27, ఏప్రిల్ 2025, ఆదివారం

పంచాంగములు

 తిథి 

వారము

నక్షత్రము 

యోగము 

కరణము 

ఈ ఐదు కలిపి 

పంచాంగములు అనబడతాయి. 

పంచాంగములు అంటే ఐదు అంగములు 


ఎవరికి ఇవి అంగములు? 

అంటే...


పైన చెప్పుకొన్న 

తిథి 

వారము

నక్షత్రము 

యోగము 

కరణము 

ఈ ఐదూ కూడా కాలమును విభజన చెయ్యగా వచ్చినవే...


సూర్యుడు చంద్రుడు నిత్యమూ ఖగోళంలో సంచరిస్తూ ఉంటారు. ఆ క్రమంలో సూర్యునికి చంద్రునికి మధ్య దూరము కొన్నిరోజులు పెరగటము కొన్నిరోజులు తగ్గటము జరుగుతుంది. దీనివలననే మనకు చంద్రుడు పున్నమిరోజున నిండుగా కనబడి తరువాత నుండి కొద్ది కొద్దిగా తగ్గిపోతూ కనబడుతుంటాడు. 


ఈవిధంగా సూర్యునికి చంద్రునికి దూరాన్ని డిగ్రీలలో చెప్పుకుంటాము. సూర్యునికి చంద్రునికి దూరం 0° నుండి 12° వరకు పాడ్యమి తిథి. 13°నుండి 24° వరకు విదియ తిథి. ఇదేవిధంగా అమావాస్య వరకు మరియు అమావాస్య నుండి పౌర్ణమి వరకు ఊహించగలరు. 


మన భూమి చుట్టూ ఖగోళం మనకు గోళాకారంలో కనిపిస్తుంది. అంటే ఒక వృత్తం. వృత్తానికి 360° కదా! చంద్రుడు ఒక నక్షత్రమును ప్రవేశించి దానిని దాటటానికి 13°20" దూరం ఉంటుంది. ఈ దూరాన్ని చంద్రునికి సుమారుగా 22 నుండి 27 గంటల సమయం పడుతుంది. ఈ సమయాన్ని మనం ఈరోజు ఈ నక్షత్రం అంటూ వ్యవహరిస్తాము. అంటే ఇది కూడా కాలంతో ముడిపడి ఉన్నదే. 


24గంటలతో కూడిన రోజును వారముల పేర్లతో పిలుస్తున్నాము. 


యోగము అనేది సుమారుగా రోజుకు ఒక యోగము ఉంటుంది. 


కరణములు రోజుకు రెండు ఉంటాయి. 


యాతావాతా ఇవన్నీ కూడా కాలవిభజనలే. 


కాలము దైవస్వరూపము. 

ప్రతిరోజూ మనము ఈ పంచాంగములను స్మరించటం అంటే దైవాన్ని స్మరించినట్లే. దాని వలన మనకు శుభం జరుగుతుంది.

*~శ్రీశర్మద*

కామెంట్‌లు లేవు: