*మనలోని మహా శక్తి………….*.
(హనుమత్ విజయోత్సవం సందర్బంగా)
************************
*హనుమా!! సీతాన్వేషణ నీకు తప్పా మరెవారికీ సాధ్యం కాదయ్యా!!**ఆ తల్లిని వెదకి కనుక్కొని వచ్చే ధీరుడివి నువ్వొక్కడివే. ఈ సప్త సముద్రాలు దాటి నేను పొగలను కానీ మళ్ళీ రావడం నాకు కష్టం. నేను వృద్ధుడిని కదా. నీకు ఏదైనా సుసాధ్యం. వాయు పుత్రుడివి. రుద్రాంశ సంభూతుడువి. ఆ సీతా రాములను సదా నీ హృదయాంతరగమున ప్రతిష్టించుకున్న శ్రీరామ భక్తుడువి.
ఈ సప్త సముద్రాలే కాదు సకల భూనభోంతరాలను ఒక్క క్షణంలో చుట్టి వచ్చే వాడివి అని జాంబవంతుడు అనగానే అక్కడున్న అంగద వానర వీరులంతా ముక్త కంఠంతో *జై హనుమా జయ జయ హనుమా* అంటూ ఒక్క పెట్టున నినాదాలు చేయగా………
అంతవరకూ ఈ సముద్రాలు ఎలా దాటాలి లంకకు ఎలా వెళ్ళాలి రాముని ఆజ్ఞ ఎలా పాలించాలి *ఆ సీతమ్మ తల్లీ జాడ భారం నాపై పెట్టిన ఆ రామచంద్రునికి ఏమని సమాధానం చెప్పాలి* లక్ష్మణ మూర్తి ముందే కోపగ్రస్తుడు అని విచార వదనంతో విచారిస్తూ ఆ పర్వతంఫై ఓ మూలకు కూర్చున్న హనుమంతుడు
తన తోటి సహచరుల నినాదాలు, జాంబవంతుని మాటలు విని వారి ప్రోత్సాహం, వారి పొగడ్తలతో అత్యుత్సాహం పొంది ఒక్కసారే తన శరీరాన్ని పెంచి
విశ్వ రూపం తో భీకరమైన కంఠంతో *హూం**అంటూ
ఒక్క భయంకరమైన కేక పెట్టాడు.
ఆ అరపు విని పర్వతం అటూ ఇటూ ఉగసాగింది.పర్వతం ఫై ఉన్న వానరులంతా భయబ్రాంతులతో చెల్లా చెదురై కేకలు పెట్టసాగారు.
ఆ కొండపై ఉన్న పశు పక్ష్యాదులు అన్నీ బిక్కు బిక్కు మంటూ రోధించ సాగాయి. సముద్రాలు పెద్ద హోరుతో అల్లకల్లోలం కాసాగాయి. సాగర కె రటాలు ఉవ్వెత్తున ఎగిసి పడుతూ అంబరాన్ని తాకసాగాయి
ఆ భీభత్స వాతావరణాన్ని, ఆ ప్రళయాన్ని చూచి జాంబవంతుడు *హనుమా శాంతించు ఆంజనేయ శాంతించు**అని అనగానే హనుమంతుడు తన తప్పిదం తెలుసుకుని ఒక్క పెట్టున ఆ కొండను తన కాలితో తన్ని ఆకాశం పైకి లంఘించి వాయు వేగమున సీతమ్మ తల్లిని వెదకుటకు లంక దిశగా ఎగిరిపోసాగాడు ఆ ఆ వీర హనుమానుడు.
*కొందరికి తమలో దాగి ఉన్న శక్తిని మరొకరు గుర్తించి చెబితే గానీ తమకు తెలువదు.**ఆంజనేయ స్వామి విషయంలో అదే కదా జరిగింది.
జై వీర హనుమాన్ 🙏జయ జయ హనుమాన్ 🙏శ్రీ రామ జయ రామ 🙏జయ జయ రామా 🙏
*మిత్రాజీ**
(గుండవరం ప్రభాకర్ రావు, అత్వెల్లి మేడ్చల్ జిల్లా)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి