28, ఆగస్టు 2020, శుక్రవారం

శివామృతలహరి శతకం

.శ్రీ.చిల్లర కృష్ణమూర్తి గారు వ్రాసిన
 #శివామృతలహరి శతకంలోని ఒక పద్యం;
మ||

గతినీవంచు తలంచి కొల్చితిని భర్గా ! భక్తి తాత్పర్య సం
యుత చిత్తమ్మున నీ పదాబ్జముల - సాయుజ్యంబు గాంక్షించి ; దు
ర్గతి వాల్జేసి తొలంగినన్ విడతునే? కాటన్ చిత్రాభస్మమై
శితికంఠా ! తమి నీయెదన్ కులికెదన్ శ్రీ సిద్దలింగేశ్వరా!

భావం;
నువ్వే దిక్కని నమ్ముకొని నిరంతరం నీ నామ జపం చేస్తూ
మోక్షం ప్రసాదించమని భక్తి పూర్వకమైన హృదయంతో నీ
 పాద పద్మాలను ఆశ్రయించి ఉన్నాను. ఒకవేళ
నా ఆశను అడియాశను చేసినా, నిన్ను మాత్రం విడిచిపెట్టను.
నేను  మరణించాక, స్మశానం లో కాలి బూడిడైన తర్వాత కూడా,
నువ్వు ఛాతీ మీద ధరించే విభుదిగా మారి నీ ఎద పై
సంతోషంగా నాట్యం చేస్తూ ఉంటానయ్యా శివా! శ్రీ సిద్ధ లింగేశ్వరా!
( శివుడు స్మశానంలో ఉంటాడని ప్రతీతి అందుకే స్మశానాన్ని రుద్ర భూమి అని కూడా అంటారు.)
*******************

కామెంట్‌లు లేవు: