27, జులై 2025, ఆదివారం

 *👉®️వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతున్న అమ్మాయిలు / అబ్బాయిలు మరియు వారి తల్లితండ్రులు ఈ క్రింది (సూచనలను ) వాస్తవాలను తప్పక గ్రహించాలి.....*


*🔹®️వధువు / వరుడు గ్రహించాల్సిన అంశాలు....🔹*

************************


®️వివాహం అంటేనే సర్దుకు పోవడం...


®️ వివాహం అంటే స్వర్గం అని భావించకండి... 


®️ వివాహం బాధ్యతలతో కూడిన జీవితం... 


®️ఆకతాయిగా తిరిగే అవకాశం అమ్మాయిలకు / అబ్బాయిలకు వివాహం తరువాత కుదరదు అనే వాస్తవాన్ని గ్రహించండి...


®️వివాహం తరువాత నాది, నీది అనే స్వార్థం వీడాలి... 




®️వివాహం తరువాత ఫ్రెండ్స్ ని/ సహ ఉద్యోగులను బయటి వరకే వుంచడం మంచిది... 


®️మీరు కోరుకున్న అన్ని అంశాలు మీ జీవిత భాగస్వామిలో వుండటానికి అంగట్లో వస్తువు కాదని గ్రహించాలి... 


®️మీరు పరస్పరం ఇరువురి తల్లి తండ్రులకు, బందువులకు గౌరవం ఇవ్వటం నేర్చుకోవాలి...


®️సంతానం ను పొందటం బాధ్యత...


®️విడాకులు అనే ఆప్షన్ మీ బ్రెయిన్ లో వుంటే వివాహం చేసుకోకపోవడమే మంచిది...


®️వివాహం తరువాత మీ భాగస్వామి మీ బానిస కాదు అని గ్రహించండి. ఒకరికి ఒకరు తోడు అని గ్రహించండి... 


®️జీవిత భాగస్వామిని మించిన నేస్తం ఎవరు లేరని గ్రహించండి...


®️ముఖ్యం గా అమ్మాయిలు మీ అత్త గారి కుటుంబ విషయాలను మీ తల్లి తండ్రులకు చెప్పకండి... 


®️భార్య భర్తలు తగువు ఆడటం సహజం. మళ్ళీ కలవటం మామూలే.. మీరు పడే గొడవలను మీ తల్లి తండ్రుల దృష్టికి తీసుకువెళ్ళవద్దు... 


*🔹®️వధువు బాధ్యతలు :🔹*

*****************

®️వంట పని, ఇంటి పనులు, అబ్బాయి తల్లి తండ్రుల భాగోగులు, కుటుంబం లో ఇంకా మీ కంటే చిన్న వారు వుంటే వారి బాధ్యత కూడా మీదే. అత్త వారి కుటుంబమే మీ కుటుంబం అని మరువకండి...


®️ ప్రతి విషయం ను మీ పుట్టినింటితో పోల్చుకోవద్దు...


*🔹®️వరుడు బాధ్యతలు...🔹*

*****************


®️ వధువు తన తల్లి తండ్రులను వదిలి మిమ్మల్ని , మీ తల్లి తండ్రులను నమ్మి వచ్చిందనే విషయం మరువకండి....


®️కుటుంబానికి కావాల్సిన ఆర్థిక వనరులు మీ బాధ్యత... 


®️ పెళ్లి అయిన కొత్తలో నా పెళ్ళాం మంచిది అని తొందరపడి కుటుంబం లో వున్న అన్ని విషయాలు విడమరిచి చెప్పకండి... 


®️మీ తల్లి తండ్రులు వలె మీ భార్య తల్లి తండ్రులను కూడా గౌరవించటం నేర్చుకోండి. 


*🔹®️అమ్మాయి తల్లి తండ్రులు...🔹*

**********************


®️అమ్మాయికి నేరుగా ఫోన్ చేసి సుత్తి వేయకండి. వియ్యంకులను గౌరవించటం నేర్చుకోండి...


®️కొత్తగా వెళ్లిన కుటుంబం లో కొన్ని ఇబ్బంది గా మొదట్లో అనిపిస్తాయని, సర్డుకోవడానికి సమయం పడుతుంది అని గ్రహించండి... 


®️భార్య భర్తల గొడవలో అమ్మాయి తల్లి తండ్రులు తల దుర్చారాదు. మీ అమ్మాయికి తల్లి తండ్రులు ఇకపై అత్త మామ అనే విషయాన్ని అమ్మాయికి చెప్పండి...


®️మీకు కూడా ఒక కోడలు వస్తుందని గ్రహించండి... 


®️అమ్మాయి చెప్పేవన్నీ నమ్మి ఆవేశపడకండి...


*🔹®️అబ్బాయి తల్లి తండ్రులు...🔹*

**********************


®️మీ కోడలికి మీ అమ్మాయి కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని మరువకండి...


®️మీ వంశం ని నిలబెట్టే సంతానం ను మీ కోడలి గర్భం ద్వారా జరుగుతుంది. అలాంటి మీ ఇంటి కోడలిని అపురూపం గా చూసుకోవాలి అని మరువకండి...


®️మీ కోడలు బాగోగులు కుటుంబ పెద్దగా పూర్తిగా మామ గారివే. మీ కూతురు ,కొడుకు మీ ముందు కన్నీరు పెట్టిన పర్వాలేదు. కానీ కోడలు ఎప్పుడు కన్నీరు పెట్టకుండా చూసే బాధ్యత మీదే...


®️మీ కోడలిని మీరు ఎలా చూసుకుంటారో , మీ కూతురుని వాళ్ళ అత్త గారు లాగే చూసుకుంటారని అబ్బాయి తల్లి గ్రహించాలి. మీ కూతురు కంటే మీకు మీ కోడలే ముఖ్యం అని అర్థం చేసుకోండి. ఇదే పద్ధతి లో మీ కూతురు కి వర్తిస్తుంది అని గ్రహించండి... 


®️ఎవరో మహానుభావుడు ఎన్నో జీవితాలు చూసి ఈ వాస్తవాలను మన ముందు ఉంచారు... పాటిస్తే అందరూ హాయిగా ఉంటారు...®️👆👍 Beautiful message seen in a Hindu WhatsApp group, Please go through completely.


Every one should follow 👆

కామెంట్‌లు లేవు: