*చీర- పార- నేర- తీర* (దత్తపది) భారతార్థంలో
నా పూరణ.
*విదురుడు ధృతరాష్ట్రునితో*
చీరవేలకొ పాండవేయుల శీఘ్రమున్ మన సన్నిధిన్
పారవేసిన వారు కారుగ బంధముల్ తెగగోతువా?
నేరరెన్న డగౌరవంబును నీకు నుందురె బద్ధులై
తీరదా యికనైన నీకును దిద్దుబాటుకు పూనవే.
అల్వాల లక్ష్మణ మూర్తి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి