*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🌞 *ఆదివారం*🌞
*🌹30నవంబర్2025🌹*
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ విశ్వావసు*
*నామ సంవత్సరం*
*దక్షిణాయనం - హేమంత ఋతౌః*
*మార్గశిర మాసం - శుక్ల పక్షం*
*తిథి : దశమి* రా 09.29 వరకు ఉపరి *ఏకాదశి*
*వారం : ఆదివారం* (భానువాసరే)
*నక్షత్రం : ఉత్తరాభాద్ర* రా 01.11 వరకు ఉపరి *రేవతి*
*యోగం : వజ్ర* ఉ 07.12 *సిద్ధి* రా.తె 04.22 ఉపరి *వ్యతీపాత*
*కరణం : తైతుల* ఉ 10.27 *గరజి* రా 09.29 ఉపరి *వణజి*
*సాధారణ శుభ సమయాలు:*
*ఉ 09.00 - 10.00 మ 02.00 - 04.00*
అమృత కాలం : *రా 08.37 - 10.08*
అభిజిత్ కాలం : *ప 11.34 - 12.19*
*వర్జ్యం : ప 11.30 - 01.01*
*దుర్ముహూర్తం : సా 04.03 - 04.48*
*రాహు కాలం : సా 04.09 - 05.33*
గుళికకాళం : *మ 02.44 - 04.08*
యమగండం : *ప 11.56 - 01.20*
సూర్యరాశి : *వృశ్చికం*
చంద్రరాశి : *మీనం*
సూర్యోదయం :*ఉ 06.30*
సూర్యాస్తమయం :*సా 05.40*
*ప్రయాణశూల : పడమర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం :*ఉ 06.19 - 08.34*
సంగవ కాలం : *08.34 - 10.49*
మధ్యాహ్న కాలం : *10.49 - 01.03*
అపరాహ్న కాలం : *మ 01.03 - 03.18*
*ఆబ్ధికం తిధి : మార్గశిర శుద్ధ దశమి*
సాయంకాలం : *సా 03.18 - 05.33*
ప్రదోష కాలం : *సా 05.33 - 08.06*
రాత్రి కాలం :*రా 08.06 - 11.31*
నిశీధి కాలం :*రా 11.31 - 12.22*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.38 - 05.29*
*****************************
🌷 *ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*🌞శ్రీ సూర్య పంజర స్తోత్రం🌞*
*అరుణాయ నమః*
*సూర్యాయ నమః*
*ఇంద్రాయ నమః*
*రవయే నమః*
🙏 *ఓం నమో సూర్యాదేవాయ నమః*
🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🌞🌞🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసిం*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🌞 *ఆదివారం*🌞
*🌹30నవంబర్2025🌹*
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ విశ్వావసు*
*నామ సంవత్సరం*
*దక్షిణాయనం - హేమంత ఋతౌః*
*మార్గశిర మాసం - శుక్ల పక్షం*
*తిథి : దశమి* రా 09.29 వరకు ఉపరి *ఏకాదశి*
*వారం : ఆదివారం* (భానువాసరే)
*నక్షత్రం : ఉత్తరాభాద్ర* రా 01.11 వరకు ఉపరి *రేవతి*
*యోగం : వజ్ర* ఉ 07.12 *సిద్ధి* రా.తె 04.22 ఉపరి *వ్యతీపాత*
*కరణం : తైతుల* ఉ 10.27 *గరజి* రా 09.29 ఉపరి *వణజి*
*సాధారణ శుభ సమయాలు:*
*ఉ 09.00 - 10.00 మ 02.00 - 04.00*
అమృత కాలం : *రా 08.37 - 10.08*
అభిజిత్ కాలం : *ప 11.34 - 12.19*
*వర్జ్యం : ప 11.30 - 01.01*
*దుర్ముహూర్తం : సా 04.03 - 04.48*
*రాహు కాలం : సా 04.09 - 05.33*
గుళికకాళం : *మ 02.44 - 04.08*
యమగండం : *ప 11.56 - 01.20*
సూర్యరాశి : *వృశ్చికం*
చంద్రరాశి : *మీనం*
సూర్యోదయం :*ఉ 06.30*
సూర్యాస్తమయం :*సా 05.40*
*ప్రయాణశూల : పడమర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం :*ఉ 06.19 - 08.34*
సంగవ కాలం : *08.34 - 10.49*
మధ్యాహ్న కాలం : *10.49 - 01.03*
అపరాహ్న కాలం : *మ 01.03 - 03.18*
*ఆబ్ధికం తిధి : మార్గశిర శుద్ధ దశమి*
సాయంకాలం : *సా 03.18 - 05.33*
ప్రదోష కాలం : *సా 05.33 - 08.06*
రాత్రి కాలం :*రా 08.06 - 11.31*
నిశీధి కాలం :*రా 11.31 - 12.22*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.38 - 05.29*
*****************************
🌷 *ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*🌞శ్రీ సూర్య పంజర స్తోత్రం🌞*
*అరుణాయ నమః*
*సూర్యాయ నమః*
*ఇంద్రాయ నమః*
*రవయే నమః*
🙏 *ఓం నమో సూర్యాదేవాయ నమః*
🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🌞🌞🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసిం🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯
*🌞ఆదివారం 30 నవంబర్ 2025🌞*
`` *ప్రతిరోజూ*
*సంపూర్ణ మహాభారతము*
సరళ వ్యావహారిక భాషలో!
6️⃣0️⃣``
*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``
*సంపూర్ణ మహాభారతము*
*60 వ రోజు*
*మాయా జూదానికి నాంది*```
దుర్యోధనుడు శకునితో
ధృతరాష్ట్రుని వద్దకు వెళ్ళాడు. కుమారుడు కృశించి పోతున్నాడని విని ధృతరాష్ట్రుడు చింతించాడు. “నాయనా సుయోధనా! కౌరవ సంపదనంతా నీకు ఇచ్చాను కదా. దేవేంద్రునితో సమానమైన భోగభాగ్యాలు నీకు ఉన్నాయి కదా. నీవిలా కృశించడం ఎందుకు?" అని అడిగాడు.
“తండ్రీ! పాండవుల ఐశ్వర్యం దేవేంద్రుని కంటే గొప్పది. వారి కీర్తి నలుదిశలా వ్యాపించింది. వారితో పోల్చడానికి మూడు లోకాలలోని రాజులు సరిపోరు. హరిశ్చంద్రుడు చేసిన రాజసూయయాగం కంటే పాండవులు చేసిన రాజసూయ యాగం గొప్పది. సామంతుల వలన అశేషరత్నాభరణాలు కప్పంగా పొందారు.
ధర్మరాజుకు సాత్యకి
ముత్యాల ఛత్రం పట్టాడు. భీముడు చామరం వీచాడు. రాజులందరి చేత శ్రీకృష్ణుడు ధర్మరాజుకు మొక్కించాడు. సాటి రాజ కుమారుడుగా నేనిది సహించలేను” అన్నాడు.
శకుని దుర్యోధనునితో “ధర్మరాజు జూద ప్రియుడు. అందులో కపటం తెలియని వాడు. నేను అక్షవిద్యలో నేర్పరిని. జూదంలో
ధర్మరాజుని అక్రమంగా ఓడించి అతని సంపద అంతా సుయోధనుని హస్తగతం చేస్తాను” అన్నాడు.
సుయోధనుడు సంతోషించి “తండ్రీ! ఇందుకు మీరు అంగీకరించండి” అన్నాడు.
ధృతరాష్ట్రుడు “విదురుడు చాలా దూర దృష్టి కలవాడు. నీతి కోవిదుడు. మీ ఇరువురి క్షేమం కోరేవాడు. అతనితో చర్చించి నిర్ణయం తీసుకుంటాము” అని అన్నాడు.
దుర్యోధనుడు “తండ్రీ విదురుడు పాండవ పక్షపాతి. అతడు ఇందుకు అంగీకరించడు. మీరు అంగీకరించనిచో నేను అగ్ని ప్రవేశం చేస్తాను. మీరు, విదురుడు సంతోషంగా ఉండండి” అన్నాడు.
జూదం తగదని సంశయిస్తూనే ధృతరాష్ట్రుడు కుమారుని సంతోషపెట్టడానికి సభానిర్మాణానికి ఏర్పాట్లు చెయ్యమని చెప్పాడు. ఒక నాడు విదురునితో సుయోధనుని అభిప్రాయం చెప్పాడు. విదురుడు
“ఇందుకు నేను అంగీకరించను. పాండవులకు,కౌరవులకు విరోధం కలగడానికి పునాది వెయ్యద్దు. ఎంతటి శాంత స్వభావులకైనా జూదం విరోధం కలిగిస్తుంది. పాండవులు కౌరవులు కలసి ఉండేలా ఏర్పాటు చెయ్యి” అన్నాడు.
ధృతరాష్ట్రుడు “విదురా! నీవు అనవసరంగా అనుమానపడవద్దు. మీరు, భీష్ముడు ఉండగా అన్నదమ్ముల మధ్య విరోధం ఎందుకు వస్తుంది. కనుక నీవు ఈ జూదానికి అంగీకరించి ఇంద్రప్రస్థానికి వెళ్ళి పాండవులను జూదానికి తీసుకురా!” అన్నాడు.
ధృతరాష్ట్రుడు “దుర్యోధనా! ఈ జూదం వలన మీకు విరోధం వస్తుంది మీ విరోధం భూమి మీద ప్రజలందరికి కీడు చేస్తుంది. విదురునికి ఇందులో అంగీకారం లేదు. నీకు సంపద కావాలంటే నీవు కూడా యాగం చెయ్యి.
మీరిద్దరూ రాజ్యాన్ని పాలించండి.” అన్నాడు.
దుర్యోధనుడు "మహారాజా! ధర్మరాజు జూదం ఆడుతుండగా చూడటం ఒక యజ్ఞం. నేను సకలైశ్వర్యములు పొందడానికి అది మార్గం. శత్రువుల అభివృద్ధిని ఉపేక్షించిన మనలను అది నాశనం చేస్తుంది. పాండవుల ఐశ్వైర్యాన్ని కొల్లగొడితే కాని నాకు ఉపశమనం లేదు" అన్నాడు.
వెంటనే శకుని “సుయోధనా! ఎలాంటి సైన్యం లేకుండా యుద్ధం రక్త పాతం లేకుండా పాచికలాడించి పాండవ రాజ్యలక్ష్మిని నీకు ఇస్తాను. జూదం కాక వేరు ఏ విధంగానూ పాండవులను జయించడం ఎవరి తరం కాదు" అన్నాడు.
ధృతరాష్ట్రుని మనసు జూదానికి అంగీకరించలేదు. “మీరు ఎన్ని చెప్పినా నేను వినను. విదురుడు జూదం అనర్ధ హేతువని చెప్పాడు. అతడు నీతి కోవిదుడు. నేను అతని మాట మీరను. జూదం వదిలి ఎప్పటిలా ఉండు" అని దుర్యోధనునితో అన్నాడు.
దుర్యోధనుడు “తండ్రీ! విదురుడు పాండవ పక్షపాతి అతడు మనకు ఆప్తుడు కాడు. జూదం పురాణంలో ఉంది. స్నేహంతో ఆడుకునే జూదం హాని కాదు. కనుక శకునితో జూదం ఆడటానికి అనుమతి ఇవ్వండి” అన్నాడు.```
*(సశేషం)*
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩*
ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏హా రావు*
🌷🍃🌞🌞🍃🌷
🌹🌷🌞🌞🌞🌞🌷🌹హా రావు*
🌷🍃🌞🌞🍃🌷
🌹🌷🌞🌞🌞🌞🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి