26, మే 2025, సోమవారం

భారతీ మాతా!

 ఉ.ఆరయ,సంహితార్థ విశదైక సుధీయుత సుష్టు శబ్ధ కా

సారము, బోధనామృత రసా‌లము, పాఠక ఛాత్ర సంశయో

త్తారము, కావ్య వాఙ్మయ సుధా రసమున్ భువియందు వర్ధిలన్

ప్రేరణ నిచ్చు చుండుము కవిత్వ మహానిధి గూర్చి, భారతీ!౹౹ 56


ఓ  ఉ.ఆరయ,సంహితార్థ విశదైక సుధీయుత సుష్టు శబ్ధ కా

సారము, బోధనామృత రసా‌లము, పాఠక ఛాత్ర సంశయో

త్తారము, కావ్య వాఙ్మయ సుధా రసమున్ భువియందు వర్ధిలన్

ప్రేరణ నిచ్చు చుండుము కవిత్వ మహానిధి గూర్చి, భారతీ!౹౹ 56


ఓ భారతీ మాతా! వివిధములైన ధర్మార్థ శాస్త్ర వివరణలకు సంబంధించిన అనేక ప్రామాణికమైన శబ్ద సముదాయానికి  సరస్సు వంటిదీ, అనేక అంశాలు అనే అమృతం వంటి బోధనలకు తీయని పండ్ల నిచ్చే రాచమామిడి వంటిదీ,పాఠకులూ విద్యార్థుల యొక్క సందేహాలను నివృత్తి చేయగలిగిన అమృతము వంటి కావ్య  వాఙ్మయం అనే నిధిని ఈ విశ్వములో వృధ్ధి చెందేటట్లుగా తగిన పరిస్థితులను కల్పించుతూ, ప్రోత్సాహాన్ని ఇవ్వవలసినదిగా ఓ మాతా! నిన్ను ప్రార్థించుతున్నానుమాతా! వివిధములైన ధర్మార్థ శాస్త్ర వివరణలకు సంబంధించిన అనేక ప్రామాణికమైన శబ్ద సముదాయానికి సరస్సు వంటిదీ, అనేక అంశాలు అనే అమృతం వంటి బోధనలకు తీయని పండ్ల నిచ్చే రాచమామిడి వంటిదీ,పాఠకులూ విద్యార్థుల యొక్క సందేహాలను నివృత్తి చేయగలిగిన అమృతము వంటి కావ్య వాఙ్మయం అనే నిధిని ఈ విశ్వములో వృధ్ధి చెందేటట్లుగా తగిన పరిస్థితులను కల్పించుతూ, ప్రోత్సాహాన్ని ఇవ్వవలసినదిగా ఓ మాతా! నిన్ను ప్రార్థించుతున్నాను

కామెంట్‌లు లేవు: