27, ఏప్రిల్ 2025, ఆదివారం

లక్ష్మీదేవి

 *🪷లక్ష్మీదేవి పద్మముపై ఎందుకు ఉంటుంది🪷* 


🪷శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని శ్రీసూక్తంలో పద్మ విశేషాలతో వర్ణిస్తారు. ఋగ్వేదంలో అమ్మవారి గురించి ఎన్నో ఋక్కులు కనబడతాయి. “పద్మాననే పద్మ ముఖే పద్మాక్షీ పద్మ సంభవే” అని అన్ని పద్మ విశేషణాలు వాడారు. 


🪷పద్మాల వంటి కన్నులు కలది, పద్మం ఆధారంగా ఉన్నది, పద్మం వంటి మోము కలది, పద్మం నుండి పుట్టినది అని సూక్తం వర్ణిస్తుంది. బురద నుండి పుట్టినది పద్మం కానీ ఆ చిక్లీతను (బురదను) అంటించుకోదు. 


🪷సంసారంలో ఆ పద్మంలాగా ఉండాలని సూచిస్తుంది. పద్మం సూర్యుని చూసి వికసిస్తుంది, అలాగే మనం కూడా పరమాత్మ వైపు మంచి విషయాలపై మాత్రమె నీకు అనురక్తి ఉండాలి అని మరొక సంకేతార్ధం.నీటి మీద ఉన్న ఆ పద్మం చాలా చంచలం.


🪷ఆ పువ్వు మీద ఆసీనురాలైన ఆవిడ కూడా ధర్మం ఉన్నన్నాళ్ళే వారి దగ్గర ఉంటుంది.విష్ణు నాభి కమలం నుండి ఉద్భవించాడు చతుర్ముఖ బ్రహ్మ, అటు పద్మం నుండి పుట్టి అక్కడనుండి సృష్టి ఆవిర్భావం.ఆ బ్రహ్మ తత్త్వాన్ని తెలిపే సంకేతంగా మరొక పద్మం.అమ్మవారి రెండు కర కమలాలలో భౌతిక, ఆధ్యాత్మిక ఉన్నతి అనుగ్రహాలు ఉన్నాయి. 


🪷వాటికి చిహ్నంగా అలా కనిపిస్తుంది. ఆవిడ రూపాన్ని ఋషులు, మహర్షులు ధ్యానతపస్సులో అష్ట లక్ష్ములు గా దర్శించి తరించారు. వాటినే మనకు అందించారు. 


🪷లక్ష్మీదేవి 16 రకాల సంపదను అనుగ్రహించే తల్లి 


🪷జ్ఞానం, తెలివి, బలం, శౌర్యం, వీరం, అందం, జయం, కీర్తి, ధృతి, నైతికత, ధనం, ధాన్యం, ఆనందం, ఆయుష్షు, ఆరోగ్యం మరియు సంతానం ఇస్తుంది.

💎💎💎💎💎💎💎💎💎💎

కామెంట్‌లు లేవు: