24, జులై 2020, శుక్రవారం

మహనీయ జపము..!!


ధర్మరాజుకు భీష్ముడు వివరించాడు.

సాధారణంగా మనందరం నిత్య పూజ చేస్తాము.
పూజ కుదరని వాళ్ళు కనీసం రోజు కొన్ని స్త్రోత్రాలు, దైవానికి సంబంధించిన శ్లోకాలు చదువుకుంటారు.
వీటిలో ప్రాత: స్మరణ శ్లోకాలు అని కొన్ని ఉన్నాయి.

నదులు, వృక్షాలు, పర్వతాలు--ఇలా ప్రకృతికి సంబంధించిన అన్ని అంశాలను పూజించే సంస్కృతీ మనది.

భారతంలో  "మహనీయ జపము " అనే పేరుతో ధర్మరాజుకు  భీష్ముడు వివరించాడు.
ప్రతిరోజూ మహనీయుల స్మరణ ఇలా చేయాలి అన్నాడు.

ముందుగ త్రిమూర్తులైన
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను, 
తరువాత వినాయకుడు, కుమారస్వామి,
వాయువు, సూర్యచంద్రులు, ఇంద్ర, వరుణ, 
యమ, కుబేరులు, కామధేనువు,
సప్త సముద్రములు, గంగాది మహానదులు,
వసు రుద్రాది దేవతలు, పితృదేవతలు,
వాలఖిల్యులు, ( వీరు అంగుశ్త ప్రమాణములో ఉండి వేలాది సంఖ్యలో నిరంతరమూ తపస్సులో ఉండే మునులు, ) వేదవ్యాస నారదాది మహర్షులు,
రంభ మేనకాది దేవతాంగనలు,
దివారాత్రములు,  తారకలు,
మాస, రుతు, సంవత్సరములు,
గరుత్మంతుడు, వాసుకి మొదలయిన మహానాగములు, కాశీ కురుక్షెత్రాది పుణ్య ప్రదేశాలు, నైమిశాది అరణ్యాలు, మేరు, కైలాస, హిమాచాలాది పర్వతాలు,
భూమి, దిశలు, ఆకాసము, పుణ్య వృక్షములు,
మాంధాత మొదలైన షట్ చక్త్రవర్తులు,
ఇత్యాదులను ప్రతి దినము స్మరించడం వలన ఆయురారోగ్యాది సంపదలు మనుష్యునికి
లభించడమే కాక దారిద్ర్యము, వ్యాధి, శోకము నశిస్తాయని భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించాడు.

ప్రతి రోజు..ప్రతివారు పథించవలసిన విష్ణుస్తోత్రము
ఇలా చెప్పాడు..భీష్ముడు...

ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. పురుషోత్తమాయ,నమః.
సర్వలోక గురవే, నమః.
సర్వలోక పిత్రే,నమః.
సర్వలోక పితామహాయ,నమః.
సర్వలోక ప్రపితామహాయ,నమః.
సర్వలోక ప్రదానాయ,నమః.
సర్వ లోకేశ్వరాయనమః.
సర్వలోక విశిష్టాయ, నమః.
సర్వ లోక సుఖప్రదాయ నమః.
సర్వ లోక హర్త్రే,నమః.
సర్వలోక నిధయే నమః.
సర్వ లోక నిదానాయ,నమః.
సర్వ లోక హితాయ నమః.
సర్వ లోక హితకరాయ,నమః.
సర్వ లొకొద్భవాయ నమః.
సర్వ లొకొద్భవ కారాయ,నమో విష్ణవే, ప్రభవిష్ణవే !!

దీనిని స్మరించడం ద్వారా,
ఘోరపాపాలు నశించడం, శుభాలు పొందడం
మాత్రమే కాక, ధర్మాచరణ యందు కోరిక కలుగుతుంది అని భీష్ముడు దీని ఫలితాన్ని చెప్పాడు.

అనాయాస మరణం, పరంలో సౌఖ్యం కావాలి అంటే..
ఇహంలో ధర్మ మార్గం అనుసరించడం ఎంతో ముఖ్యం. ఇట్టి ధర్మాచరణకు నిష్ఠ కలగడానికి భగవంతుని అనుగ్రహం ఎంతో అవసరము.
ధర్మమూ, సౌశీల్యము, లేకుండా చేసే పుణ్య కార్యాలు, జపతపాలు, వినయం లేని పాండిత్యము,
శ్రద్ధ లేని దానము, ఇవేవి మంచి ఫలితాలను ఇవ్వలేవు. కనుక ప్రతి మానవుడు ధర్మ మార్గాన్ని అనుసరించడానికి ప్రయత్నించాలి.🙏
(సేకరణ)

కామెంట్‌లు లేవు: