12, ఏప్రిల్ 2025, శనివారం

రామ నామ మహిమ*

 157c5.104e5.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀



          *రామ నామ మహిమ*

                 ➖➖➖✍️```

              -తులసీదాసు.


భక్త శిఖామణి, శ్రీమద్రామాయణ గ్రంధకర్త తులసీ దాసు మఠంలో ఒక మధ్యాహ్న వేళ భోజనాలు చేస్తున్న బంతిలో కలకలంరేగింది.


“ఏమిటి సంగతి?” అని తులసీ దాసు అక్కడివారిని అడిగారు.


భోజన బంతిలో ఒక పాపాత్ముడున్నాడు. అతని సరసన కూర్చొని భోజనాలు చేయడానికి కొందరు పెద్దలు తిరస్కరిస్తున్నారని కార్యకర్తలు చెప్పారు.


“పాపాత్ముడని” చెప్పబడుతున్న వ్యక్తిని తన దగ్గరకు పిలిచాడు తులసీదాసు…. “నాయనా!.. రామ్..రామ్..రామ్ అని ముమ్మార్లు జపించు”


“రామ్..రామ్..రామ్..!” అంతే. ఆ వ్యక్తి రామనామం జపించాడు.


“ఈ వ్యక్తి పాపాలు అన్నీ తొలగిపోయాయి. ఇప్పుడు అందరూ అతనితో కలసి సహపంక్తి భోజనం చేయవచ్చు.” అని అన్నాడు తులసీ దాసు.


కాని ఆ పెద్దలు ఒప్పుకోలేదు…”ఈ వ్యక్తి కి వడ్డించిన విస్తరిలోని భోజనాన్ని విశ్వనాధుని ఆలయంలో వున్న నందికి నివేదన చేస్తాము. నందిదేవుడు అంగీకరిస్తే అప్పుడు యీ వ్యక్తి పాపాత్ముడు కాదని ఒప్పుకుంటాము” అని అన్నారు.


అందరూ విశ్వనాధుని ఆలయంలోని నందీశ్వరుని ముందు నిలబడ్డారు.


తులసీదాసు… “నందీశ్వరా! శ్రీరామ నామం సకల పాపాలను తొలగిస్తుందనే మాట నిజమైతే నీవు ఈ నైవేద్యాన్ని స్వీకరించాలి" అని అన్నారు.


నంది కదిలింది. లేచివచ్చి విస్తరిలోని భోజనాన్ని తృప్తిగా భోజనం చేసి మళ్ళీ శిలగా మారిపోయింది.


ఈ అద్భుతం చూసి తులసీదాసు ను శంకించిన వారంతా శిలలుగా నిలబడి పోయారు.


ఈ కలికాలంలో భగవన్నామ స్మరణమే మానవుల దుఃఖాలు తీర్చే సన్మార్గం అని శ్రీ తులసీదాసు నిరూపించాడు.✍️

'శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే' ఈ శ్లోకాన్ని మూడుసార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణ ఫలితం, శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది.✍️```

           *ఓం శ్రీరామాయ నమః!!*

          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

*“భగవంతుని విషయాలు గ్రూప్“* లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి...9440652774. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏

కామెంట్‌లు లేవు: