*2023*
*కం*
ఒకచెడు చేయగ నిన్నట
సకలంబుల దుష్టునిగనె జనులెంచునయా.
మకిలంబొకచుక్కైనను
నికరంబగువెల్లివిలువ నీగదె సుజనా
*భావం*:-- ఓ సుజనా!ఒక్క చెడ్డ పని చేసిననూ నిన్ను అన్ని విధాలుగా నూ చెడ్డ వాని గానే జనులు భావించెదరు. ఒకచిన్న చుక్క మకిలి పట్టిననూ మొత్తం తెల్లదనం(కాగితం, గోడ...) చెడుగానే అనిపిస్తుంది కదా!
*సందేశం*:-- వంద మంచి పనులను గుర్తించని జనాలు ఒక్క తప్పు ను మాత్రం ఎత్తి చూపుతారు. అందువలన తప్పు చేయకుండా ఉండటానికి ప్రయత్నాలు చేయవలెను.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి