26, మే 2025, సోమవారం

భరతవంశానికి చెందినదే...

 ‎ప్రపంచం అంతా ఒకనాడు భరతవంశానికి చెందినదే...


వేదాన్ని మన జాతి తన వారసత్వ సంపదగా పరిరక్షించుకుంటూ వస్తుంది. మరి వేదాన్ని ఆచరించని పాశ్చాత్యుల విషయం ఏమి? మనం ఈనాడు చూస్తున్న ఇన్ని మతాలు ఎక్కడివి?

 

రామాయణ,భారత కాలాల్లో మతాలు అంటూ ఏమిలేవు. మతం అంటూ చెప్పాలంటే వైధిక ధర్మం అని చెప్పాలి. కొందరు దాన్ని అచరించేవాల్లు, మరికొందరు పాటించనివారుండే వారు.


అయితే ఈ వేదాలని ఆచరించే వారిలో కూడా ఎన్నో శాఖలు ఉండేవి.


అయితే ఈ భూమిమీద ఉండే ప్రతి మానవుడూ భరత వంశంలోంచి వచ్చినవారే.

ఈ విషయం శ్రీమద్భాగవతం అయిదవ స్కదంలో ఉంది. 


ఈ భూమి సుమారు 200 కోట్ల సంవత్సరాల క్రితం అంతా ఒకే భూభాగం క్రింద ఉండేది ఒకనాడు.అందుకే సంధ్యా వందనాదుల్లో "చతుస్సాగర పర్యంతం"అని కనిపిస్తుంది మనకు.


సుమారు 100 కోట్ల సంవత్సరాల క్రితం నుండి విడిపోవడం ప్రారంభించినది . 


సుమారు 50 లక్షల సంవత్సరాల కాలంగా మనం ఇప్పుడు చూస్తుండే ఖండంగా ఏర్పడ్డది.


 మన పురాణాలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి.

అందుకే మన పంచాంగల్లో సృష్టి ఆది 198 కోట్ల 58 లక్షల సంవత్సరాలు అని ఉంది. 


అమేరికాలోని చికాగోలోని న్యాచురల్ సైన్స్ మ్యుజియంలో ఈ భూమి ఆకృతి 200 కోట్ల సంవత్సరాల క్రింద ఇలా ఉంది, 100 కోట్ల సంవత్సరాల క్రితం ఇలా అంటూ చూపిస్తూ 50 లక్షల సంవత్సరాల క్రితంగా మనం ఇప్పుడు చూస్తున్న ప్రపంచ ఆకృతిని చూపించారు. వాటికి వారి వద్ద ఏ ఆధారాలు లేవు. 


మనం కచ్చితంగా 198 కోట్ల సంవత్సరాలు అని చెప్పగల్గుతున్నాం.

మన వద్ద గ్రహించిన విషయాన్నే వాళ్ళు తిరిగి ప్రపంచానికి తెలియజేస్తున్నారు.

మేం చెబుతున్నాం అన్నట్టుగా వాళ్ళు ఇంతవరకే చెబుతున్నారు.


మన వద్ద ఇంతకు మించి ఆధారాలు కనిపిస్తున్నాయి . 


ఈ భూమిని ఖండాలుగా విభజించిన భరత వంశానికి చెందిన"#నాభి"అనే చక్రవర్తి ఉన్నాడు.

భరత వంశానికి చెందిన వాడు . తన సంతానానికోసం ఇలా విభజించి మొత్తం తన వంశాలవారినే అన్ని ఖండాల్లో విస్తరించాడు.

 

మనం ఇప్పుడు చూస్తున్న ఆస్ట్రేలియా ఖండం ఒకనాడు భారతదేశపు ఆగ్నేయ భాగంలో ఉండేదని ఇప్పటి శాస్త్రవెత్తలూ అంగీకరిస్తారు.

ఆస్ట్రేలియా లో ఉత్తరభాగంలో ఉన్న అడవులూ,పక్షులూ మన తమిళనాడు అడవులను, పక్షులను పోలి ఉంటాయి .


ఈ భూమి అలా క్రమేపీ జరుగుతూ ఉండటంచే అక్కడి పక్షులూ తమిళనాటికి వలస వస్తూ ఉంటాయి ఈ కాలం వరకు. 


అక్కడ ఉన్న ఒకప్పటి వాళ్ళు మన దేశ తమిళనాడు వారిలాగే ఉంటారు.వారి భాష కూడా అట్లానే ఉంటుంది.అక్కడ ఉండే బంగారు నిధుల కోసం బ్రిటీష్ వారు అక్కడ కాలు పెట్టి వారిని నామ రూపాలు లేకుండా చేసారు . 


ఇప్పుడు మనం అనుకుంటున్న అమేరికా కూడా అంతే.అక్కడి వారిని అనిచివేసి మేం అమెరికా అని ఈనాడు చెప్పుకుంటున్నారు. 


అమేరికాలోని మనం ఈ నాడు కాలిఫోర్నియా కూడా మనం మన పురాణాల్లో చూడవచ్చు . మనకు సగర చక్రవర్తి కుమారులు కపిల మహర్షిని వల్ల కాలి బూడిదైపోతే భగీరథుడు గంగను రప్పించాడు అని మనకు తెలుస్తుంది.

అయితే ఆ కపిల మహర్షి ఉన్న అరణ్యమే మనం ఇప్పుడు చూస్తున్న కాలిఫోర్నియా .


అదెలా అంటే,

సంసృతంలో కొన్ని పదాలు వాటి స్వభావన్ని బట్టి అక్షరాలు మారుతాయి.హింస చేయునది సింహం అంటారు . 


ఇక్కడ 'స' 'హ' అక్షరాలు మారాయి.అలాగే కపిలారణ్య లో 'ప''ల' అక్షరాలు తిరగరాస్తే క-లి-ప అరణ్య,

అలా కాలిఫోర్నియా అయ్యింది .

 

ఆ నాడు భరత వంశానికి చెందిన వాళ్ళు ఈ భూమిని విభజించాక బర్డ్ ఐ వ్యూ ఎట్లా ఉందో మన పురాణాల్లో ఉంది . అదెలా అంటే ఒక కుందేలు తన కాల్లపై లేచి ఎదురుగా ఉండే గడ్డి పొదకై చూస్తున్నట్లుగా ఉందని మన పురాణాల్లో ఉంది.


మన పురాణాల లోనికి వారు వెల్లలేదు కనక ఈ విషయం పాశ్చాత్యులకి దొరకలేదు. లేకుంటే ఈ విశయాన్ని కూడా వాల్లే చెప్పే వాళ్ళు.

ఈ చిత్రం మనం ప్రపంచ పటాన్ని తిప్పి చూస్తే కనిపిస్తుంది.


మొత్తం ఆసియా,యూరోప్ ఖండాలు గడ్డిగా,అమేరికా కుందేలుగా కనిపిస్తుంది.దక్షిణ అమేరికా కుందేటి తల,

ఇక ఉత్తర అమేరికా ఆ కుందేటి పొట్ట భాగం.అందుకే కాబోలు ప్రపంచాన్నంతా దోచుకుతిన్నారు!

అమేరికాలో ఉన్న విలువైన బంగారం అంతా ఒకనాడు ఇక్కడి నుండి దోచుకున్నదే. 


ఈ విషయం పక్కన పెడుదాం. ప్రపంచ పటాన్ని మేం తయారు చేసాం అని చెబుతున్న వాల్లకు ఇన్ని విషయాలు తెలియవు.

 

ఈ పాశ్చాత్యులు అలా చీలిన భూభాగాల్లో నివసించే వారిలో వేదాలని ఆచరించక బ్రతికేవాల్లలోకి చెంది ఉంటారు. భూమిని విభాగలుగా చీల్చిన వృషభుడి కుమారుడు భరతుడు. ఈయననే జడబరతుడు అది కూడా అంటారు.

ఆయన తన నియంత్రణ కేవలం తన భూభాగానికే పరిమితం కాక పాలించేవాడు. 


అందరూ ఆయన పేరు చెప్పుకొనేవారట,అందుకే భరతీయ అనే పేరు ఈ భూమి అంతటా ఉండేది.ఈ భరతుడు స్వాయంభువ మన్వంతరానికి చెందినవాడు.


అయితే ఈ నాడు మనం శకుంతల కుమారుడు భరతుడు,అతని ద్వారా భారతదేశం అని చెప్పుకుంటున్నాం.

ఈ భరతుడు వైవత్సువ మన్వంతరానికి చెందినవాడు.

 

దురదృష్టకరం ఈనాడు మనం వాటి విలువను తెలియక మన పురాణలపై,ఇతిహాసాలపై ఏమాత్రం గౌరవంలేనివాల్లలా తయారయ్యాం.

ఇవి వాస్తవం అని గుర్తించాలి........

కామెంట్‌లు లేవు: