  ఈ నీటితో కలిపిన మిశ్రమం వేసి కలిపి 2 నిమిషాలు సన్న మంట పై ఉంచాలి. తరువాత రుచికి తగినంత పంచదార లేదా కొద్దిగా చల్లారాక బెల్లము పొడి కానీ వేసుకొని తాగవచ్చు.

2.మజ్జిగ తో కలుపుకొని త్రాగు విధానము:

 ఒక 1/2 గ్లాసు నీళ్ళు గిన్నెలో పోసి స్టౌ పైన పెట్టి మరగనివ్వాలి.ఈ లోగా 1 స్పూను ప్రోటీన్ పౌడర్ చిన్న కప్పులో వేసి నీళ్ళు పోసి ఉండలు లేకుండా కలిపి మరిగే నీటిలో పోసి 2 నిమిషాలు ఉడకనివ్వాలి.తరువాత చల్లారాక అందులో అర గ్లాసు మజ్జిగ పోసి తగినంత ఉప్పు లేదా సైంధవ లవణం కలిపి త్రాగాలి.

కామెంట్‌లు లేవు: