21, ఆగస్టు 2020, శుక్రవారం

"అన్న ప్రదాత సూర్య భగవానుడు"



సూర్యారాధన సకల శుభాలను ప్రసాదిస్తుంది. జీవజాలం మనుగడకు సూర్యుడే ఆధారం. సూర్యుడు లేకుంటే ప్రపంచం అంధకారంలో మునిగిపోతుంది. ఋతువు లుండవు.రాత్రి పగలు ఉండవు. భూమి మొత్తం మంచుముద్దగా  మారిపోతుంది. .నీరు ఆవిరై మేఘ రూపం ధరించి వర్షంగా కురి సి పంటలు పండే అవకాశం ఉండదు. తాగేందుకు చుక్క.నీరు లభించదు.  గ్రహాలు గతులు తప్పుతాయి. జీవం నశించి పోతుంది.
జీవజాలం మనుగడకు సూర్యుడే ఆధారం అని గ్రహించిన పెద్దలు సూర్యారాధన కు శ్రీకారం చుట్టారు. భగవంతుని అవతారంగా శ్రీ సూర్య నారాయణనునిగా సూర్యుని అర్చించడం..స్తుతించడం ప్రారంభించారు.
సూర్యుని మహిమను ధౌమ్య మహర్షి మహాభారత కథ లో ధర్మరాజుకు తెలియ చెప్పాడు.
 పూర్వ  కాలంలో జీవ రాశి  ఆవిర్భవించిన తొలి నాళ్లలో ఆహారం లభించక ప్రాణులు అలమ టిస్తుండటం చూసి మనసు కరిగిన వాడై సూర్య భగవానుడు ఉత్తర దిక్కుగా పయనించి భూ సారాన్ని గ్రహించి.. దక్షిణ దిక్కుగా పయనించి మేఘ రూపుడై వర్షించి ధాన్యపు విత్తనాలను చంద్రునిలోని అమృతాంశ   చేత వృద్ధి చెందేలా చేసి మానవులతో పాటు ఇతర ప్రాణులకు ఆహారం లభించేలా.. జీవించేలా చేశాడు.
 నహుషుడు, కార్తవీర్యుడు మున్నగు చక్రవర్తులు ఆహారం సూర్యుని అనుగ్రహ ఫలమని గ్రహించిన వారై సూర్యుని ఆరాధించి తరించారు. సమస్త శుభాలను పొందారు.
. కావున ఓ ధర్మ రాజా! నీవు కూడా సూర్యుని ఆరాధించి తరింప వలసినది అంటూ ధౌమ్య మహర్షి ధర్మరాజుకు ఉపదేశించాడు.

 ఆధారం:
మహా భారతం అరణ్య  పర్వం 1  వ ఆశ్వాసం పద్య సంఖ్య  38-39.

 ( సేకరణ...
ఎం వి ఎస్ శాస్త్రి ఒంగోలు 9948409528))
*********************

కామెంట్‌లు లేవు: