🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*జగద్గురు ఆదిశంకరాచార్యులు*
*విరచిత*
*”శివానందలహరి”*
*రోజూ ఒక శ్లోకం*
*తాత్పర్యం, ఆడియోతో*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*"జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*శివ పాదారవిందమును భజింపవలసిన ఆవశ్యకతను గూర్చి శంకరులు ఈ శ్లోకమున చెప్పారు.*
*శ్లోకము : 73*
*భూదారతా ముదవహద్య దపేక్షయా*
*శ్రీ భూదార ఏవ కిమతః సుమతే లభస్వ*
*కేదార మాకలిత ముక్తి మహౌషధీనాం*
*పాదారవింద భజనం పరమేశ్వరస్య!*
*తాత్పర్యము:-*
*ఓ సుబుద్ధీ ! ఏ పాదాన్ని చూడాలని, లక్ష్మీ భూ భర్తయైన విష్ణువే వరాహత్వమును ధరించాడో సాలోక్యము , సమీప్యము, సారూప్యము, సాయుజ్యము అనే ముక్తులనే గొప్ప ఓషధులు పండించడానికి భూమియైన పరమేశ్వరుని పద్మములవంటి ఆ పాదాన్ని భజించు . అంతకంటే ఏమి కావాలి ?*
*(పూర్వము శీవలింగము యొక్క అగ్రమును అడుగు భాగాన్ని చూడాలని, బ్రహ్మ హంసవాహనుడై ఆకాశానికి, విష్ణువు వరాహత్వాన్ని ధరించి పాతాళానికి వెళ్ళాడు. కానీ బ్రహ్మ, విష్ణువు శివలింగపు ఆది అంతాలను చూడలేక పోయారు.)*
*వివరణ:-*
*శంకరులు ఇలా చెప్పారు "ఈశ్వరా! నీవు పరమేశ్వరుడవు. నీ పాదపద్మాలు ఎక్కడ ఉన్నాయో తెలిసికోవాలని ఉవ్విళ్ళూరి శ్రీ మహావిష్ణువు వరాహరూపం ధరించాడట. కానీ ఆయనకవి కనబడలేదు. అట్టి నీ పాదపద్మముల మహిమను గూర్చి వర్ణించి చెప్పలేము.*
*కాబట్టి ఓ మనసా! ముక్తి అనబడే గొప్ప ఓషధులకు పంటపొలమయిన శ్రీ పరమేశ్వరుని పాదపద్మములను భజనం చెయ్యి. అంతటి శ్రీ మహావిష్ణువే ఈశ్వర పాదాలను దర్శించాలని కోరాడంటే ఆపాదములు తక్కినవారు కోరదగినవని వేరే చెప్పనక్కరలేదుకదా!*
*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*
*ఓం నమఃశివాయ।*
*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి