13, డిసెంబర్ 2025, శనివారం

కరుణించు సర్వవేళల

  *జై శ్రీమన్నారాయణ*


*1. కం . కరుణించు సర్వవేళల*

*కరుణించును సర్వజనుల కాంచుచు నుండున్*

*కరుణాకరుడగు విష్ణువు*

*పరమాత్మగ నమ్ముకొనుము వదలక నెపుడున్*


 *2. కం.దామోదరుడగు విష్ణువు*

*నామంబును మరవకుండ నాలుక పైనన్*

*నే మాత్రము విడవకెపుడు*

*ధీమాగా బ్రతకవచ్చు తెలివిగ నెపుడున్*



*3. కం.నీవే గతి యని నమ్మితి*

*నీవున్నను నాకు చాలు నిలుపుట కొరకై*

*నీవే నా రక్ష యనుచు*

*జీవితకాలంబు నంత సేవలు చేయన్*


 *4. కం. జీవాత్మల రక్షించెడు*

*దైవానివి నీవు మాకు దారిని చూపన్*

*సేవింతు సర్వకాలము* 

 *దేవాలయము చేరినాను దీనుడ నగుచున్*


*5 

కం. భగవంతుని నామంబును* 

*నగణితముగ జపము చేసి యాచారముతో*

*పగలను ద్వేషము వీడిన* 

*సుగమం బౌద్ధ పరమ పదము చొప్పున దొరుకున్*


*పద్య కవితా శిల్పకళానిధి. మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు మిట్టాపల్లి*

కామెంట్‌లు లేవు: