27, జులై 2025, ఆదివారం

నడిచే దేవుడు

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀181

ప్రతిరోజూ…

శ్రీ కంచి పరమాచార్య వైభవమ్…

1311z;204e2. నడిచే దేవుడు…

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌼P0181.పరమాచార్య పావన గాధలు…



                  *తీర్థం - పెళ్ళాం*

                    ➖➖➖✍️

```

తంజావూరు జిల్లా పేరాలం జంక్షనుకు మూడు మైళ్ళ దూరంలో ‘విల్లుకుడి’ అనే గ్రామం ఉంది. 1949లో పరమాచార్య స్వామి వారు ఆ ఊళ్ళో నాలుగు రోజులు మకాం చేసారు. ఆ ఊళ్ళో ఉన్న మా అక్కగారు పాదపూజ చెయ్యడానికి ఆమె స్వామిపాదులను తన ఇంటికి ఆహ్వానించి, ఆ రోజుకు నన్ను కూడా అక్కడికి రమ్మని కబురు చేసింది.


స్వామి దర్శనం కోసం ఆ ఊరి వాళ్ళూ, చుట్టుపక్కల గ్రామస్థులూ, వందలాది ప్రజలూ వచ్చారు, పూజ ముగిసింది. స్వామి వారు భక్తులందరికీ తీర్థం ఇస్తున్నారు. తీర్థం పుచ్చుకుంటున్న వారిలో బొంబై నుండి వచ్చిన భార్యా భర్తలు ఇద్దరున్నారు. ఆ రాత్రే వారు తిరిగి బొంబై పోవడానికి ఏర్పాటు చేసుకున్నారు. వారితో బాటు, వారి కుమారుడు కూడా ఉన్నాడు... సుమారు 25 ఏండ్ల యువకుడు.*”


దంపతులిద్దరూ తీర్థం తీసుకున్నారు. కుమారుడు తీర్థం కోసం చెయ్యి చాపాడు.


“నీవూ, నీ భార్యా ఇద్దరూ వచ్చి తీర్థం పుచ్చుకోండి” అన్నారు స్వామి.


*”ఆ మాట విని తెల్లబోయాడు యువకుడు. దేనికో తటపటాయిస్తున్నాడు. ఇంతలో పక్కగా నిలచిన ఆడవాళ్ళ వైపు నుండి ఇంచుమించు ఇరవై సంవత్సరాల యువతి గబగబా ముందుకు వచ్చి ఆ యువకుడితో పాటు తానూ చేయిజాపింది. ఇద్దరూ కలిసి తీర్థం పుచ్చుకున్నారు.


తీర్థం తీసుకుని ఆ అమ్మాయి ఆ యువకుడి వెంట ఉండకుండా, దూరంగా వెళ్ళి నిలబడ్డది. స్వామి ఆ నలుగురిని ఆశీర్వదించి బొంబై వెళ్ళండని అనుజ్ఞ ఇచ్చారు.


ఆ తతంగమంతా చూస్తున్న మాకు ఆశ్చర్యం వేసింది. బొంబై నుండి వచ్చిన తలిదండ్రులిద్దరికి స్వామి తీర్థం ఇవ్వడమేమిటి, కుమారుడు రాగానే ‘భార్యాభర్తలు ఇద్దరూ వచ్చి తీర్థం పుచ్చుకోండి’ అని ఆదేశించడము ఏమిటి, ఆ యువకుడి భార్య ఎక్కడ నుంచో ఊడిపడ్డట్టు వచ్చి తీర్థం పుచ్చుకుని, తిరిగి దూరంగా వెళ్ళి నిలబడడమేమిటి, నలుగురూ కలిసి బొంబై వెళ్ళండని వారిని స్వామి ఆజ్ఞాపించడమేమిటి? ఇదంతా ఏదో వింతగా తోచింది అందరికీ!!!


బొంబై నుండి వచ్చిన ఆ పెద్దమనిషిని సమీపించి, ఆయనను అడిగాను ‘ఏమిటి ఈ వ్యవాహరమంతా?’ అని.


ఆయన ముందు కాస్త వెనకాడాడు తమ ఉదంతం చెప్పడానికి. తరువాత బయటపెట్టాడు కథ. కట్నం విషయంలో ఏదో కొంత పేచీ వచ్చిందనీ, ఆ కారణంగా మూడు సంవత్సరాల నుండీ తన కొడుకూ కోడలూ కలిసి కాపురం చెయ్యడం లేదనీ, తమ కోడలు ఇక్కడికి వచ్చే సంగతి తమకు ముందుగా తెలియదనీ, తాము స్వామి దర్శనం నిమిత్తం మాయూరం నుండి కారులో వచ్చామనీ, స్వామి ఆజ్ఞ అనుసరించి, ఇప్పుడిక కోడలను కూడా వెంటబెట్టుకుని బొంబైకి వెళ్ళదలచామని కథంతా వెళ్ళగక్కాడు.


అంతటితో నేను తృప్తి చెంది ఊరుకోలేదు. ఆ అమ్మాయిని అడిగాను. “ఏమిటమ్మా నీ పరిస్థితి?” అని. 


భరించలేని ఆవేదనతో ఆ అమ్మాయి మాట్లాడలేకపోయింది. అంతట పక్కనే ఉన్న ఆ పిల్ల తల్లి ఇలా చెప్పింది.


“కట్నం విషయంలో వచ్చిన మనస్పర్థల వల్ల మూడేళ్ళుగా నా కూతురు నా దగ్గరే ఉంటున్నాది. స్వామితో మా అవస్థ చెప్పుకుంటే, స్వామి ఏదైనా దారి చూపిస్తారనే ఆశతో మేము ఇక్కడికి వచ్చాము. అంతేగాని, మా వియ్యంకుడూ, వియ్యపురాలూ, అల్లుడూ వీరంతా ఇక్కడికి వచ్చే సంగతి మాకు ముందుగా తెలియదు. ఈ మూడేళ్ళ నుంచీ మాకూ వారికీ ఉత్తర ప్రత్యుత్తరాలేమి లేవు. ఇదంతా మాకూ వింతగానే ఉంది. అంతా స్వామి దయ”


కోడలును కూడా వెంటబెట్టుకుని నలుగురూ బొంబైకి వెళ్ళండని స్వామి ఆదేశించారు కాబట్టి, వెంటనే బయలుదేరి తమతో రమ్మని పిల్లవాని తండ్రి కోడలుతో చెప్పాడు.


“మేము ఇక్కడికి వచ్చేటప్పుడు బొంబై ప్రయాణం సంగతి మాకు తెలియకపోవడం చేత అమ్మాయి తన బట్టలు తెచ్చుకోలేదు” అన్నది పిల్ల తల్లి.


“లేకపోతే పరవాలేదు. అమ్మాయికి కావలసిన బట్టలన్నీ బొంబైలో కొంటాము” అంటూ కోడలును వెంటబెట్టుకుని బయలుదేరారు బొంబై ఆసాములు. 


ఆ అమ్మాయి తల్లికి కలిగిన ఆనందం అడుగుతారూ!!!


బొంబై కుర్రవాడు తీర్థం పుచ్చుకోవడానికి చేయిజాపినప్పుడు ‘భార్యాభర్తలిద్దరూ కలిసి తీర్థం పుచ్చుకోండి’ అని స్వామి సూచించడానికి, ఆ యువకుని భార్య అక్కడే ఉన్నట్టు స్వామికి ఎట్లా తెలుసు?✍️```


*ఈ ప్రశ్నకు సమాధానం ఎవ్వరూ చెప్పలేరు.*

--- శ్రీ టి.కె త్యాగరాజన్, ‘ఇండియన్ ఎక్స్ ప్రెస్’ మాజీ జనరల్ మేనేజర్.

```

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం।

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం॥


#KanchiParamacharyaVaibhavam #

 “కంచిపరమాచార్యవైభవం”!🙏

. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

         🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.

         ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

“భగవంతుని విషయాలు గ్రూప్” లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి... 9440652774. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏```

కామెంట్‌లు లేవు: